నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కేంద్రాల వద్ద 144 సెక్షన్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు సర్వం సిద్ధమయ్యాయి. ఇందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. పలువురు సుదూర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు శనివారం సాయంత్రమే పరీక్ష సెంటర్ల వద్దకు చేరారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం 3,555 మంది అధికారులను నియమించింది. కాగా, పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అభ్యర్థులను అనుమతించకూడదని కలెక్టర్ అహ్మద్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఇద్దరు పోలీస్ సిబ్బంది చొప్పున 490 మందిని నియమించారు.
అభ్యర్థులకు సూచనలు..
పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి. హాల్ టికెట్, రైటింగ్ ప్యాడ్, బాల్ పెన్ (బ్లూ/బ్లాక్) వెంట తెచ్చుకోవాలి.
హాల్ టిక్కెట్ వెంట తీసుకురావాలి. ఒకవేళ హాల్‌టికెట్‌పై ఫొటో లేకుంటే వాటిపై ఫొటోలు అతికించి గెజిటెడ్ అధికారులు సంతకం తీసుకోవాలి.
నిమిషం అలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు.
పరీక్ష సమయం పూర్తయ్యే వరకూ పరీక్ష కేంద్ర వదిలి వెళ్లరాదు.
జవాబు పత్రంలో మొదట హాల్‌టికెట్ నంబర్, పేపర్‌కోడ్, పరీక్ష బుక్‌లెట్ సిరీస్ (ఏ,బీ,సీ,డీ)లను వాటికి నిర్ణయించిన స్థలంలో బ్లూ/బ్లాక్ పెన్‌ను ఉపయోగించి రాయాలి. వీటిని తప్పుగా నమోదు చేస్తే జవాబు పత్రం చెల్లదు.
అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు, పరీక్ష రాసే సమయంలో వీడియో తీస్తారు. అభ్యర్థుల వేలిముద్రలు కూడా సేకరిస్తారు.
ఓఎంఆర్ పత్రాలు రెండు ఇస్తారు. మధ్యలో కార్బన్ పెట్టి ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక ఓఎంఆర్ పత్రాన్ని ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. మరో (డూప్లికేట్) ఓఎంఆర్ పత్రాన్ని అభ్యర్థులు తీసుకెళ్లవచ్చు.
ఓఎంఆర్ షీట్‌పై బ్లేడ్, వైట్‌నర్, ఎరెజర్ లాంటివి ఉపయోగించి దిద్దరాదు. అలా చేస్తే ఓఎంఆర్ షీట్ చెల్లుబాటు కాదు.
ఒకేసారి సమాధానం రాయాల్సి ఉంటుంది. తప్పుగా రాసినట్లు భావించి దాన్ని తొలగించి మళ్లీ రాసినట్లైతే అది చెల్లదు.
సెల్‌ఫోన్లు, కాలిక్యూలెటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష హాలులోకి అనుమతించరు.
మాల్ ప్రాక్టీస్, దుష్ర్పవర్తనకు పాల్పడితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పరీక్ష నియమావళి చట్టం 1997 ప్రకారం శిక్షిస్తారు.
{పశ్నపత్రంపై సమాధానాలు గుర్తించరాదు. ఇతర అభ్యర్థులతో మాట్లాడడం, సమాచారాన్ని చేరవేయడం వంటివి చేయకూడదు.
అధికార యంత్రాంగం సూచనలు..
పరీక్ష రోజు జిరాక్స్ సెంటర్లు తెరవకుండా చూడాలి.
ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో నడిపేలా చూడాలి.
{పథమ చికిత్స కోసం పరీక్ష కేంద్రాల్లో ఏఎన్‌ఎంలను నియమించాలి
పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలి.
నేడు వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలు
Published Sun, Feb 2 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement
Advertisement