రాలీ: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. నార్త్ కరోలినా స్టేట్ ఛాపెల్ హిల్‌లోని యూనివర్సిటీ University Of North Carolina సైన్స్ భవనంలో తుపాకీతో వచ్చిన ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ఓ సిబ్బంది(ఫ్యాకల్టీ) మృతి చెందినట్లు తెలుస్తోంది.
సోమవారం క్యాంపస్‌లో లాక్‌డౌన్ ఎత్తేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఆ వెంటనే ఈ కాల్పలు ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనలో మరెవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. ఎమర్జెన్సీ నెంబర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
మూడు గంటల తర్వాత అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడింది అతనేనా? అని ధృవీకరణ రావాల్సి ఉండగా.. దుండగుడు కాల్పులకు తెగబడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. గన్ కల్చర్‌కు సంబంధించిన ఈ ఘటనపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Law enforcement have Arrested the Suspect in University of North Carolina Shooting#ChapelHill #UNCShooting#UNC #NorthCarolina #shooting #breaking #chapelhill #Carolina #University #USA #Shotting #Firing
— Chaudhary Parvez (@ChaudharyParvez) August 29, 2023
pic.twitter.com/Nte6OxelM6
Comments
Please login to add a commentAdd a comment