రామ్‌నాథ్ పేరును గతేడాదే చెప్పిన శ్రీవాస్తవ
న్యూఢిల్లీ: ఊహించని విధంగా రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడు, విద్యావంతుడైన రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించి అధికార బీజేపీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఏడాది కిందటే ఈ పేరును ఊహించి చెప్పాడో క్విజ్ నిర్వాహకుడు. గత ఏడాది జూన్ 2న కాబోయే రాష్ట్రపతి ఎవరనే దానిపై ట్విట్టర్‌లో రాహుల్‌శర్మ అనే వ్యక్తి ఆన్‌లైన్ పోల్ నిర్వహించారు. దీనికి ప్రణబ్, అద్వాణీ సహా పలు పేర్లపై చర్చ జరిగింది. అయితే ఎవరూ ఊహించని, అసలు ప్రచారంలో లేని రామ్‌నాథ్ కోవింద్ పేరు చెప్పి ఆశ్చర్యపరిచారు క్విజ్ నిర్వాహకుడైన నితీష్ శ్రీవాస్తవ. ‘రామ్‌నాథ్ కోవింద్.
దళితుడు.. విద్యావంతుడు. ఆర్‌ఎస్‌ఎస్ మూలాలున్న ఈయన ప్రస్తుతం బిహార్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు’అని ట్వీట్ చేశారు శ్రీవాస్తవ. తెరపై లేని పేరును శ్రీవాస్తవ ప్రస్తావించడంపై నాడు నెటిజన్లు షాకయ్యారు. సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అదే పేరును తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనైన నెటిజన్లు శ్రీవాస్తవను అభినందనలతో ముంచెత్తుతున్నారు. అతడిని ‘ట్విట్టర్ నోస్ట్రడామస్’గా ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక రామ్‌నాథ్ రాష్ట్రపతి అయితే... అతని అంచనా నూటికి నూరుశాతం నిజమైనట్టే!
శ్రీవాస్తవ ట్విట్టర్ నోస్ట్రడామస్
Published Tue, Jun 20 2017 12:50 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement