గాడి తప్పిన ఇంటర్‌ విద్య | Inter missed the groove education | Sakshi
Sakshi News home page

గాడి తప్పిన ఇంటర్‌ విద్య

Published Mon, Aug 22 2016 10:47 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

గాడి తప్పిన ఇంటర్‌ విద్య - Sakshi

గాడి తప్పిన ఇంటర్‌ విద్య

  • అధ్యాపకుల కొరత
  • రెన్యూవల్‌కు నోచుకోని కాంట్రాక్ట్‌ లెక్చరర్లు
  • అతిథి అధ్యాపకులను తీసుకోనేందుకు ప్రభుత్వం ససేమిరా
  • ఇంటర్‌ విద్య గాడి తప్పుతోంది. అనేక కళాశాలల్లో రెగ్యులర్‌ అధ్యాపకులు లేరు.  వారి స్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై మూన్నెల్లవుతున్నా  వారి పోస్టులను రెన్యూవల్‌ చేయలేదు. మరోవైపు అతిథి అధ్యాపకులను తీసుకునేందుకు  ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు.  ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది.


    పోస్టులు 652... పని చేస్తోంది 156 మంది
    జిల్లాలో 39 జనరల్, రెండు ఒకేషనల్‌ కలిపి మొత్తం 41 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 26,710 మంది విద్యార్థులు మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.  మొత్తం 652 అధ్యాపక పోస్టులున్నాయి. వీటిల్లో కేవలం 156 మంది మాత్రమే రెగ్యులర్‌ అధ్యాపకులు  ఉన్నారు. ఉదాహరణకు శింగనమల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు ఈ విద్యా సంవత్సరం కొత్తగా సైన్స్‌ గ్రూపులు మంజూరయ్యాయి. ఎంపీసీలో 10 మంది, బైపీసీలో 18 మంది విద్యార్థులు చేరారు. అయితే బోధించే అధ్యాపకులు లేరు. గణితం, ఫిజిక్స్, బొటనీ, కెమిస్ట్రీ, జువాలజీ అన్ని సబ్జెక్టులకు గాను ఒక్క పోస్టూ మంజూరు చేయలేదు. ఏదో ప్రిన్సిపల్‌ చొరవతో వీలున్నప్పుడు ఆయా సబ్జెక్టుల అధ్యాపకులు (గెస్ట్‌ ఫ్యాకల్టీ) వచ్చి బోధిస్తున్నారు.  అతిథి అధ్యాపకులుగా తమను తీసుకుంటారనే నమ్మకంతో అప్పుడప్పుడు వచ్చి చెబుతున్నారు. అనంతపురం నగరంలోని పాతూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గణితం అధ్యాపకుడి  పోస్టు ఖాళీగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement