Shashank
-
ఎవరీ శశాంక్..? ఇన్నింగ్స్ చివర్లో వచ్చి.. సుడిగాలి వేగంతో..!
29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు.. నాటౌట్.. 25 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 46 నాటౌట్..25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు..28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 నాటౌట్..ఇలా ఐపీఎల్–2024లో ఈ బ్యాటర్ తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి సుడిగాలి వేగంతో చెలరేగిపోతున్న అతని ఆటతీరు అభిమానులను అలరిస్తోంది. సింగిల్స్‌తో కాకుండా సిక్సర్లతోనే స్కోరుబోర్డును పరుగెత్తిస్తున్న ఆ శైలి ఈ సీజన్లో అతనికి కొత్త ఫ్యాన్స్‌ను తెచ్చి పెట్టింది. ముఖ్యంగా కోల్‌కతాతో మ్యాచ్‌లో 262 పరుగుల రికార్డు లక్ష్యాన్ని అందుకునే క్రమంలో మైదానంలో అన్ని వైపులకు అతను బాదిన ఎనిమిది సిక్సర్లు ఔరా అనిపించాయి.ఐపీఎల్ ప్రతి ఏటా కొంత మంది కొత్త హీరోలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. లీగ్‌లో తమ జట్టు ఓవరాల్ ప్రదర్శనతో సంబంధం లేకుండా అప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడకపోయినా కొందరి అద్భుత ప్రదర్శన ఫ్రాంచైజీ క్రికెట్‌కు కొత్త ఊపును, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాంటి ఒక ఆటగాడే శశాంక్ సింగ్. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ అతను ప్రదర్శిస్తున్న సంచలన ఆటతీరుతో అందరి దృష్టిలో పడ్డాడు. ఐపీఎల్ వేలం సమయంలో తన ప్రమేయం లేకుండానే వివాదంలో నిలిచి అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఈ ఛత్తీస్‌గఢ్ ఆటగాడు ఇప్పుడు తన ఆటతోనే అందరికీ సమాధానమిచ్చాడు.గత ఏడాది డిసెంబర్ 20న ఐపీఎల్–2024 సీజన్లో మిగిలిన స్థానాల కోసం వేలం జరిగింది. వేలం నిర్వహిస్తున్న మల్లికా సాగర్ ‘శశాంక్ సింగ్’ అనే పేరు ప్రకటించింది. అయితే ఏ ఫ్రాంచైజీ నుంచి కూడా స్పందన రాలేదు. ఆ తర్వాత మరో ఇద్దరు ఆటగాళ్లు వేలంలో అమ్ముడుపోయారు. ఆపై మళ్లీ ‘శశాంక్ సింగ్’ అనే పేరు వినిపించింది. అప్పటి వరకు వరుసగా యువ ఆటగాళ్లను తీసుకుంటూ పోతున్న పంజాబ్ కింగ్స్ యజమానులు కూడా ప్యాడిల్ ఎత్తి తమ ఆసక్తిని ప్రదర్శించారు.రూ. 20 లక్షల కనీస విలువకు ఇతర జట్లేవీ ముందుకు రాకపోవడంతో శశాంక్‌ను పంజాబ్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే కొద్ది క్షణాల తర్వాత అనూహ్యంగా పంజాబ్ యజమాని ప్రీతి జింటా తమకు ఈ ఆటగాడు అవసరం లేదంటూ వేలం నిర్వాహకులకు చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ మీరు ఆలస్యం చేశారంటూ మల్లికా సాగర్ స్పష్టం చేసేసింది. దాంతో బలవంతంగా, కాస్త నిరాశగా శశాంక్‌ను పంజాబ్ తీసుకుంది.దీనిపై పెద్ద దుమారం రేగింది. ఒక యువ ఆటగాడిని ఇలా అవమానపరుస్తారా అంటూ విమర్శలు వచ్చాయి. చివరకు కింగ్స్ యాజమాన్యం పలు రకాలుగా వివరణ ఇస్తూ తమ జట్టులోకి ఆహ్వానించింది. అయితే తాము వద్దనుకున్న ఆటగాడు ఎంత విలువైనవాడో సీజన్ సాగిన కొద్దీ యాజమాన్యానికి తెలిసొచ్చింది. శశాంక్ సింగ్ మాత్రం అన్నింటికీ ఒకే ఒక చిరునవ్వుతో సమాధానం ఇస్తూ మైదానంలో దూసుకుపోయాడు.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకుంటూ..బలమైన నేపథ్యం ఉన్నా..‘నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని ఎవరైనా అంటే అవి ఆర్థికపరమైన కష్టాలే కానవసరం లేదు. గెలుపు దారిలో ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతాయి. మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు పట్టుదలగా నిలబడితేనే ముందుకు వెళ్లగలం’ అని శశాంక్ సింగ్ తన గురించి తాను చెప్పుకున్నాడు. ఎందుకంటే శశాంక్ తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి (ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో స్పెషల్ డీజీగా పని చేస్తున్నారు).ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. 1996 వరల్డ్ కప్ సమయంలో ఐదేళ్ల వయసున్న శశాంక్‌కు తొలిసారి క్రికెట్లో ఓనమాలు నేర్పించారు. అప్పటికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడలేదు. శశాంక్ పుట్టిన భిలాయ్ మధ్యప్రదేశ్‌లోనే ఉంది. చిన్న వయసులోనే ఆటలో చురుకుదనం చూపించిన శశాంక్ మధ్యప్రదేశ్ అండర్–15, అండర్–17 జట్ల తరఫున ఆడాడు. ఇక సీనియర్ స్థాయికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తండ్రి తీసుకున్న ఒక నిర్ణయం శశాంక్ కెరీర్ గతి తప్పేలా చేసింది.తనకు ముంబైకి బదిలీ కావడంతో కొడుకును కూడా అక్కడకు తీసుకెళ్లారు. నిజానికి ముంబైలో ఉంటే మంచి శిక్షణ లభిస్తుందని, ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆయన సానుకూల రీతిలోనే ఆలోచించారు. కానీ అక్కడికి వెళ్లాక అంచనా తప్పి అంతా తలకిందులైంది.దేశవాళీలో అవకాశాలు దక్కినా..ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా.. లీగ్‌లతో మొదలు పెట్టి శశాంక్ అన్ని రకాల గుర్తింపు పొందిన టోర్నీలలో ఆడాడు. అప్పటినుంచే అతనికి దూకుడైన, విధ్వంసక ఆటగాడిగా, భారీ సిక్సర్లు కొట్టేవాడిగా గుర్తింపు వచ్చింది. సంప్రదాయానికి భిన్నంగా ఉండే అతని టెక్నిక్‌తో శశాంక్ పరుగుల వరద పారించాడు. ఒక లీగ్ మ్యాచ్‌లో అతను ఒక్కరోజే ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. దాంతో 2014–15 సీజన్లోనే ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున అరంగేట్రం చేసే అవకాశం లభించింది.ఆ తర్వాత ఇదే జోరులో వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం కూడా ముంబై జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆ సమయంలో జట్టులో ఉన్న రహానే, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, అభిషేక్ నాయర్, శార్దూల్ ఠాకూర్, సిద్దేశ్ లాడ్ వంటి స్థానిక ఆటగాళ్లను దాటి తుది జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. దాంతో పాటు శశాంక్‌ను అంతా ముంబైకి చెందని ‘పరాయివాడు’గా చూడటం మొదలైంది.దాంతో ప్రదర్శన ఎంత బాగున్నా ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం ఇస్తే నాలుగు మ్యాచ్‌లలో ఆడించకుండా కూర్చోబెట్టసాగారు. దాంతో నాలుగేళ్ల పాటు జట్టుతో ఉన్నా రంజీ ట్రోఫీలో ఆడే అవకాశమే రాలేదు. ఇది శశాంక్‌ను తీవ్ర అసహనానికి గురిచేసింది.పంజాబ్ జట్టు యజమాని ప్రీతీ జింతాతో.. పట్టుదలతో పైకి లేచి..‘అది నాకు కష్టకాలం. అయితే నేను ఎవరినీ నిందించలేదు. విమర్శలు చేయలేదు. నా ఆటపై నాకు నమ్మకముంది. ఇది నా కెరీర్ కోసం సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటానని, మీ సహకారం అవసరం లేదని కూడా నాన్నకు స్పష్టంగా చెప్పా. అందుకే జట్టు మారాలని నిర్ణయించుకున్నా’నని చెబుతూ శశాంక్ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ముంబై నుంచి మారాలని నిర్ణయించుకున్న తర్వాత దేశవాళీలో పుదుచ్చేరిని ఎంపిక చేసుకొని ఒక సీజన్ పాటు ఆడాడు. కానీ అది మరీ బలహీన జట్టు కావడంతో తాను ఆశించిన ఫలితం దక్కలేదు.చివరకు తనకు సరైంది తన రాష్ట్రమే అని అతను అర్థం చేసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్ కోచ్ దేవేంద్ర బుందేలా సలహా మేరకు టీమ్‌లోకి వచ్చిన శశాంక్ 2019–20 సీజన్లో రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టాడు. దాంతో తన కెరీర్లో ఏదో సాధించిన సంతృప్తి. గత ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో మణిపూర్‌తో మ్యాచ్‌లో 150 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసిన శశాంక్ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.అయితే అతనికి మరింత సంతృప్తినిచ్చిన విజయం నాలుగేళ్ల క్రితం విజయ్ హజారే ట్రోఫీలోనే వచ్చింది. ముంబై జట్టులో తనతో కలసి ఆడిన పలువురు క్రికెటర్లు అన్నివైపుల నుంచి స్లెడ్జింగ్ చేస్తుండగా కీలక ఇన్నింగ్స్ ఆడి తొలిసారి ముంబైపై 5 వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్ విజయం సాధించడం అతనికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.ఐపీఎల్లో ఆలస్యంగా..ఈ ఏడాది ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగిపోతున్న శశాంక్ ప్రయాణం ఇక్కడా గొప్పగా సాగలేదు. 2017 నుంచి 2021 మధ్య ఢిల్లీ, రాజస్థాన్ జట్లతో ఉన్నా ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఎట్టకేలకు 2022లో సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లో 6 బంతుల్లోనే 25 పరుగులు సాధించి వెలుగులోకి వచ్చాడు. అయితే ఇలాంటి ప్రదర్శన తర్వాత కూడా అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు.గత సీజన్లో అయితే ఆడే చాన్సే రాలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా దక్కిన ఆపర్చునిటీని అతను రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగిపోతూ ధనాధన్ బ్యాటింగ్‌తో లీగ్‌పై తనదైన ముద్ర వేశాడు. ‘నా కొడుకు జీవితంలో కొత్త వెలుగు వచ్చేందుకు బాగా ఆలస్యమైంది. ఇది నన్ను నిరాశపరచే అంశం’ అంటూ తండ్రి బాధపడినా.. తనకు అలాంటి చింత ఏమీ లేదని, ప్రతికూలతలను దాటి తాను వచ్చిన స్థాయి పట్ల సంతృప్తిగా ఉన్నానని శశాంక్ చెప్పుకున్నాడు.కొన్నేళ్ల క్రితం క్రికెట్లో పరిస్థితులు చూసి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టినా.. ఆటపై ప్రేమ కుదురుగా ఉండనీయక మళ్లీ అతను బ్యాట్ పట్టేలా చేసింది. 32 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానాన్ని ఆశించే విషయంలో ఏమీ చెప్పలేకపోయినా.. అతని ఆట చూస్తే ఏదోరోజు అద్భుతం జరగవచ్చని మాత్రం అనిపిస్తోంది. – మొహమ్మద్ అబ్దుల్ హాదిఇవి చదవండి: Mothers day 2024 అమ్మలూ మీరూ, మీ ఆరోగ్యం జాగ్రత్త! -
వడ్డీ రేట్ల పెంపుతో వాహన విక్రయాలపై ప్రభావం
న్యూఢిల్లీ: వాహన రుణాలపై వడ్డీ రేట్ల పెరుగుదలతో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును మార్చినప్పుడు గృహ రుణాల్లో సత్వరం అది ప్రతిఫలిస్తుందని, కానీ ఆటో లోన్స్ విషయంలో కాస్త సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ ఇప్పటివరకు 250 బేసిస్ పాయింట్లు పెంచితే 130 పాయింట్లు మాత్రమే రిటైల్ ఆటో రుణాల వడ్డీ రేట్ల విషయంలో ప్రతిఫలించిందని మరో 120 బేసిస్ పాయింట్ల బదిలీ జరగాల్సి ఉందని శ్రీవాస్తవ వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆర్బీఐ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) గానీ తగ్గించకపోతే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలపై ప్రభావం పడొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అధిక వడ్డీ రేట్లతో పాటు పేరుకుపోయిన డిమాండ్ తగ్గిపోవడం, తయారీ సంస్థలు చేపట్టిన స్టాక్ కరెక్షన్ వంటి అంశాల వల్ల కూడా పీవీల అమ్మకాల వృద్ధి నెమ్మదించవచ్చని చెప్పారు. అమ్మకాల వృద్ధిపరంగా 2021లో అత్యధిక బేస్ నమోదు చేసిందని, ప్రతి సంవత్సరం దానికి మించి విక్రయాలు సాధించడం కష్టసాధ్యమవుతుందని శ్రీవాస్తవ చెప్పారు. 2021లో ఏకంగా 27 శాతంగా నమోదైన వృద్ధి క్రమంగా 2023లో 8.3 శాతానికి దిగి వచి్చందని, వచ్చే ఏడాది సింగిల్ డిజిట్ స్థాయికే పరిమితం కావచ్చని ఆయన పేర్కొన్నారు. -
