
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. గ్రూప్-1 పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలంటూ 36 మంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 వాయిదా పిటిషన్‌పై కోర్టుకు అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు.
36 మంది అభ్యర్థుల కోసం 3 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తు పణంగా పెట్టగలమా అన్న ఏజీ.. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. విచారణను నాలుగు వారాల పాటు కోర్టు వాయిదా వేసింది.
గతేడాది అక్టోబర్‌లో గ్రూప్ వన్ పరీక్ష జరిగింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే.. పేపర్ లీక్ వ్యవహారంతో గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. తిరిగి జూన్ 11 న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈలోపు పరీక్ష వాయిదా కోరుతూ 36 మంది అభ్యర్థులు కోర్టుకెక్కడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment