Lockdown: నారా వారి గుర్తింపు కార్డులు | Hyderabad Police Case File On Chandrababu Staff | Sakshi
Sakshi News home page

Lockdown: నారా వారి గుర్తింపు కార్డులు

Published Sat, May 22 2021 3:17 AM | Last Updated on Sat, May 22 2021 1:01 PM

Hyderabad Police Case File On Chandrababu Staff - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): రాష్ట్రంలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ ...టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సిబ్బందికి సొంత గుర్తింపు కార్డులిచ్చి రోడ్లపై స్వేచ్ఛగా తిరిగేందుకు దోహదపడ్డారు. శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36 నీరూస్‌ చౌరస్తాలో జాషువా అనే డ్రైవర్‌ ద్విచక్ర వాహనంతో బయటకు వచ్చాడు.

జూబ్లీహిల్స్‌ పోలీసులు అతడిని ఆపగా ‘నారా ఫ్యామిలీ పర్సనల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌’పేరుతో గుర్తింపు కార్డుని చూపించాడు. దీంతో ఈ కార్డుల గురించి పోలీసులు అతడిని ప్రశ్నించగా...చంద్రబాబు కుటుంబం వద్ద పనిచేస్తున్న ఓ పాతికమందికి పైగా సిబ్బందికి ఈ గుర్తింపు కార్డులిచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతడికి జరిమానా విధించి కేసు నమోదు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement