తపాలాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్‌మెన్ ఖాళీల భర్తీ కోసం ఆది వారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా...
సాక్షి, విజయవాడ బ్యూరో: తపాలాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్‌మెన్ ఖాళీల భర్తీ కోసం ఆది వారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, నంద్యాల, హైదరాబాద్‌లలో 130 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1.50 లక్షల మందికి గాను 1.10 లక్షల మంది పరీక్ష రాశారని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయ ఉన్నతాధికారులు తెలిపారు. గుంటూరు డివిజన్‌లో ఖాళీగా ఉన్న 14 పోస్టులకు ఒక్కో పోస్టుకు వెయ్యి మంది అభ్యర్థులు పోటీపడ్డారు.