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఎనిమిది మంది వెయిటింగ్లో ఉన్న అధికా రులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. సీని యర్ ఐఏఎస్ అధికారులు శశాంక్ గోయల్, శైలజా రామయ్యర్‌ల సేవలను ఎంసీఆర్ హెచ్ఆర్డీ, యువజన సర్వీసుల శాఖలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు వెయిటింగ్లో ఉన్న 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్‌కు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్‌గా పోస్టింగ్ ఇవ్వగా, 1997 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్‌ను యు వజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శాట్స్ ఎండీగా, ఆర్కి యాలజీ డైరెక్టర్‌గా ఆమెకు అదనపు బాధ్య తలు అప్పగించింది. అలాగే వెయిటింగ్లో ఉన్న అధికారులు హరిచందన, వర్షిణి, హై మావతి, నిఖిల, సత్యశారదాదేవి, అరుణ శ్రీలకు పోస్టింగ్‌లు ఇచ్చింది. జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రియాంకా ఆలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా నియమించింది. అదే విధంగా ములుగు అద నపు కలెక్టర్‌గా ఉన్న ఇల త్రిపాఠికి అదే జిల్లా కలెక్టర్‌గా, సిద్దిపేట అదనపు కలెక్టర్ ము జమిల్ఖాన్కు పెద్దపల్లి కలెక్టర్‌గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉన్న అనుదీప్ దురిశెట్టికి హైదరాబాద్ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. పెద్దపల్లి కలెక్టర్‌గా ఉన్న సంగీత సత్యనారాయణను టీఎస్ ఫుడ్స్ ఎండీగా, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యను కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శిగా నియమించింది. జగిత్యాల అద నపు కలెక్టర్‌గా ఉన్న మంద మకరందుకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమి షనర్‌గా బాధ్యతలు అప్పగించింది. ప్రభు త్వం మొత్తం 14 మంది అదనపు కలెక్టర్లను ఈసారి బదిలీ చేయడం గమనార్హం -
తెలంగాణ: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ అయ్యారు. అదే విధంగా వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది ప్రభుత్వం. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులు నూతన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆర్థికశాఖ జాయింట్ సెక్రటరీగా కె. హరిత భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాంక ములుగు జిల్లా కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి టూరిజం కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మీ టూరిజం డైరెక్టర్‌గా కె. నిఖిల ఆయుష్ డైరెక్టర్‌గా హరిచందన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్‌ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్సీఆర్ హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్, ఆయుష్ డైరెక్టర్‌గా దాసరి హరిచందన, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య నియమితులయ్యారు. హైదరాబాద్ కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి నియమించారు. ఇక తెలంగాణ స్టేట్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్, సెర్ప్ సీఈవోగా పాట్రు గౌతమ్, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్ నికోలస్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా