Prelims Exam
-
గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు.. హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. కాగా జూన్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీఎస్పీఎస్సీ ఆశ్రయించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎస్పీఎస్సీ రూల్స్ పాటించలేదని, పరీక్షను సరిగా నిర్వహించలేకపోయిందని మండిపడింది. ఈ మేరక ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని తీర్పు వెల్లడించింది. ఈ సారి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలని తెలిపింది. ఇదిలా ఉండగా గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్ నిర్వహించగా.. ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో ఆ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. మళ్లీ ఈ ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా.. ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చింది. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దు అయ్యింది. చదవండి: టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి -
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ రద్దు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నేడు తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్
-
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. గ్రూప్-1 పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలంటూ 36 మంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 వాయిదా పిటిషన్‌పై కోర్టుకు అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు. 36 మంది అభ్యర్థుల కోసం 3 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తు పణంగా పెట్టగలమా అన్న ఏజీ.. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. విచారణను నాలుగు వారాల పాటు కోర్టు వాయిదా వేసింది. గతేడాది అక్టోబర్‌లో గ్రూప్ వన్ పరీక్ష జరిగింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే.. పేపర్ లీక్ వ్యవహారంతో గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. తిరిగి జూన్ 11 న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈలోపు పరీక్ష వాయిదా కోరుతూ 36 మంది అభ్యర్థులు కోర్టుకెక్కడం గమనార్హం. -
కాసేపట్లో ఏపీలో ఎస్సై ప్రిలిమ్స్ రాతపరీక్ష
-
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి టీఎస్పీఎస్సీకి హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి టీఎస్పీఎస్సీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై టీఎస్‌పీఎస్‌స్సీ అప్పీల్స్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలితాలు వెల్లడించవచ్చని చెప్పిన తెలంగాణ హైకోర్టు.. అభ్యర్థి స్థానికత వివాదం తర్వాత తేలుస్తామని తెలిపింది. చదవండి: మోదీ వ్యూహం ఏంటి?.. కేసీఆర్ తడాఖా చూపిస్తాడా? -
‘పోలీస్’ పరీక్షలో 7 మార్కులు కలపడంపై హర్షం
ముషీరాబాద్ (హైదరాబాద్): ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థులకు 7 మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తంచేశారు. ఇది పోలీస్ కానిస్టేబుళ్ల, ఎస్సై అభ్యర్థుల పోరాట ఫలితమేనని స్పష్టంచేశారు. మల్టిపుల్లోని 7 తప్పుడు ప్రశ్నలకు 7 మార్కులు కలపాలని హైకోర్టు జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో పలు కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు విద్యానగర్‌లోని బీసీ భవన్ వద్ద సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 6 లక్షల మంది రాసిన ఈ పరీక్షలో కేవలం 1,84,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని, 4 లక్షల మందికి పైగా అర్హత సాధించలేకపోయారని తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, మాసం ప్రదీప్, రాజ్‌కుమార్, నీలం వెంకటేశ్, చందన, రాజా, సునీత, దివ్య, రాజమల్లేశ్, శివ, కల్యాణ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ఆదివారం గ్రూప్–1 పరీక్ష నిర్వహించనుంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో ఇప్పటికే 90 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మిగతా అభ్యర్థులు పరీక్ష ప్రారంభం నాటికి డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటును కమిషన్ కల్పించింది. బయోమెట్రిక్ హాజరు నేపథ్యంలో ఉదయం 8:30 గంటల నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని... ఉదయం 10:15 గంటలకుమించి ఒక్క సెకన్ ఆలస్యమైనా అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించబోమని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. 3 రోజుల్లో ప్రాథమిక కీ విడుదల... పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీ చేపడుతుండటంతో టీఎస్పీఎస్సీ అత్యంత పారదర్శకంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి పరీక్షా కేంద్రాన్ని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తోంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రశ్నపత్రం కోడింగ్‌లోనూ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఏ, బీ, సీ, డీ అక్షరాల్లో ప్రశ్నపత్రం కోడ్ ఉండగా ఇప్పుడు 6 అంకెల కోడ్‌ను ఉపయోగిస్తోంది. దీంతో అభ్యర్థులు ప్రశ్నపత్రం కోడ్‌ను నిర్దేశించిన చోట జాగ్రత్తగా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో కాపీయింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రిలిమినరీ ‘కీ’ని వారంలో విడుదల చేయాలని అధికారులు ముందుగా భావించినప్పటికీ ఆ తర్వాత 3 రోజుల్లోనే విడుదల చేసేలా చర్యలు తీసుకుంది. ప్రాథమిక ‘కీ’విడుదల తర్వాత వాటిపై అభ్యంతరాలను స్వీకరించి తుది ‘కీ’ని విడుదల చేయనుంది. ప్రతి జిల్లాలో హెల్ప్‌లైన్... గ్రూప్–1 పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ప్రతి జిల్లా కలెక్టరేట్ పరిధిలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాలు, హాల్టికెట్లలో తప్పొప్పులు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తితే సంబంధిత జిల్లా హెల్ప్‌లైన్ కేంద్రానికి ఫోన్ చేసి సంప్రదించాలని అభ్యర్థులకు సూచించింది. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని... ఎగ్జామ్ సెంటర్లలో గోడ గడియారాలు, డిజిటల్ క్లాక్‌లు కూడా ఉండవని పేర్కొంది. ప్రతి అరగంటకోసారి బెల్ మోగించి సమయాన్ని గుర్తుచేస్తామని తెలిపింది. -
TS: అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షపై స్పష్టత ఇచ్చింది. ఇదివరకే గ్రూప్–1 నోటిఫికేషన్లో వెల్లడించినట్లుగా ప్రిలిమ్స్ పరీక్షను జూలై/ఆగస్టు నెలల్లో నిర్వహించాల్సి ఉండగా, వివిధ కారణాలతో అక్టోబర్‌కు వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన కమిషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష తేదీ ఖరారుకు సంబంధించి చర్చ జరిగింది. వివిధ రకాల పరీక్షలున్న సమయంలో గ్రూప్–1 పరీక్ష నిర్వహించొద్దని, తేదీని కొన్నిరోజులు వాయిదా వేయాలని పలువురు టీఎస్పీఎస్సీకి వినతులు, లేఖలు సమర్పించారు. ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో పోలీసు ఉద్యోగాల అర్హత పరీక్షలు, జాతీయ స్థాయిలో యూపీఎస్సీ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ ఉద్యోగ అర్హత పరీక్షలు కూడా ఉన్నాయి. గ్రూప్–1 ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భారీ స్పందన వచ్చినందున సన్నద్ధతకు మరిం త సమయం ఇవ్వాలంటూ కోరడంతో కమిషన్ సానుకూలంగా స్పందించింది. మరోవైపు రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారి గ్రూప్–1 నియామకాలు జరగనున్నాయి. వివిధ శాఖల్లో 503 గ్రూప్–1 పోస్టులకు ఏకంగా 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ నిర్వహించనున్న నేపథ్యంలో మెయిన్ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన తేదీలను ప్రిలిమ్స్ పరీక్షల తర్వాత కమిషన్ వెల్లడించనుంది. -
ప్రిలిమ్స్‌కు స్వస్తి: ఏపీపీఎస్సీ కీలక ప్రతిపాదన
సాక్షి, అమరావతి: గ్రూప్ -1 పోస్టుల్లో మినహా మిగతా క్యాడర్ పోస్టుల భర్తీ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. ఇతర క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షల విధానాన్ని రద్దు చేయాలని యోచిస్తోంది. గ్రూప్ – 1 సహా అన్ని కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రస్తుతం తొలుత ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టు చేపట్టి అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై గ్రూప్ – 2, గ్రూప్ – 3 సహా ఇతర క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని కమిషన్ తలపోస్తోంది. కేవలం ఒక పరీక్షనే నిర్వహించి మెరిట్ అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు కమిషన్ వర్గాలు వివరించాయి. ఒత్తిడి నుంచి అభ్యర్థులకు ఊరట... ప్రిలిమ్స్ నిర్వహణతో అభ్యర్థులు ఆర్థిక భారం, వ్యయప్రయాసలకు గురవుతుండగా కోచింగ్ పేరిట కొన్ని సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. గతంలో గ్రూప్–1 పోస్టులకే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల విధానం ఉండేది. గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులకు ఒక పరీక్ష ద్వారానే ఎంపికలు జరిగేవి. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక తమ వారి కోచింగ్ సెంటర్లకు మేలు జరిగేలా పోస్టుల భర్తీ విధానాన్ని మార్చింది. గ్రూప్ –1 సహా అన్ని పోస్టులకూ ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేలా ఉత్తర్వులిచ్చింది. దీనివల్ల అభ్యర్థులు పరీక్షల సన్నద్దత కోసం ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చేది. కోచింగ్ కేంద్రాల దోపిడీకి చెక్‌పెట్టేలా ఏపీపీఎస్సీ సమూల మార్పులపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రిలిమ్స్/ స్క్రీనింగ్ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. తద్వారా అభ్యర్థులకు మేలు జరగడంతోపాటు కోచింగ్ సెంటర్ల దందాకు అడ్డుకట్ట పడుతుందని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మే 5నే గ్రూప్–2 ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మే 5న గ్రూప్–2 పోస్టుల ప్రిలిమ్స్ పరీక్షను యథాతథంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్–2 కింద 446 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి 3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే, సాధారణ ఎన్నికలు రావడంతో ప్రిపరేషన్‌కు అనేక అవాంతరాలు ఏర్పడ్డాయని, పరీక్షను నెలపాటు వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు, పలువురు ప్రజాప్రతినిధులు ఏపీపీఎస్సీ చైర్మన్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎన్నికల ప్రధానాధికారికి విన్నవించారు. అయితే, పరీక్షను ముందుగా ప్రకటించిన విధంగా మే 5నే నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ స్పష్టం చేశారు. ఇప్పటికే హాల్‌టిక్కెట్లను వెబ్సైట్లో పొందుపరిచారు. అభ్యర్థులంతా చాలాకాలం నుంచి ప్రిపరేషన్లో ఉన్నారని, ఈ సమయంలో పరీక్షను వాయిదా వేయడం వల్ల వారంతా నిరాశానిస్పృహలకు లోనవుతారని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పరీక్షను వాయిదా వేస్తే ప్రత్యామ్నాయ తేదీలను నిర్ణయించడానికి కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నాయి. పరీక్ష వాయిదా వల్ల నియామక ప్రక్రియ ఆలస్యమవుతుందని, అందుకే సకాలంలో పరీక్ష నిర్వహించాలని వివరిస్తున్నాయి. గ్రూప్–2 పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 773 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష పెన్ను–పేపర్ (ఓఎమ్మార్ పత్రాలు) విధానంలో జరగనుంది. తప్పు సమాధానాలకు 1/3 నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. 446 పోస్టుల్లో 110 పాత పోస్టులే మొత్తం 446 గ్రూప్–2 పోస్టుల్లో 110 పోస్టులు పాత నోటిఫికేషన్లలో భర్తీ కాకుండా క్యారీ ఫార్వార్డ్ కింద ఈ నోటిఫికేషన్లో చేరాయి. 446 పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 154 కాగా, తక్కినవన్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులే. క్యారీ ఫార్వార్డ్ కింద చేరిన 110 పోస్టుల్లో 16 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాగా, తక్కినవి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. వైట్నర్ పెడితే తిరస్కరణ కాగా, ఇటీవల నిర్వహించిన గ్రూప్–3 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల ప్రిలిమ్స్ పరీక్షల్లో పలువురు అభ్యర్థులు అనేక పొరపాట్లు చేసినట్లు ఏపీపీఎస్సీ గుర్తించింది. కొంతమంది ఓఎమ్మార్ పత్రాల్లో వివరాలను సరిగా నింపలేదు. కొంతమంది బబ్లింగ్ కూడా సరిగా చేయలేదు. కొంతమంది బబ్లింగ్ చేసి తర్వాత వాటిని వైట్నర్తో చెరిపేసి మళ్లీ బబ్లింగ్ చేశారు. ఇలా చేయడంతో ఆయా అభ్యర్థుల పత్రాలు స్కానింగ్ సమయంలో తిరస్కరణకు గురవుతాయని కమిషన్ వర్గాలు స్పష్టం చేశాయి. దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని, కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయొద్దని సూచిస్తున్నాయి. ప్రొఫిషియన్సీ టెస్ట్ తప్పనిసరి మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో కొన్ని కేటగిరీల వారికి ‘ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్’ టెస్టును తప్పనిసరి చేశారు. మొత్తం 15 విభాగాల పోస్టుల అభ్యర్థులు దీన్ని రాయాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో మెరిట్ సాధించి పోస్టులకు ఎంపికయ్యే అవకాశాలున్నా ఈ ప్రొఫిషియెన్సీ టెస్టులో కూడా ఉత్తీర్ణత సాధిస్తేనే వారిని పోస్టుకు ఎంపిక చేస్తారు. ప్రొఫిషియెన్సీ టెస్టు తర్వాత మాత్రమే అభ్యర్థుల జాబితాను షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. జూలై 18, 19 తేదీల్లో మెయిన్ పరీక్షలు ప్రిలిమ్స్‌లో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించినవారిని వారి రిజర్వేషన్లకనుగుణంగా 1:12 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో అన్ని పేపర్లూ రాయాల్సిందే. ఏ ఒక్క పేపర్ రాయకపోయినా తర్వాత ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు. రిజర్వుడ్ కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులు తగినంతమంది మెయిన్స్ పరీక్షలకు ఎంపిక కాకుంటే ఆ కేటగిరీల వరకు కటాఫ్ మార్కులు తగ్గించి మిగతా వారిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. ఇలా ప్రత్యేక కటాఫ్ మార్కుల మినహాయింపు ద్వారా మెయిన్స్ పరీక్షలు రాసి మెరిట్ సాధించినవారు జనరల్ కోటా పోస్టులకు కాకుండా రిజర్వుడ్ కోటా పోస్టులకు మాత్రమే పరిమితమవుతారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపికైనవారికి జూలై 18, 19న కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. -
23న ప్రిలిమ్స్ పరీక్ష
1,055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు 5.66 లక్షల మంది పోటీ సాక్షి అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులకోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. 1,055 పోస్టులకు కోసం నోటిఫికేషన్ జారీ చేయగా.. 5,66,215 మంది దరఖాస్తు చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. వీరికి ఈనెల 23వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష (స్క్రీనింగ్ టెస్టు) నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధించిన వారి నుంచి 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మెయిన్స్‌ను జూలై 16న ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
గ్రూప్ 2 కీ విడుదల
ప్రశ్నల వారీ ‘కీ’లను వెబ్సైట్లో పొందుపర్చిన ఏపీపీఎస్సీ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 982 గ్రూప్ 2 కేడర్ పోస్టులకు ఈనెల 26న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించి ఆయా సెట్లలోని ప్రశ్నల వారీగా ‘కీ’లను ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. వీటిని కమిషన్ వెబ్సైట్లో పొందుపర్చినట్లు కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. ఈ కీ సంబంధించిన అభ్యంతరాలను మార్చి 7వ తేదీలోగా రాతపూర్వకంగా పంపించాలని పేర్కొన్నారు. ఫార్మాట్ వెబ్సైట్లో అందుబాటులో ఉందని తెలిపారు. ఈ మెయిల్, ఎస్ఎంఎస్, వాట్సప్‌ల ద్వారా వచ్చే అభ్యంతరాలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రశ్న ఐడీలు లేని అభ్యంతరాలు కూడా అనుమతించబోమన్నారు. పోస్టల్ ఆలస్యానికి తమది బాధ్యత కాదని కార్యదర్శి పేర్కొన్నారు. గ్రూప్2లో వచ్చిన ప్రశ్నలు తమ టెస్టు సిరీస్లోనివేనని కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రచారం చేసుకుంటున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అభ్యర్ధులు వీటిని నమ్మరాదని విజ్ఞప్తి చేశారు. సెట్ల వారీగా కాకుండా ప్రశ్నల వారీగా కీలను విడుదల చేయడంతో అభ్యర్థులు తొలుత ఒకింత గందరగోళానికి గురైనా తర్వాత అసలు సంగతి గుర్తించారు. కాగా, ఏపీపీఎస్సీ విడుదల చేసిన కీలో అనేక తప్పులు దొర్లాయని అభ్యర్థులు పేర్కొంటున్నారు. -
నేడే గ్రూప్–2 ప్రిలిమ్స్
-
నేడే గ్రూప్–2 ప్రిలిమ్స్
ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు స్క్రీనింగ్ టెస్ట్ 9.45 దాటితే పరీక్ష కేంద్రంలోకి ‘నో’ ఎంట్రీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 982 గ్రూప్–2 పోస్టుల భర్తీకి సంబంధించి ఆదివారం ప్రిలిమ్స్(స్క్రీనింగ్ టెస్టు) పరీక్ష జరగనుంది. దీనికి ఏపీతో పాటు తెలంగాణ నుంచి మొత్తం 6,57,010 మంది అభ్యర్థులు హాజరుకానుండగా.. ఏపీలో 1,376 పరీక్ష కేంద్రాలు, తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 86 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు తమ కేంద్రానికి ఉదయం 9 గంటల నుంచి 9.45 లోపు హాజరుకావాలి. 9.45 తర్వాత అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించబోమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ లేదా మరేదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌పై ఫొటో స్పష్టంగా లేకపోతే మూడు పాస్‌పోర్టు ఫొటోలు వెంట తీసుకువెళ్లాలి. వాటిని ఇన్విజిలేటర్‌కు ఇచ్చి డిక్లరేషన్ ద్వారా పరీక్షకు హాజరుకావచ్చు. కాగా అన్ని పరీక్ష కేంద్రాల సమాచారాన్ని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. ఏమైనా సమస్యలు ఏర్పడితే 040–24603493, 94, 95, 96 నంబర్లను సంప్రదించవచ్చు. -
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
ఏపీలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో ‘గ్రూప్–2’ కేంద్రాలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–2 కేటగిరీలోని 982 పోస్టులకు ఈ నెల 26న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ పరీక్ష పర్యవేక్షణ కోసం ఏపీపీఎస్సీ నుంచి అధికారులను డిప్యుటేషన్‌పై నియమించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల వారీగా అధికారుల పేర్లు, మొబైల్ నెంబర్లను ప్రకటించారు. ఈ పరీక్షకు మొత్తం 6,57,010 మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రానికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే అభ్యర్థులు ఆయా జిల్లా కలెక్టరేట్లలో పర్యవేక్షణాధికారులను సంప్రదించవచ్చని కమిషన్ వివరించింది. పరీక్ష హాలులోకి ఉదయం 9 గంటలకు అనుమతిస్తామని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించారు. ఉదయం 9.45 గంటల తర్వాత అభ్యర్థులెవరినీ పరీక్ష హాలులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. కాగా పరీక్షకు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అత్యధిక సంఖ్యలోనే దరఖాస్తులు అందడం విశేషం. ఈ పరీక్షకు గాను హైదరాబాదు సెంటరు నుంచి 53063 మంది పరీక్ష రాయనున్నారు. -
గ్రూప్–2 హాల్ టికెట్ల సమస్యకు పరిష్కారం
హైదరాబాద్ కేంద్రాలకూ హాల్ టికెట్ల జారీ సాక్షి, అమరావతి: గ్రూప్–2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ ఈనెల 26న నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను ఏపీ ఆన్లైన్ సంస్థ పరిష్కరించిందని, అభ్యర్థులు తమ హాల్ టికెట్లను సజావుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమస్య గురించి అభ్యర్థులు తమ దృష్టికి తీసుకురాగానే ఏపీ ఆన్‌లైన్‌తో చర్చించామని, సర్వర్‌లో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఇలా అయ్యిందని గుర్తించి వెంటనే సరిదిద్దే ప్రయత్నాలు చేశామన్నారు. ఈ విషయంలో అభ్యర్థులు తమ సమస్యలపై appsc.halltickets@aptonline. inకు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే పరిష్కరిస్తామని వెల్లడించారు. కులం, స్థానికత తదితర అంశాల్లో తప్పులు చోటు చేసుకున్నట్లు కొంతమంది నుంచి సమాచారం వస్తోందని, అలాంటి అంశాలను సరిచేసుకొనేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పిస్తుందన్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకు కంప్యూటర్ టెస్టు ఉంటుందని కొందరి నుంచి వస్తున్న సమాచారం సరైనది కాదన్నారు. ఈ విషయంలో కొత్తగా ఎలాంటి అర్హత నిబంధనలు మార్పు చేయలేదని, నోటిఫికేషన్లో ఉన్న మేరకే వర్తిస్తాయన్నారు. ఇలా ఉండగా, హైదరాబాద్ కేంద్రాన్ని ఆప్షన్‌గా ఎంచుకున్న వారికి కూడా మంగళవారం నుంచి హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. కాగా, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు గడువును ఈనెల 17వ తేదీవరకు పొడిగించినట్లు కార్యదర్శి సాయి తెలిపారు. -
ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్
దేశవ్యాప్తంగా 4.5 లక్షలమంది హాజరు న్యూఢిల్లీ/సాక్షి,విజయవాడ/తిరుపతి: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. 59 నగరాల్లోని 2,137 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించగా 4.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. సివిల్స్ పరీక్షా విధానంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేయాలంటూ డిమాండ్ రాగా.. సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఎక్కడా ఎలాంటి ఆటంకాలు, నిరసనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. రెండు పేపర్ల(పేపర్-1, పేపర్-2)తో కూడిన ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. మొదటి పరీక్ష ఉదయం తొమిదిన్నర గంటలకు ఆరంభమవగా.. రెండో పరీక్ష మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైంది. ఒక్కో పరీక్షకు రెండు గంటలు కేటాయించారు. కాగా పేపర్-1లోని ప్రశ్నలకు సంబంధించి హిందీ అనువాదంలో తప్పులు దొర్లినట్టు కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ప్రిలిమ్స్కోసం మొత్తం 9,44,926 మంది దరఖాస్తు చేయగా.. పరీక్షకు 4,51,602 మంది హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.27 లక్షల మంది అధికంగా హాజరవడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతిల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విజయవాడలో 31 పరీక్ష కేంద్రాల్లో 32 శాతానికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 14,640 మందికిగాను ఉదయం జరిగిన పరీక్షకు 4,805 మంది(32.82 శాతం), మధ్యాహ్నం పరీక్షకు 4,755 మంది(32.48 శాతం) హాజరైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తిరుపతిలో నిర్వహించిన పరీక్షకు 38 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 13 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 7,796 మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం జరిగిన పరీక్షకు మూడువేల మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 2,984 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో...సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు హైదరాబాద్లోప్రశాంతంగా కొనసాగాయి. నగరంలోని 83 కేంద్రాల్లో మొత్తం 47శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 38,798 మంది అభ్యర్థులకుగాను పేపర్-1 పరీక్షకు 18,377 మంది, పేపర్-2కు 18,161 మంది అభ్యర్థులు హాజరయ్యారు.