సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ఓఎంఆర్ పత్రాల్లో బబ్లింగ్ వివాదంపై తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. బబ్లింగ్‌లో తప్పులున్న సమాధాన పత్రాలను అనుమతించొద్దని ఆదేశించింది. తప్పులు చేసినవారి ఓఎంఆర్ షీట్లు మూల్యాంకనం చేయాల్సిన అవసరం లేదన్న న్యాయస్థానం... వివరాలు జాగ్రత్తగా నింపాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని స్పష్టం చేసింది.
కాగా వివిధ ఉద్యోగ నియామకాల ఓఎంఆర్ పత్రాల్లో బబ్లింగ్‌లో పొరపాట్లపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా... ఆగిపోయిన నియామకాలు చేపట్టాలని టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మిగిలిన పోస్టుల భర్తీ నియామకాలు చేపట్టేందుకు టీఎస్‌పీఎస్సీకి అనుమతినిస్తున్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment