కానిస్టేబుల్‌ రాతపరీక్ష ‘కీ’ విడుదల | Constable written test 'key' release | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ రాతపరీక్ష ‘కీ’ విడుదల

Published Sat, Oct 6 2018 2:40 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Constable written test 'key' release - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్‌ ఉద్యోగాల ప్రిలిమినరీ రాత పరీక్ష ‘కీ’ని బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌రావు శుక్రవారం విడుదల చేశారు. రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో కీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ‘కీ’పై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 8లోపు వెబ్‌సైట్‌లో ఉన్న ప్రత్యేక ఫార్మాట్‌ ద్వారా తెలియజేయాలని సూచించారు.

అయితే సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రిలిమినరీ పరీక్ష కన్నా కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షను కఠినంగా ఇచ్చారని, అంతేకాకుండా పలు ప్రశ్నలపై అభ్యంతరాలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై బోర్డు అధికారులకు కానిస్టేబుల్‌ అభ్యర్థులు విజ్ఞప్తులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ రాత పరీక్షపై భారీ స్థాయిలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతాయని బోర్డు అధికారులు భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement