కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్ (హైదరాబాద్): ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థులకు 7 మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తంచేశారు. ఇది పోలీస్ కానిస్టేబుళ్ల, ఎస్సై అభ్యర్థుల పోరాట ఫలితమేనని స్పష్టంచేశారు. మల్టిపుల్‌లోని 7 తప్పుడు ప్రశ్నలకు 7 మార్కులు కలపాలని హైకోర్టు జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.
దీంతో పలు కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు విద్యానగర్‌లోని బీసీ భవన్ వద్ద సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 6 లక్షల మంది రాసిన ఈ పరీక్షలో కేవలం 1,84,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని, 4 లక్షల మందికి పైగా అర్హత సాధించలేకపోయారని తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, మాసం ప్రదీప్, రాజ్‌కుమార్, నీలం వెంకటేశ్, చందన, రాజా, సునీత, దివ్య, రాజమల్లేశ్, శివ, కల్యాణ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment