VRO/VRA exams
-
వీ ఆర్ రెడీ
వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షకు అంతా సిద్ధం అర నిముషం ఆలస్యమైనా ఇంటికే ఎప్పటికప్పుడు సమీక్షించనున్న సీసీఎల్ఎ, కలెక్టర్ పర్యవేక్షణకు 16 సంచార బృందాలు ప్రధాన కేంద్రాలన్నింటికీ బస్సు సౌకర్యం 25 రూట్లలో ప్రత్యేక ప్లయింగ్ స్క్వాడ్ సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్ తెల్లారింది... ఇక లేవండి... ఇన్ని రోజులుగా పుస్తకాలతో కుస్తీ పట్టిన అభ్యర్థులూ వెంటనే పరీక్ష కేంద్రాలకు బ యలుదేరండి. ఆదివారం జరుగనున్న వీఆర్ఓ, వీఆర్ ఏ పరీక్షల కోసం జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 65 వీఆర్ఓ, 94 వీ ఆర్ఏ పోస్టులను భర్తీ చే యనున్నారు. అభ్యర్థులు ఉదయం తొమ్మిది గంటల వరకు జ్ట్టిఞ://ఛిఛ్చి.ఛిజజ.జౌఠి.జీ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కలెక్టరేట్, న్యూస్‌లైన్: పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ ప్రద్యుమ్న తగు ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులకు కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. తాగునీరు, షామియానాలు సమకూరుస్తున్నారు. కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ పరీక్ష కేంద్రాల చుట్లూ 144వ సెక్షన్‌ను అమలు చేయనున్నారు. అభ్యర్థులు, ఇతరులు ఎవ్వరూ గుంపుగా ఉండడానికి వీలు లేదు. పరీక్షలు సజావుగా జరుగడానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అన్ని కేంద్రాలలో వీడియో తీస్తారు. అభ్యర్థుల వేలిముద్రలు సేకరిస్తారు. ఓఎంఆర్ పత్రాలు, ప్రశ్న పత్రాలు రాత్రి జిల్లాకు చేరుకున్నాయి. వాటిని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. 20న ఫలితాలు వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షల నిర్వహణ ఎంత తొందరగా జరగుతోందో, అంతే వేగంగా ఫలితాలు కూడా రానున్నాయి. ఈ నెల నాలుగున ప్రాథమిక కీ, పదిన పైనల్ కీ విడుదల చేస్తారు. 20న ఫలితాలు వెల్లడవుతాయి. ఎంపికైనవారికి నెలఖారులోగా నియామక పత్రాలు కూడ అందించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12గం.ల వరకు వీఆర్ఓ పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వీఆర్ఏ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. అర నిముషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించరు. 25 మంది రూట్ అధికారులను నియమించారు. రెండు వేల మంది ఇన్విజిలేటర్లు, 131 మంది ముఖ్య పర్యవేక్షకులు, లైజన్ విధులు నిర్వహించనున్నారు. అభ్యర్థులు సెల్ఫోన్లు, క్యాలికులేటర్లు వెంట తెచ్చుకోవద్దు, రైటింగ్ ప్యాడ్ తప్పక తెచ్చుకోవాలి. బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే ఉపయోగించాలి. ఇన్విజిలేటర్లు, లైజన్ అధికారులు, ముఖ్య పర్యవేక్ష కులు ఉదయం ఏడు గంటలకే కేంద్రాలకు చేరుకోవాలి. అదనపు జేసీ, సబ్ కలెక్టర్, సీఈఓ, ఆర్డీఒలు పరీక్షలను పర్యవేక్షిస్తారు. నగరంలోనే కాకుండా, డిచ్పల్లి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ, ధర్మారంలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామినల్ రోల్స్‌పై అభ్యర్థి ఫొటో ప్రింట్ లేకపోతే, గెజిటెడ్ అధికారి అటెస్ట్ చేసిన మూడు ఫొటోలను తెచ్చుకోవాలి. {పశ్నపత్రం తెలుగు/ఇంగ్లిష్/ ఉర్దు భాషలలో, 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. వికలాంగుల కోసం సహాయకులను నియమిస్తారు. -
