జిల్లాలో ఖాళీగా ఉన్న 25 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాత పరీక్ష ద్వారా వీటిని భర్తీ చేయడానికి ఏపీపీఎస్‌సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న 25 గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాత పరీక్ష ద్వారా వీటిని భర్తీ చేయడానికి ఏపీపీఎస్‌సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. జనవరి 4 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం నిర్ధేశించిన రూ.100 ఫీజును జనవరి 20లోగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఫిబ్రవరి 23న ఏలూరులో రాత పరీక్ష నిర్వహిస్తారు. 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 23న కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నియామక ఉత్తర్వులను ఇస్తుంది. అభ్యర్థుల వయసు 2013 జూలై 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు ఇచ్చారు.
రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు : జిల్లాలో గ్రేడ్-4 కార్యదర్శి పోస్టులు 25 ఖాళీగా ఉన్నాయి. వీటిలో జనరల్‌కు 13, మహిళలకు 12 పోస్టులను కేటాయించారు. ఓసీ విభాగంలో జనరల్‌కు 6, మహిళలకు 4, బీసీ-ఏలో జనరల్‌కు 1, మహిళకు 1, బీసీ-బీలో జనరల్‌కు 1, మహిళకు 1, బీసీ-సీలో జనరల్‌కు 1, బీసీ-డీలో మహిళకు 1, బీసీ-ఈలో మహిళకు 1, ఎస్సీ కేటగిరీలో జనరల్‌కు 2, మహిళలకు 2, ఎస్టీ కేటగిరీలో జనరల్‌కు 1, మహిళకు 1, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలో మహిళకు 1 వికలాంగుల కేటగిరీలో మహిళకు1 చొప్పున పోస్టులు కేటాయించారు.