postmen
-
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోస్టుమెన్ నిర్వాకం..
-
ఇంటింటికీ ఆధార్ సేవలు!
న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పోస్టమెన్‌ను వినియోగించుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మొదటి దశలో ఇండియాపోస్ట్ పేమెంట్ బ్యాంక్‌కు చెందిన 48 వేల మంది పోస్ట్మెన్ను రంగంలోకి దించనుంది. వీరు మారుమూల ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి చిన్నారుల పేర్లు నమోదు చేసుకోవడం, ఆధార్‌తో సెల్‌ఫోన్ నంబర్లను లింక్ చేయడం, వివరాలను అప్డేట్ చేయడం వంటి సేవలు అందించనున్నారు. రెండో దశ ప్రణాళికలో భాగంగా 1.50లక్షల మంది తపాలా శాఖ అధికారులను కూడా ఇందులో భాగస్వాములను చేయనుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల వారితోపాటు, సాధ్యమైనంత ఎక్కువ మంది పౌరులకు ఆధార్‌ను అందజేయడమే యూఐడీఏఐ లక్ష్యమన్నారు. ఇంటింటికీ వెళ్లే పోస్ట్‌మెన్ ఆధార్ వివరాలను అక్కడికక్కడే అప్డేట్ చేసేందుకు వీలుగా ట్యాబ్లెట్ పీసీ/ల్యాప్‌టాప్‌లను అందజేస్తామని తెలిపారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 13వేల మంది కామన్ సర్వీస్ సెంటర్ల బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఇందులో భాగంగా చేస్తామన్నారు. ఇంకా దేశవ్యాప్తంగా 755 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఆధార్ సేవా కేంద్రాలను కొత్తగా ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతి రోజూ ఆన్లైన్ ద్వారా కనీసం 50వేల మంది చిరునామా, ఫోన్ నంబర్, ఇతర వివరాలను అప్డేట్ చేసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికీ 12 అంకెల బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య ఆధార్‌ను అందించేందుకు యూఐడీఏఐ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. -
పోస్టల్ బ్యాంకును ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా అవతరించనున్న పోస్టల్ పేమెంట్ బ్యాంకును ఈ రోజు(శనివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంచ్ చేసారు. దేశంలోని సుదూర ప్రాంతాలకు వేగంగా బ్యాంకింగ్ సేవలకు తీసుకెళ్లు ప్రణాళికలో భాగంగా ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) ప్రధానం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ పోస్ట్ మ్యాన్లు విస్తృతమైన సేవలందించారంటూ ప్రధాని ప్రశంసించారు. ఇప్పటివరకూ ఉత్తరాలు, పార్సిళ్లను వారు చేరవేశారు...ఇపుడిక పోస్ట్మాన్ల ద్వారా బ్యాంకింగ్ సేవలు వినియోగదారుల ముంగిటకు వచ్చేశాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోస్ట్మెన్లు ఇంటి వద్దే పోస్టల్ బ్యాంకింగ్ సేవల లభించనున్నాయి. ఇండియా పోస్ట్ దీంతో ప్రభుత్వ రంగ సంస్థ ఐపీపీబీ నుంచి పొదుపు ఖాతాలు, కరెంట్ ఖాతాలు, నగదు బదిలీలు, ప్రత్యక్ష నగదు బదిలీ, బిల్లు, యుటిలిటీ చెల్లింపులు, వ్యాపార చెల్లింపులు వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా 650 శాఖలు, 3250 యాక్సెస్ పాయింట్లలో ఖాతాదారుల ఇళ్ల వద్దకే బ్యాంకింక్ ఫైనాన్షియల్ సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని 1.55 పోస్టాఫీసు శాఖలను ఐపిపిబితో అనుసంధానం డిసెంబర్ 31 నాటికి పూర్తికానుంది. కాగా ప్రభుత్వ సంస్థ అయిన భారత తపాలా శాఖ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పేరుతో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. జనవరి 2017లో పైలట్ ప్రాజెక్టు క్రింద కొన్ని బ్రాంచీల్లో ప్రారంభమైనప్పటికీ అధికారికంగా సెప్టెంబర్ 1న లాంచ్ అయింది. -
ముగిసిన పోస్ట్‌మెన్ ఉద్యోగాల రాత పరీక్ష
సాక్షి, విజయవాడ బ్యూరో: తపాలాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్‌మెన్ ఖాళీల భర్తీ కోసం ఆది వారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, నంద్యాల, హైదరాబాద్‌లలో 130 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1.50 లక్షల మందికి గాను 1.10 లక్షల మంది పరీక్ష రాశారని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయ ఉన్నతాధికారులు తెలిపారు. గుంటూరు డివిజన్లో ఖాళీగా ఉన్న 14 పోస్టులకు ఒక్కో పోస్టుకు వెయ్యి మంది అభ్యర్థులు పోటీపడ్డారు. -
ఆధార్.. గుంపులో గోవిందా
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఎంతో కీలకమైన ఆధార్ కార్డులు పోస్టుమెన్ నిర్లక్ష్యం కారణంగా చేతికందకుండా పోయాయి.ఈ ఘటన దర్గాజోగళ్లిలో చోటు చేసుకుంది. వివరాలు... దర్గాజోగళ్లికి చెందిన నాలుగువేలమంది ఇటీవల కష్టనష్టాలకు ఓర్చి ఆధార్ కేంద్రంలో వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు వారందరికీ సంబంధించిన ఆధార్ కార్డులు గ్రామంలోని పోస్టాఫీసుకు చేరాయి. చిరునామాల ప్రకారం వాటిని ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాల్సిన పోస్ట్‌మెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించి నాలుగు వేల ఆధార్ కార్డులను ఆదివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో అక్కడున్న కొందరికి అందజేసి చేతులు దులుపుకున్నాడు. కార్డులు వచ్చాయన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి చేరుకోగా తోపులాట, తొక్కిసలాట జరిగి తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో కొన్ని కార్డులు చినిగిపోయాయి. మరో వైపు చిన్నారులు, ఆకతాయిలు కట్టలుకట్టలుగా కార్డులుచేతపట్టుకొని పోయారు. కొందరరు రాజకీయ పార్టీల కార్యకర్తలు సైతం తమకు వ్యతిరేకంగా ఉన్నవారి కార్డులు తీసుకెళ్లారు. దీంతో వందలాది మందికికార్డులు అందకుండా పోయాయి. ప్రభుత్వ సౌలభ్యాలు పొందేందుకు తాము ఇన్నాళ్లూ ఆధార్ కార్డులు కోసం వేచి ఉన్నామని, పోస్టుమెన్ నిర్లక్ష్యం కారణంగా చేతికందకుండా పోయాయని విద్యార్థినులు వాపోయారు. ఈఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయాలని స్థానికులు భావించినప్పటికీ ఆదివారం సెలవు కావడంతో మిన్నకుండి పోయారు.