ప్రభుత్వ పాఠశాలల్లో పునఃప్రారంభం
250 మంది ఫ్యాకల్టీల నియామకం
ప్రారంభమైన తరగతులు
ప్రత్యేక చొరవ తీసుకున్న కలెక్టర్ భాస్కర్
దెందులూరు : జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన ఇటీవల పునఃప్రారంభమైంది. రెండేళ్ల కిందట అన్ని ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనను ప్రభుత్వం నిలుపుదల చేసింది. దీంతో ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ శిక్షణకు విద్యార్థులు దూరమయ్యారు. పదేళ్ల కిందట ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీసీ) పథకంలో ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.రెండేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలుపుదల చేసింది. ప్రజాసంఘాలు, విద్యార్థులు, రాజకీయపార్టీల ఆందోళనకుతోడు జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో మన జిల్లాలో కంప్యూటర్ విద్య తిరిగి పునఃప్రారంభమైంది. జిల్లాలో 48 మండలాల్లో ఉన్న 464 పాఠశాలల్లో 250 మంది కంప్యూటర్ ఫ్యాకల్టీలను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన గత వారంలో ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేశారు. దాదాపు రెండు లక్షల మంది 6 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు ప్రస్తుతం కంప్యూటర్ శిక్షణ పొందుతున్నారు. ప్రతిరోజు ప్రతి తరగతికి ఒక గంట కంప్యూటర్ శిక్షణ ఇస్తారు. ఎంఎస్ ఆఫీస్, నెట్‌వర్కింగ్, టాలీ, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ విభాగాల్లో ఫ్యాకల్టీలు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
విద్యార్థులకు అత్యవసరం
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులను తయారు చేయాలనే లక్ష ్యంతో పాఠశాలల్లో మళ్లీ కంప్యూటర్ విద్యను ప్రారంభించాం. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అత్యవసరం.
సర్వేశ్వరరావు, ఏఎంవో, సర్వశిక్షాభియాన్
కంప్యూటర్ విద్యాబోధన కీలకం
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి అభివృద్ధి, సంక్షేమానికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిపరిస్థితి. హైస్కూల్ స్థాయి నుంచి విద్యార్థులకు కంప్యూటర్ విద్య అవసరం. ఈ నేపథ్యంలో కంప్యూటర్ బోధన మళ్లీ ప్రారంభించడం అభినందనీయం.
టి కిశోర్, కంప్యూటర్ ఫ్యాకల్టీ, గోపన్నపాలెం
కలెక్టర్ కృషితో ప్రారంభం
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులను భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ కాటంనేని భాస్కర్ కంప్యూటర్ విద్య కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు చేయించడంతో విద్యాబోధన ప్రారంభించాం.
దుక్కిపాటి మధుసూదనరావు, డీఈవో