Telangana High Court Postpones Group 1 Results - Sakshi
Sakshi News home page

గ్రూప్-1 ఫలితాలు సోమవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు  

Published Tue, Jul 25 2023 2:08 PM | Last Updated on Tue, Jul 25 2023 3:11 PM

High Court Postpones Group 1 Results To Monday - Sakshi

తెలంగాణ: గ్రూపు 1 పరీక్షల కేసును సోమవారానికి వాయిదా వేసింది హై కోర్టు. సోమవారం అడ్వకేట్ జనరల్ తన వాదనలు కోర్టుకు వినిపిస్తారని తెలిపారు AGP. కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు వెలువరించడంలో తొందరపడొద్దని, సోమవారం వరకు ఫలితాలను  ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. 

గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తినప్పటికీ టీఎస్పీఎస్సీ అన్నిటినీ అధిగమించి పరీక్షలనైతే నిర్వహించింది కానీ అడుగడుగునా ఈ వ్యవహారం వారికి అగ్నిపరీక్షలా మారింది. తాజాగా ఎన్ ఎస్ యూఐ తోపాటు మరికొంత మంది అభ్యర్దులు గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ పెట్టలేదంటూ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ విచారణ దశలో ఉండగానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1  ఫలితాలు ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు ఫలితాలు ప్రకటించకుండా స్టే ఇవ్వాలని కోర్టును అభ్యర్ధించారు పిటిషనర్లు. దీంతో తదుపరి విచారణ జరిగే వరకు గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించవద్దని హై కోర్ట్ ఓరల్ ఆర్డర్ జారీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement