అన్ని ధరఖాస్తులనూ తిప్పి పంపితే ఎలా | its not correct to reject all applications | Sakshi
Sakshi News home page

అన్ని ధరఖాస్తులనూ తిప్పి పంపితే ఎలా

Published Wed, Oct 5 2016 10:30 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

its not correct to reject all applications

ఏలూరు (మెట్రో)
వచ్చిన దరఖాస్తులను కావలసిన «ధ్రువపత్రాలను సరిగ్గా పరిశీలన చేసి కావాల్సిన అర్హతలన్ని తీసుకోవాలి తప్ప వచ్చిన ధరఖాస్తులను తిరస్కరిస్తే జిల్లాలో పరిశ్రమలు స్థాపించడానికి ఎవరు ముందుకు వస్తారని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ అన్నారు.  జిల్లాలో ఆసక్తి గల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందించి వారితో పరిశ్రమలు పెట్టించడమే పరిశ్రమల ప్రొత్సాహక మండలి ఉద్ధేశమన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రొత్సాహక కమిటీ సమావేశానికి కలెక్టరు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ పరిశ్రమల స్థాపన కోసం 47 ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే, వచ్చిన ధరఖాస్తులను అర్హతలు లేవని తిప్పి పంపించడం సరికాదన్నారు. పెండింగ్‌లో ఉన్న ధరఖాస్తులను వెంటనే పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ ఆదిశేషును కలెక్టర్‌ ఆదేశించారు. ఉపసంచాలకులు పీ.ఏసుదాసు, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ మోహనరావు, సీటీఓ కేదారేశ్వరరావు, ఎల్‌డీఎం ఎం.సుబ్రహ్మేణ్యేశ్వరరావు, ఏపీఎస్‌ఎఫ్‌డీసీ మేనేజర్‌ సుబ్బారెడ్డి, కె.సుధాకర్, సోషల్‌ వెల్పేర్‌ డీడీ రంగలక్ష్మిదేవి, ఎలక్ట్రికల్‌ ఏడీ రవికుమార్, ఛాంబర్‌ ఆప్‌ కామర్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement