omr sheet
-
టెట్ ప్రాథమిక కీ, తుది కీ మధ్య తేడాలు.. ఇంత‘కీ’ ఏం జరిగింది!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించి ప్రాథమిక ‘కీ’లో వచ్చిన అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడం..తుది ’కీ’ఆలస్యంగా వెబ్సైట్ ఉంచడంతో పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక కీ చూసుకొని పాస్ గ్యారంటీ అనుకున్నవారు కూడా ఫెయిల్ అవ్వడం అనేక సందేహాలకు తావిస్తోంది. ప్రాథమిక కీలో ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్స్ తుది కీ వచ్చే నాటికి మార్చడం కూడా ఈ పరిస్థితికి కారణమని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు నిజమని భావిస్తే, సాధారణంగా రెండు ఆప్షన్లు ఇస్తారని, అప్పుడు అభ్యర్థులకు అన్యాయం జరగదని టెట్ రాసినవారు అంటున్నారు. ఇదేమీలేకుండా, ఆప్షన్లు మార్చడం వల్ల కొంతమంది ఐదు మార్కుల వరకూ కోల్పోయినట్టు చెబుతున్నారు. ఒకటి, రెండు మార్కులు తక్కువై అర్హత సాధించలేని వారు దాదాపు 50 వేల మంది ఉన్నారని అధికారవర్గాలు అంటున్నాయి. అధికారుల గోప్యతపై అనుమానాలు టెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా అధికారులు ఏ విషయంపైనా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. తుది కీ కూడా ఆలస్యంగా వెబ్సైట్లో ఉంచారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు ఏమిటి? అందులో వేటిని పరిగణనలోనికి తీసుకున్నారు? వేటిలో మార్పులు చేశారు? అనే సమాచారం వెల్లడించనేలేదు. టెట్ రాసిన అభ్యర్థులు ఓంఎంఆర్ షీట్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ..టెట్ కన్వినర్‌ను కలిసినా స్పందించలేదు. ఈ విషయమై పలువురు మంత్రిని కలిసి, టెట్, ఆప్షన్ల మార్పు, సమాచారం వెల్లడించకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పరీక్ష, ఫలితాల వెల్లడిపై సరైన సమన్వయం లేదని అధికారవర్గాల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. టెట్ కన్వీనర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని, ఏ సమాచారం చెప్పేందుకు వెళ్లినా ఆమె పట్టించుకోవడం లేదని కొందరు అధికారులు అంటున్నారు. మంత్రి కార్యాలయం నుంచి వచ్చే సూచనలు కూడా పరిశీలించని సందర్భాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహణ తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దారుణంగా దెబ్బతిన్న పేపర్–2 అభ్యర్థులు పేపర్–2కు రాష్ట్రవ్యాప్తంగా 2,08,499 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 1,90,047 మంది పరీక్ష రాశారు. కేవలం 29,073 మంది మాత్రమే అర్హత సాధించారు. జనరల్ కేటగిరీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫలితాలు దారుణంగా పడిపోయాయి. కేవలం 563 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే 3.65 శాతం ఉత్తీర్ణతగా నమోదైంది. జనరల్ కేటగిరీలో 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే అర్హత సాధిస్తారు. ఈ కారణంగా చాలామంది ఫెయిల్ అయినట్టు చెబుతున్నారు. -
తప్పుగా నింపాడని ఓఎంఆర్ షీట్ మింగేశాడు
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో అభ్యర్థి ఓఎంఆర్ షీట్లో తప్పులు నింపాడని ఏకంగా ఆ షీట్నే నమిలి మింగేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మోపాల్ మండలం బోర్గాం(పి) పాఠశాలలో ఏర్పాటుచేసిన ఓ పరీక్షాకేంద్రంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన డీఏవో (డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) పరీక్షకు నిర్మల్ జిల్లాకు చెందిన సహకార శాఖలో క్లర్క్‌గా పని చేస్తున్న అబ్దుల్ ముఖీద్ అనే అభ్యర్థి హాజరయ్యాడు. పరీక్షరాసే క్రమంలో అతడు ఓఎంఆర్ షీట్‌ను తప్పుగా నింపడంతో దానిని చింపి మింగేశాడు. తన బెంచీలో గైర్హాజరైన అభ్యర్థికి సంబంధించిన ఓఎంఆర్ షీట్‌ను తీసుకుని అందులో సమాధానాలు బబ్లింగ్‌చేశాడు. కొంతసేపటికి ఇన్విజిలేటర్ పరీక్షకు హాజరుకాని ఏడుగురు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కలెక్ట్ చేస్తుండగా...ఒకటి తక్కువ వస్తోంది. దీంతో అబ్దుల్ ముఖీద్ పక్కన ఉండాల్సిన ఓఎంఆర్ షీట్ గురించి ఆరా తీశారు. అయితే తనకేం తెలియదని ముందు బుకాయించగా..సీసీ టీవీ ఫుటేజీ పరిశీలనలో ఇతగాడి వ్యవహారం అంతా రికార్డు కావడంతో తప్పు ఒప్పుకున్నాడు. దీంతో సూపరింటెండెంట్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా..ఆర్డీవో వచ్చి పరిశీలించారు. అనంతరం నాల్గవ టౌన్లో అబ్దుల్పై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు. -
తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమినరీ కీ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈమధ్యే నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన కీ విడుదల అయ్యింది. శనివారం సాయంత్రం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కీను అందుబాటులో ఉంచారు. ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఉండనుంది. కీ ఓఎంఆర్ షీట్ల డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి -
తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు అప్లై చేస్తున్నారా? బబ్లింగ్‌తో భద్రం!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షలకు సంబంధించిన నిబంధనలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరింత కఠినతరం చేసింది. దరఖాస్తుల నుంచి ఓఎంఆర్ జవాబుపత్రం దాకా.. వివ రాల నమోదు, సమాధానాల గుర్తింపుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బబ్లింగ్‌లో ఎలాంటి తప్పిదాలు జరిగినా.. డబుల్ బబ్లింగ్ చేసినా.. ఆ అభ్యర్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయబోమని ప్ర కటించింది. దరఖాస్తు చేసే సమయం నుం చే అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి అంశాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూ సుకుని నమో దు చేయాలని సూచించింది. దరఖాస్తుల ప్రక్రియ షురూ..: గ్రూప్–1 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమవుతోంది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఓటీఆర్ (వన్ టైమ్ రిజిస్ట్రేషన్) చేసుకున్న అభ్యర్థులు మాత్రమే గ్రూప్–1కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓటీఆర్ నమోదు చేసుకోనివారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 31వ తేదీ వరకు గ్రూప్–1 దరఖా స్తులను స్వీకరిస్తారు. ఆన్లైన్లో గ్రూప్–1 దరఖాస్తును సమర్పించే అభ్యర్థులు.. వివ రాలన్నీ నింపాక కచ్చితంగా ఒకసారి ప్రి వ్యూ చూసుకుని.. క్షుణ్నంగా పరిశీలించాకే సబ్మిట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలని టీఎస్పీ ఎస్సీ సూచించింది. డబుల్ బబ్లింగ్‌తో ట్రబుల్!: సాధార ణంగా ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ నంబ ర్, ఇతర వివరాలను పూరించడానికి, సమా ధానాలను గుర్తించడానికి.. అంకెలు, అక్షరా లను వినియోగించరు. బదులుగా నిర్దేశిం చిన అంకెలున్న వృత్తాలను బాల్ పాయిం ట్ పెన్‌తో నింపాల్సి ఉంటుంది. అది కూడా ఒక్కో వృత్తాన్ని మాత్రమే పూరించాలి. తప్పుగా వృత్తాలను పూరించిన వారు మళ్లీ అసలు వృత్తాన్ని కూడా నింపితే డబుల్ బబ్లింగ్ అంటారు. గతంలో గ్రూప్– 2 నియామకాల సమయంలో డబుల్ బబ్లింగ్ తీవ్ర వివాదం రేకెత్తించింది. కొందరు అభ్య ర్థులు ఓఎంఆర్ షీట్‌పై డబుల్ బబ్లింగ్ చేయడం, వైట్నర్ వినియోగించడం, ఈ వ్యవహారంపై కొందరు కోర్టుకు వెళ్లడంతో నియామకాల