నేడు వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు సర్వం సిద్ధమయ్యాయి. ఇందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. పలువురు సుదూర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు శనివారం సాయంత్రమే పరీక్ష సెంటర్ల వద్దకు చేరారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం 3,555 మంది అధికారులను నియమించింది. కాగా, పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అభ్యర్థులను అనుమతించకూడదని కలెక్టర్ అహ్మద్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఇద్దరు పోలీస్ సిబ్బంది చొప్పున 490 మందిని నియమించారు. అభ్యర్థులకు సూచనలు.. పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి. హాల్ టికెట్, రైటింగ్ ప్యాడ్, బాల్ పెన్ (బ్లూ/బ్లాక్) వెంట తెచ్చుకోవాలి. హాల్ టిక్కెట్ వెంట తీసుకురావాలి. ఒకవేళ హాల్‌టికెట్‌పై ఫొటో లేకుంటే వాటిపై ఫొటోలు అతికించి గెజిటెడ్ అధికారులు సంతకం తీసుకోవాలి. నిమిషం అలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకూ పరీక్ష కేంద్ర వదిలి వెళ్లరాదు. జవాబు పత్రంలో మొదట హాల్‌టికెట్ నంబర్, పేపర్‌కోడ్, పరీక్ష బుక్లెట్ సిరీస్ (ఏ,బీ,సీ,డీ)లను వాటికి నిర్ణయించిన స్థలంలో బ్లూ/బ్లాక్ పెన్ను ఉపయోగించి రాయాలి. వీటిని తప్పుగా నమోదు చేస్తే జవాబు పత్రం చెల్లదు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు, పరీక్ష రాసే సమయంలో వీడియో తీస్తారు. అభ్యర్థుల వేలిముద్రలు కూడా సేకరిస్తారు. ఓఎంఆర్ పత్రాలు రెండు ఇస్తారు. మధ్యలో కార్బన్ పెట్టి ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక ఓఎంఆర్ పత్రాన్ని ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. మరో (డూప్లికేట్) ఓఎంఆర్ పత్రాన్ని అభ్యర్థులు తీసుకెళ్లవచ్చు. ఓఎంఆర్ షీట్‌పై బ్లేడ్, వైట్నర్, ఎరెజర్ లాంటివి ఉపయోగించి దిద్దరాదు. అలా చేస్తే ఓఎంఆర్ షీట్ చెల్లుబాటు కాదు. ఒకేసారి సమాధానం రాయాల్సి ఉంటుంది. తప్పుగా రాసినట్లు భావించి దాన్ని తొలగించి మళ్లీ రాసినట్లైతే అది చెల్లదు. సెల్ఫోన్లు, కాలిక్యూలెటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష హాలులోకి అనుమతించరు. మాల్ ప్రాక్టీస్, దుష్ర్పవర్తనకు పాల్పడితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పరీక్ష నియమావళి చట్టం 1997 ప్రకారం శిక్షిస్తారు. {పశ్నపత్రంపై సమాధానాలు గుర్తించరాదు. ఇతర అభ్యర్థులతో మాట్లాడడం, సమాచారాన్ని చేరవేయడం వంటివి చేయకూడదు. అధికార యంత్రాంగం సూచనలు.. పరీక్ష రోజు జిరాక్స్ సెంటర్లు తెరవకుండా చూడాలి. ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో నడిపేలా చూడాలి. {పథమ చికిత్స కోసం పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంలను నియమించాలి పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలి. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. బ్లాక్, బ్లూ బాల్‌పాయింట్ పెన్, హాల్‌టికెట్‌తో మాత్రమే అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్, లైజన్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 2న వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షల కోసం 154 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 60,463 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. వీఆర్ఓ పోస్టులకు 57,820 మంది, వీఆర్ఏ పోస్టులకు 2,643 మంది హాజరవుతున్నారన్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్ఓ, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్ఏ పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, రామచంద్రాపురం బస్టాండ్లలో ఈ నెల 30వ తేదీ నుంచే పరీక్ష కేంద్రాల వివరాలను వాటి మధ్య ఉన్న దూరాన్ని తెలియజేస్తూ హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జేసీ డాక్టర్ ఎ. శరత్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఎడమ చేతి బొటన వేలిముద్రను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఏపీపీఎస్సీ నియమ నిబంధనలను క్షుణ్ణంగా చదివి ఆ మేరకు పరీక్ష నిర్వహణ చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాన్ని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు వీడియో ద్వారా చిత్రీకరించేలా ఆర్డీఓలు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ ఒక్క అభ్యర్థి కింద కూర్చోకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షలకు హాజరవుతున్న అంధులకు, రెండు చేతులు లేనివారికి పదో తరగతి చదివే విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. వీఆర్వోలకు 999 కోడ్, వీఆర్ఏలకు 888 కోడ్ ఉంటుందని వాటిని పరిశీలించి తగిన జాగ్రత్త వహించాల్సిందిగా ఏపీపీఎస్సీ పరిశీలకులు తెలిపారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సాయిలు, కలెక్టరేట్ ఏవో శివకుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు ధర్మారావు, ముత్యంరెడ్డి, వనజాదేవి, తహశీల్దార్లు, ఎంపీడీవో, వ్యవసాయశాఖ అధికారులు, వివిధ కళాశాలలు, పాఠశాలల ప్రిన్సిపాల్స్, ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇక ‘పరీక్షే’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ సోమవారం నాటితో ముగిసింది. మొత్తం 78,881 మంది అభ్యర్థులు దరఖాస్తుచేసుకున్నారు. వీరిలో వీఆర్ఓ పోస్టులకు 73,353 మంది, వీఆర్ఏ పోస్టులకు 3148 మంది.. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు 2,380 పోటీ పడుతున్నారు. జిల్లాలో 105 వీఆర్ఓ పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఒక్కో పోస్టుకు 721 మంది మధ్య పోటీ నెలకొంది. మొత్తం దరఖాస్తుదారుల్లో వికలాంగులు 2,149 మంది ఉన్నారు. 2011లో 58 వీఆర్ఓ పోస్టులను భర్తీ చేశారు. అప్పట్లో 59వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు గడువు పూర్తి కావడంతో మంగళవారం పరిశీలన కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రధానంగా ఫొటోలు సంతకాలను పరిశీలిస్తారు. ఫొటో ఉండి సంతకం చేయనివి, సంతకం ఉండి ఫొటోలు లేని గుర్తిస్తారు. ఇలాంటి దరఖాస్తుదారులు రాత పరీక్షకు వచ్చే రోజు ఫొటోపై గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకురావాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. పరిశీలన కోసం 25 మంది రెవెన్యూ ఉద్యోగులను పండగ రోజు కూడా కలెక్టర్ కార్యాలయానికి పిలిపించారు. అనవసరమైనన్ని కంప్యూటర్లను కూడా సిద్ధం చేశారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడంతో అధికార యంత్రాంగం రాత పరీక్షకు అవసరమైన సెంటర్లను గుర్తించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రాథమికంగా సెంటర్లను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 254 సెంటర్లు ఏర్పాటు చేయతలపెట్టారు. అత్యధికంగా కర్నూలులో ఏడు సెంటర్లు ఏర్పాటు చేస్తుండగా మిగిలిన వాటిని నంద్యాల, ఆదోని, నందికొట్కూరు, డోన్, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, బనగానపల్లె, గూడూరు, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వీఆర్ఓ అభ్యర్థులకు.. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్ఏ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది. ఈనెల 19 నుంచి ఇంటర్నెట్లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.