వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షకు అంతా సిద్ధం
అర నిముషం ఆలస్యమైనా ఇంటికే
ఎప్పటికప్పుడు సమీక్షించనున్న సీసీఎల్‌ఎ, కలెక్టర్
పర్యవేక్షణకు 16 సంచార బృందాలు
ప్రధాన కేంద్రాలన్నింటికీ బస్సు సౌకర్యం
25 రూట్లలో ప్రత్యేక ప్లయింగ్ స్క్వాడ్
సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్
తెల్లారింది... ఇక లేవండి... ఇన్ని రోజులుగా పుస్తకాలతో కుస్తీ పట్టిన అభ్యర్థులూ వెంటనే పరీక్ష కేంద్రాలకు బ యలుదేరండి. ఆదివారం జరుగనున్న వీఆర్‌ఓ, వీఆర్ ఏ పరీక్షల కోసం జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 65 వీఆర్‌ఓ, 94 వీ ఆర్‌ఏ పోస్టులను భర్తీ చే యనున్నారు. అభ్యర్థులు ఉదయం తొమ్మిది గంటల వరకు జ్ట్టిఞ://ఛిఛ్చి.ఛిజజ.జౌఠి.జీ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్:
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ ప్రద్యుమ్న తగు ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులకు కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. తాగునీరు, షామియానాలు సమకూరుస్తున్నారు.
కేంద్రాల చుట్టూ 144 సెక్షన్
పరీక్ష కేంద్రాల చుట్లూ 144వ సెక్షన్‌ను అమలు చేయనున్నారు. అభ్యర్థులు, ఇతరులు ఎవ్వరూ గుంపుగా ఉండడానికి వీలు లేదు. పరీక్షలు సజావుగా జరుగడానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అన్ని కేంద్రాలలో వీడియో తీస్తారు. అభ్యర్థుల వేలిముద్రలు సేకరిస్తారు. ఓఎంఆర్ పత్రాలు, ప్రశ్న పత్రాలు రాత్రి జిల్లాకు చేరుకున్నాయి. వాటిని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు.
20న ఫలితాలు
వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షల నిర్వహణ ఎంత తొందరగా జరగుతోందో, అంతే వేగంగా ఫలితాలు కూడా రానున్నాయి. ఈ నెల నాలుగున ప్రాథమిక కీ, పదిన పైనల్ కీ విడుదల చేస్తారు. 20న ఫలితాలు వెల్లడవుతాయి. ఎంపికైనవారికి నెలఖారులోగా నియామక పత్రాలు కూడ అందించనున్నారు.
ఉదయం 10 గంటల నుంచి 12గం.ల వరకు వీఆర్‌ఓ పరీక్ష జరుగుతుంది.
మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వీఆర్‌ఏ పరీక్ష ఉంటుంది.
అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
అర నిముషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించరు.
25 మంది రూట్ అధికారులను నియమించారు.
రెండు వేల మంది ఇన్విజిలేటర్‌లు, 131 మంది ముఖ్య పర్యవేక్షకులు, లైజన్ విధులు నిర్వహించనున్నారు.
అభ్యర్థులు సెల్‌ఫోన్లు, క్యాలికులేటర్లు వెంట తెచ్చుకోవద్దు, రైటింగ్ ప్యాడ్ తప్పక తెచ్చుకోవాలి.
బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే ఉపయోగించాలి.
ఇన్విజిలేటర్లు, లైజన్ అధికారులు, ముఖ్య పర్యవేక్ష కులు ఉదయం ఏడు గంటలకే కేంద్రాలకు చేరుకోవాలి.
అదనపు జేసీ, సబ్ కలెక్టర్, సీఈఓ, ఆర్‌డీఒలు పరీక్షలను పర్యవేక్షిస్తారు.
నగరంలోనే కాకుండా, డిచ్‌పల్లి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ, ధర్మారంలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నామినల్ రోల్స్‌పై అభ్యర్థి ఫొటో ప్రింట్ లేకపోతే, గెజిటెడ్ అధికారి అటెస్ట్ చేసిన మూడు ఫొటోలను తెచ్చుకోవాలి.
{పశ్నపత్రం తెలుగు/ఇంగ్లిష్/ ఉర్దు భాషలలో, 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఉంటుంది.
వికలాంగుల కోసం సహాయకులను నియమిస్తారు.
వీ ఆర్ రెడీ
Published Sun, Feb 2 2014 2:53 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement
Advertisement