ప్రక్రియ దాదాపు నాలుగేళ్లు నిలిచిపోయింది. దీంతో ఈసారి టీఎస్ పీఎస్సీ ముందుజాగ్రత్తగా కఠిన చర్యలను ప్రకటించింది. అభ్యర్థి డబుల్ బబ్లింగ్ చేస్తే.. సదరు జవాబు పత్రాన్ని మూల్యాం కనం చేయబోమని స్పష్టం చేసింది. సాఫ్ ్టవేర్లో మార్పులు చేశామని, డబుల్ బబ్లింగ్ ఉన్న ఓఎంఆర్ షీట్లు తిరస్కరణకు గురవు తాయని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. సమస్యల పరిష్కారానికి హెల్ప్ డెస్క్ గ్రూప్–1 దరఖాస్తుల సమయంలో ఏవై నా సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్క రించేందుకు టీఎస్పీఎస్సీ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య.. 040– 23542185, 040–2354 2187 నంబర్ల కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసు కోవచ్చు. లేదా help@tspsc.gov.in ’కు ఈ–మెయిల్ చేయవచ్చు. -
ఆ పోస్టులు భర్తీ చేయండి: హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ఓఎంఆర్ పత్రాల్లో బబ్లింగ్ వివాదంపై తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. బబ్లింగ్‌లో తప్పులున్న సమాధాన పత్రాలను అనుమతించొద్దని ఆదేశించింది. తప్పులు చేసినవారి ఓఎంఆర్ షీట్లు మూల్యాంకనం చేయాల్సిన అవసరం లేదన్న న్యాయస్థానం... వివరాలు జాగ్రత్తగా నింపాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని స్పష్టం చేసింది. కాగా వివిధ ఉద్యోగ నియామకాల ఓఎంఆర్ పత్రాల్లో బబ్లింగ్‌లో పొరపాట్లపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా... ఆగిపోయిన నియామకాలు చేపట్టాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మిగిలిన పోస్టుల భర్తీ నియామకాలు చేపట్టేందుకు టీఎస్పీఎస్సీకి అనుమతినిస్తున్నట్లు వెల్లడించింది. -
‘గ్రూప్-2’పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 ఉద్యోగ నియామకాలపై ఉమ్మడి హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఓఎంఆర్‌ను రెండుసార్లు దిద్దినట్లు కనిపించినా, వైట్నర్ వాడినట్లు గుర్తించినా ఆ ఓఎంఆర్‌లను పరిశీలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓఎంఆర్ అన్సర్ షీట్ల పరిశీలనకు ముగ్గురు న్యాయవాదులను నియమించాలని సూచించింది. శని, ఆదివారాల్లో ఓఎంఆర్ ఆన్సర్ షీట్ల పరిశీలన జరుగుతుందని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా పడింది. -
చిరు తప్పిదం.. భారీ మూల్యం
సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల నియామకాలకు సంబంధించి నిర్వహించిన డీఎస్సీ-2014 పరీక్షల్లో ఓఎమ్మార్ షీట్లలో దొర్లిన పొరపాట్లు అభ్యర్థుల కొంపముంచాయి. బబ్లింగ్ (గడులు నింపడం) చేయడంలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా అనేక మందికి మార్కులు తారుమారయ్యాయి. ఫైనల్ ‘కీ’లోని సమాధానాల ఆప్షన్లను పరిశీలించుకొని అంచనా వేసుకున్న మార్కులకు ఫలితాల వెల్లడిలో వచ్చిన మార్కులకు మధ్య వ్యత్యాసం ఉండడంతో అభ్యర్థులు గగ్గోలుపెడుతున్నారు. ఓఎమ్మార్ షీట్లలో సమాధానాల ఆప్షన్లను నింపడంలో అభ్యర్థులు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్న విశ్లేషణను అధికారులు వినిపిస్తున్నారు. ఓఎమ్మార్ షీట్లలోని ఆప్షన్ల గడులను గతంలో పెన్సిల్‌తో నింపే పద్ధతి ఉండగా వాటిని స్కానింగ్ యంత్రాలు సరిగా గుర్తించలేకపోవడంతో ఇబ్బందిగా మారింది. దీంతో పెన్సిల్‌కు బదులు పెన్నుతో నింపే విధానాన్ని ప్రవేశ పెట్టారు. నిర్ణీత ప్రశ్నకు సమాధానంగా గుర్తించిన ఆప్షన్‌కు ఇచ్చిన గడిలోపల మాత్రమే పూర్తిగా నింపాల్సి ఉంటుంది. అప్పుడే స్కానింగ్ యంత్రం దాన్ని మూల్యాంకనం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. గడిని దాటి బయటకు వస్తే స్కానింగ్ యంత్రం దాన్ని స్వీకరించదు. ఇతర ఏ గుర్తులు పెట్టినా, గడుల బయట వేరే మార్కింగ్‌లు చేసినా స్కానింగ్ కాదు. ఈ విషయాలను స్పష్టంగా వివరిస్తూ ఓఎమ్మార్ షీటు వెనుక, అలాగే అభ్యర్థులకు ఇచ్చిన బుక్‌లెట్‌లోనూ పొందుపరిచామని, వాటిని అభ్యర్థులు పూర్తిగా పాటించాల్సి ఉందన్నారు. ఇవేవీ చూసుకోకుండా కొంతమంది గడులను ఇష్టానుసారంగా నింపేశారని చెబుతున్నారు. 50వేలకు పైగా ఓఎమ్మార్ పత్రాల్లో ఇలాంటి తప్పులు దొర్లాయని అధికారులు గుర్తించారు. సిరీస్‌ను గుర్తుపెట్టని అభ్యర్థులు దాదాపు 2వేల మంది అభ్యర్థులు ఓఎమ్మార్ షీట్లలో తాము ఏ సిరీస్ ప్రశ్నపత్రానికి సమాధానాలు గుర్తిస్తున్నారో తెలియచేసే గడులను పూరించకుండా వదిలేశారు. ఇలాంటి వాటిని తిరిగి పరిశీలింపచేసి ఏ కేంద్రంలో ఏ టేబుల్‌కు ఆ ఓఎమ్మార్ పత్రం వెళ్లింది? అక్కడ ఏ సిరీస్ ప్రశ్నపత్రం ఇచ్చిందీ పరిశీలించి ఆమేరకు మళ్లీ స్కానింగ్ చేయాల్సి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఎక్కువమంది ఓ గడిని దాటి రెండో గడిని తాకేలా మార్కు చేశారు. వాటిని స్కానింగ్ యంత్రాలు స్కాన్ చే సి ఉండకపోవచ్చని వివరిస్తున్నారు. అభ్యర్థులు చేసిన పొరపాట్ల కారణంగా ఓఎమ్మార్ షీట్లను స్కానింగ్ యంత్రాలు మూల్యాంకనం చే యకపోవడానికి విద్యాశాఖ బాధ్యత వహించబోదని స్పష్టం చేస్తున్నారు. -
22న ఎంసెట్-2014
- పరీక్ష రాయనున్న 14,186 మంది విద్యార్థులు - గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతి - నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్-2014 పరీక్ష జిల్లాలో ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ ఏడాది జిల్లాలో 14,186 మంది పరీక్ష రాస్తుండగా.. వీరిలో 8,775 మంది ఇంజనీరింగ్, 5,411 మంది మెడికల్ విద్యార్థులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇంజనీరింగ్ విభాగంలో 150 మంది తగ్గగా, మెడికల్‌లో 700 మంది విద్యార్థులు పెరిగారు. కర్నూలు నగరంలో 20 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతుంది. పరీక్షల నిర్వహణ రీజనల్ కో ఆర్డినేటర్‌గా జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాసరెడ్డిని నియమించారు. మెడికల్,అగ్రికల్చర్ పరీక్ష కేంద్రాలు 1. జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 2. సెయింట్ జోసఫ్స్ డిగ్రీ కళాశాల 3. సిస్టర్ స్టాన్సిలాస్ మెమోరియల్ ఇంగ్లిష్ కళాశాల 4. సెయింట్ జోసఫ్స్ స్కూల్ 5. మాంటిస్సోరి హైస్కూల్ 6. బృందావన్ కాలేజ్ ఇంజనీరింగ్ 1. జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 2. సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల(సుంకేసుల రోడ్డు) 3. వాసవీ మహిళా కళాశాల(పెద్దమార్కెట్ వద్ద) 4. జి.పులయ్య ఇంజనీరింగ్ కళాశాల, నందికొట్కూరు రోడ్డు 5. కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల 6. సిస్టర్ స్టాన్సిలాస్ మెమోరియల్ ఇంగ్లిష్ స్కూల్, సుంకేసుల రోడ్డు 7. శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల 8. సెయింట్ జోసఫ్స్ జూనియర్ కళాశాల, నందికొట్కూరు రోడ్డు 9. ఉస్మానియ కళాశాల 10. సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల 11. సెయింట్ జోసఫ్స్ ఇంగ్లిష్ స్కూల్, ఎన్ఆర్ పేట 12. మాంటిస్సోరి హైస్కూల్, ఎ.క్యాంప్ 13. బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి అండ్ సెన్సైస్(బిట్స్), చిన్నటేకూరు 14. ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మెన్), బి.క్యాంపు విద్యార్థులకు సూచనలు, సలహాలు 1. హాల్‌టికెట్లను విద్యార్థులు ఎంసెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. 2. విద్యార్థులు భర్తీ చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారంపై ఫొటో అతికించి గజిటెడ్ ఆఫీసర్‌చే అటెస్టేషన్ చేయించాలి. 3. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి బ్లాక్ /బ్లూ బాల్‌పాయింట్ పెన్, భర్తీ చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే కుల ధ్రువీకరణ పత్రాలు(జిరాక్స్ కాపీలు గజిటెడ్ ఆఫీసర్‌చే సంతకం తప్పనిసరి), ఎంసెట్-2014 హాల్‌టికెట్ తీసుకురావాలి. 4. విద్యార్థులకు పరీక్ష హాలులోకి గంట ముందుగానే అనుమతిస్తారు. 5. సెల్‌ఫోన్, బ్లూటూత్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులతో వస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. 6. విద్యార్థులు తమ పేరు, తండ్రి పేరు, కేటగిరీలలో తప్పులు ఉంటే ముందుగానే నామినల్ రోల్స్‌లో సరిచేయించుకోవాలి. 7. పరీక్ష ముగిసిన తర్వాత ఆన్లైన్ దరఖాస్తు, ఓఎంఆర్ షీటును ఇన్విజిలేటర్‌కు అప్పగించాలి. పరీక్ష పత్రాన్ని వెంట తీసుకెళ్లొచ్చు. -
12న ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్‌కు ఏర్పాట్లు
హైదరాబాద్: ఏపీఆర్జేసీ, ఏపీఆర్‌డీసీలలో ప్రవేశానికి ఈనెల 12న నిర్వహించనున్న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సెట్ కన్వీనర్ పి. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష జిల్లా కేంద్రాలలో ఆరోజు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టరు, విద్యాశాఖాధికారి, జిల్లా కన్వీనర్ పర్యవేక్షణలో పరీక్ష జరుగుతుందని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నెట్లో హాల్‌టికెట్లను సీజీజీ.జీవోవీ.ఐఎన్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 10 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని, హాల్లోకి వచ్చిన వారు 12.30 గంటల వరకు బయటికి వెళ్లేందుకు అనుమతించవద్దని చీఫ్ సూపరింటెండెంట్‌కు ఆదేశించినట్లు తెలిపారు. ఓఎమ్ఆర్ షీట్లను బ్లాక్ లేదా బ్లూ బాల్‌పెన్స్ మాత్రమే వాడాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే నమూనా ఓఎంఆర్ షీట్లను నెట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
పంచాయతీ కార్యదర్శుల రాతపరీక్ష ప్రారంభం
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ప్రారంభం అయ్యింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై పరీక్ష నిర్వహిస్తారు. 2,406 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 8.15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,677 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనం తరువాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను మార్చి 24వ తేదీన జిల్లా కలెక్టర్లకు ఏపీపీఎస్సీ పంపుతుంది. పోస్టుల భర్తీ రెవెన్యూ జిల్లా యూనిట్‌గా జరుగుతుంది. 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ పాయింట్ల ద్వారా ప్రతిభాక్రమాన్ని అనుసరించి పోస్టుల ఎంపికను జిల్లా కలెక్టర్ లేదా జిల్లా ఎంపిక కమిటీ గానీ చేపడుతుంది. -
నేడు పంచాయతీ కార్యదర్శి రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2,677 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఈనెల 23వతేదీన రాత పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. 2,406 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 8.15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు కూడా అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై పరీక్ష నిర్వహిస్తారు. జ వాబు పత్రాల మూల్యాంకనం తరువాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను మార్చి 24వ తేదీన జిల్లా కలెక్టర్లకు ఏపీపీఎస్సీ పంపుతుంది. పోస్టుల భర్తీ రెవెన్యూ జిల్లా యూనిట్‌గా జరుగుతుంది. 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ కేటగిరీలో భర్తీచేస్తారు. రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ పాయింట్ల ద్వారా ప్రతిభాక్రమాన్ని అనుసరించి పోస్టుల ఎంపికను జిల్లా కలెక్టర్ లేదా జిల్లా ఎంపిక కమిటీ గానీ చేపడుతుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి: ఓఎంఆర్ జవాబు పత్రంలో బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తోనే పరీక్ష రాయాలి. పెన్సిల్‌తో రాయకూడదు. వైట్నర్ను ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించడానికి వీల్లేదు. ఉపయోగిస్తే మూల్యాంకనం చేయరు. పౌడర్, రబ్బరు, బ్లేడ్ వినియోగించినా మూల్యాంకనం చేయరు. ఓఎంఆర్ ఒరిజినల్ జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. డూప్లికేట్ జవాబు పత్రాన్ని మాత్రమే అభ్యర్థి తీసుకెళ్లాలి. -
నేడు వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు సర్వం సిద్ధమయ్యాయి. ఇందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. పలువురు సుదూర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు శనివారం సాయంత్రమే పరీక్ష సెంటర్ల వద్దకు చేరారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం 3,555 మంది అధికారులను నియమించింది. కాగా, పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అభ్యర్థులను అనుమతించకూడదని కలెక్టర్ అహ్మద్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఇద్దరు పోలీస్ సిబ్బంది చొప్పున 490 మందిని నియమించారు. అభ్యర్థులకు సూచనలు.. పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి. హాల్ టికెట్, రైటింగ్ ప్యాడ్, బాల్ పెన్ (బ్లూ/బ్లాక్) వెంట తెచ్చుకోవాలి. హాల్ టిక్కెట్ వెంట తీసుకురావాలి. ఒకవేళ హాల్‌టికెట్‌పై ఫొటో లేకుంటే వాటిపై ఫొటోలు అతికించి గెజిటెడ్ అధికారులు సంతకం తీసుకోవాలి. నిమిషం అలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకూ పరీక్ష కేంద్ర వదిలి వెళ్లరాదు. జవాబు పత్రంలో మొదట హాల్‌టికెట్ నంబర్, పేపర్‌కోడ్, పరీక్ష బుక్లెట్ సిరీస్ (ఏ,బీ,సీ,డీ)లను వాటికి నిర్ణయించిన స్థలంలో బ్లూ/బ్లాక్ పెన్ను ఉపయోగించి రాయాలి. వీటిని తప్పుగా నమోదు చేస్తే జవాబు పత్రం చెల్లదు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు, పరీక్ష రాసే సమయంలో వీడియో తీస్తారు. అభ్యర్థుల వేలిముద్రలు కూడా సేకరిస్తారు. ఓఎంఆర్ పత్రాలు రెండు ఇస్తారు. మధ్యలో కార్బన్ పెట్టి ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక ఓఎంఆర్ పత్రాన్ని ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. మరో (డూప్లికేట్) ఓఎంఆర్ పత్రాన్ని అభ్యర్థులు తీసుకెళ్లవచ్చు. ఓఎంఆర్ షీట్‌పై బ్లేడ్, వైట్నర్, ఎరెజర్ లాంటివి ఉపయోగించి దిద్దరాదు. అలా చేస్తే ఓఎంఆర్ షీట్ చెల్లుబాటు కాదు. ఒకేసారి సమాధానం రాయాల్సి ఉంటుంది. తప్పుగా రాసినట్లు భావించి దాన్ని తొలగించి మళ్లీ రాసినట్లైతే అది చెల్లదు. సెల్ఫోన్లు, కాలిక్యూలెటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష హాలులోకి అనుమతించరు. మాల్ ప్రాక్టీస్, దుష్ర్పవర్తనకు పాల్పడితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పరీక్ష నియమావళి చట్టం 1997 ప్రకారం శిక్షిస్తారు. {పశ్నపత్రంపై సమాధానాలు గుర్తించరాదు. ఇతర అభ్యర్థులతో మాట్లాడడం, సమాచారాన్ని చేరవేయడం వంటివి చేయకూడదు. అధికార యంత్రాంగం సూచనలు.. పరీక్ష రోజు జిరాక్స్ సెంటర్లు తెరవకుండా చూడాలి. ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో నడిపేలా చూడాలి. {పథమ చికిత్స కోసం పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంలను నియమించాలి పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలి.