27న ఎస్సై(కమ్యూనికేషన్, పీటీవో) రాత పరీక్ష
Published Fri, Nov 25 2016 11:56 PM | Last Updated on Sun, Sep 2 2018 3:46 PM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో ఎస్సై (కమ్యూనికేషన్), ఎస్సై (పీటీవో) పోస్టుల భర్తీకి ఈ నెల 27న (ఆదివారం) తుది రాత పరీక్ష నిర్వహిస్తున్నామని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్ పూర్ణచందర్‌రావు తెలిపారు. ఎస్సై కమ్యూనికేషన్ పోస్టులకు ఉదయం 10 నుంచి 1 గంట వరకు, ఎస్సై (పీటీవో) పోస్టులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు టెక్నికల్ పేపర్ పరీ క్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశా రు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని అన్నారు.
Advertisement
Advertisement