పోస్ట‌ల్ బ్యాంకును ప్రారంభించిన ప్రధాని మోదీ | PM Modi launches India Post Payments Bank, hails postmen for connecting India | Sakshi
Sakshi News home page

పోస్ట‌ల్ బ్యాంకును ప్రారంభించిన ప్రధాని మోదీ

Published Sat, Sep 1 2018 5:01 PM | Last Updated on Sat, Sep 1 2018 5:45 PM

PM Modi launches India Post Payments Bank, hails postmen for connecting India  - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించ‌నున్న పోస్ట‌ల్ పేమెంట్ బ్యాంకును ఈ రోజు(శ‌నివారం) ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ లాంచ్‌ చేసారు. దేశంలోని సుదూర ప్రాంతాలకు వేగంగా బ్యాంకింగ్‌ సేవలకు తీసుకెళ్లు ప్రణాళికలో భాగంగా ఇండియా పోస్టు పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ) ప్రధానం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ పోస్ట్‌ మ్యాన్‌లు విస్తృతమైన సేవలందించారంటూ  ప్రధాని ప్రశంసించారు. ఇప్పటివరకూ ఉత్తరాలు, పార్సిళ్లను వారు చేరవేశారు...ఇపుడిక పోస్ట్‌మాన్ల ద్వారా బ్యాంకింగ్‌ సేవలు వినియోగదారుల ముంగిటకు వచ్చేశాయని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప‌నిచేస్తున్న పోస్ట్‌మెన్లు ఇంటి వ‌ద్దే పోస్ట‌ల్ బ్యాంకింగ్ సేవ‌ల‌ లభించనున్నాయి. ఇండియా పోస్ట్‌ దీంతో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ ఐపీపీబీ నుంచి పొదుపు ఖాతాలు, క‌రెంట్ ఖాతాలు, న‌గ‌దు బ‌దిలీలు, ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ, బిల్లు, యుటిలిటీ చెల్లింపులు, వ్యాపార చెల్లింపులు వంటి సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా 650 శాఖలు, 3250 యాక్సెస్ పాయింట్లలో ఖాతాదారుల ఇళ్ల వద్దకే బ్యాంకింక్‌ ఫైనాన్షియల్ సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని 1.55 పోస్టాఫీసు శాఖలను ఐపిపిబితో అనుసంధానం డిసెంబర్ 31 నాటికి పూర్తికానుంది.

కాగా ప్రభుత్వ సంస్థ అయిన భారత తపాలా శాఖ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పేరుతో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. జనవరి 2017లో పైలట్ ప్రాజెక్టు క్రింద కొన్ని బ్రాంచీల్లో ప్రారంభమైనప్పటికీ అధికారికంగా  సెప్టెంబర్‌ 1న  లాంచ్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement