సాక్షి,హైదరాబాద్ : గ్రూప్–1పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం రెండోసారి గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా..హైకోర్టు ప్రిలిమ్స్ మాత్రమే రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని పిటీషనర్ వాదించారు. ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10కి పెంచడానికి వీలులేదని తెలిపారు.
అనంతరం, టీఎస్‌పీఎస్సీకి అన్ని అధికారలుంటాయని స్పెషల్ జీపీ (గవర్నమెంట్ ప్లీడర్)..చట్ట బద్ధంగా ఏర్పాటైన సంస్థ నియాకాల కోసం నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించారు. ఇరుపక్ష వాదనల విన్న కోర్టు తదుపరి విచారణ సోమవారానికి (అక్టోబర్1కి) వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment