రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ప్రారంభం అయ్యింది.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ప్రారంభం అయ్యింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై పరీక్ష నిర్వహిస్తారు.
2,406 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 8.15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,677 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనం తరువాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను మార్చి 24వ తేదీన జిల్లా కలెక్టర్లకు ఏపీపీఎస్సీ పంపుతుంది. పోస్టుల భర్తీ రెవెన్యూ జిల్లా యూనిట్‌గా జరుగుతుంది. 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ పాయింట్ల ద్వారా ప్రతిభాక్రమాన్ని అనుసరించి పోస్టుల ఎంపికను జిల్లా కలెక్టర్ లేదా జిల్లా ఎంపిక కమిటీ గానీ చేపడుతుంది.