మంద మకరందు, ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా ముజమిల్ ఖాన్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా కె. హరితను నియమించారు. చదవండి: కవిత, కేటీఆర్‌పై సుఖేష్ సంచలన ఆరోపణలు, గవర్నర్‌కు మరో లేఖ హస్త కళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా అలగు వర్షిణి, క్రీడల డైరెక్టర్‌గా కొర్రా లక్ష్మి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌గా హైమావతి, పర్యాటక శాఖ డైరెక్టర్‌గా కే నిఖిల, వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శిగా సత్య శారదాదేవి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా స్నేహ శబారిష్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాంక ఆల, మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్‌గా వెంకటేశ్ ధోత్రే నియమితులయ్యారు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న కే స్వర్ణలతను జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ చేశారు. అభిలాష అభినవ్‌ను ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌గా, కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా మను చౌదరిని, టీఎస్ దివాకరను జగిత్యాల అదనపు కలెక్టర్‌గా నియమించారు. నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్‌గా కుమార్ దీపక్, పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా చెక్క ప్రియాంక, కరీంనగర్ అదనపు కలెక్టర్‌గా జల్దా అరుణశ్రీ, సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్, రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా గరిమా అగర్వాల్ నియమితులయ్యారు. -
నెక్సా కస్టమర్లు 20 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెక్సా రిటైల్ చైన్ల ద్వారా ఇప్పటి వరకు 20 లక్షల కార్లు రోడ్డెక్కాయని మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. ప్రీమియం కార్ల విక్రయాల కోసం 2015లో నెక్సా కేంద్రాలను కంపెనీ ప్రారంభించింది. బలేనో, ఇగ్నిస్, సియాజ్, ఎక్స్ఎల్6, గ్రాండ్ వితారా మోడళ్లు ఇక్కడ కొలువుదీరాయి. త్వరలో మార్కెట్లోకి రానున్న ఎస్‌యూవీలు ఫ్రాంక్స్, జిమ్నీ సైతం వీటి సరసన చేరనున్నాయి. ఇతర మోడళ్లను అరీనా ఔట్లెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. హ్యుండై, టాటా మోటార్స్ విక్రయాల కంటే నెక్సా కేంద్రాల ద్వారా వచ్చే ఏడాది అధిక యూనిట్లను నమోదు చేయాలన్నది లక్ష్యమని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. రెండవ స్థానం దిశగా.. తొలి 10 లక్షల యూనిట్లకు నాలుగేళ్లు, ఆ తర్వాతి 10 లక్షల యూనిట్లకు మూడేళ్ల సమయం పట్టిందని శశాంక్ వెల్లడించారు. ‘ప్రస్తుతం మారుతీ సుజుకీ అరీనా, హ్యుండై, టాటా మోటార్స్ తర్వాత నెక్సా నాల్గవ స్థానంలో ఉంది. వచ్చే ఏడాది రెండవ స్థానానికి చేరుతుంది. సంస్థ మొత్తం విక్రయాల్లో 47 శాతం వృద్ధితో నెక్సా వాటా 23 శాతం ఉంది. దేశీయ ప్యాసింజర్ కార్ల రంగంలో నెక్సా 10 శాతం వాటా కైవసం చేసుకుంది. ఈ ఔట్లెట్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 2.55 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022–23లో 3.7 లక్షల యూనిట్లు ఆశిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త మోడళ్లు, గ్రాండ్ వితారా కారణంగా నెక్సా నుంచి 6 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాం’ అని వివరించారు. పరిశ్రమ కంటే మెరుగ్గా.. 2023–24లో ప్యాసింజర్ వాహన పరిశ్రమ వృద్ధి 5–7.5 శాతం ఆశిస్తున్నామని శశాంక్ తెలిపారు. ‘పరిశ్రమలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్లు, 2023–24లో 41 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు కావొచ్చు. ఆర్థిక వృద్ధి, రుతుపవనాల సరళి, గ్రామీణ మార్కెట్‌పై దాని ప్రభావం, వడ్డీ రేట్ల పెరుగుదల, నగదు లభ్యత స్థాయిలు, పరిస్థితులకు తగ్గట్టుగా వాహన తయారీ కంపెనీలు చేపట్టిన ధరల పెంపు వంటి అంశాల ఆధారంగా ఈ వృద్ధి ఆధారపడి ఉంటుంది. పరిశ్రమ కంటే మెరుగైన వృద్ధిని మారుతీ సుజుకీ ఆశిస్తోంది’ అని పేర్కొన్నారు. -
ఓటర్లకు మాస్కు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ వెల్లడించారు. కోవిడ్ నిబంధనలతో పోలింగ్‌ను నిర్వహిస్తామని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఓటర్లు మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఓటు వేసేవారు కరోనా టీకా తీసుకున్నట్టుగా సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన్ని కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఈవీఎంలు, వీవీప్యాట్లు పోలింగ్ కేంద్రాలకు చేరాయని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 32 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ సరళిని పరిశీలిస్తారని, 3,868 మంది పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటివరకు రూ.3.5 కోట్ల నగదును పట్టుకున్నామని, ఈ మేరకు ఎన్నికల సంఘానికి నివేదిక పంపామని పేర్కొన్నారు. అంధ ఓటర్ల కోసం బ్రెయిలీ ఈవీఎంలు సిద్ధం చేశామని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గోయల్ విజ్ఞప్తి చేశారు. వారిపై కేసులు నమోదు చేస్తాం ఉప ఎన్నికలో ఓటు వేసేందుకు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ స్థానికులు కొందరు ఆందోళన చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని శశాంక్ గోయల్ చెప్పారు. డబ్బులు అడిగిన వారిని గుర్తిస్తున్నామని, వారు డబ్బులు అడిగినట్టు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
హుజూరాబాద్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ!
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో నామినేషన్లు వేయకుండా రిటర్నింగ్ అధికారి అడ్డుకుంటున్నారని.. ఆ అధికారిని వెంటనే తొలగించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయెల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి సీఎం కేసీఆర్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రకరకాల కారణాలు చూపుతూ.. నామినేషన్లు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నామినేషన్ల కోసం రోజుకో రూల్ పెడుతున్నారని ఆక్షేపించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు వేయడానికి వస్తే తిప్పిపంపేస్తున్నారన్నారు. నామినేషన్ల గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరారు. ఈ మొత్తం వ్యవహారం మీద కోర్టుకు వెళ్తామన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం దారుణం పోలీసులు సీఎం కేసీఆర్‌కు తొత్తులుగా మారారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం దారుణమన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
ప్రేమ ప్రణవం
‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రీ అయ్యర్ ముఖ్య పాత్రల్లో కుమార్ జి. దర్శత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రణవం’. చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై తనూజ.ఎస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా తనూజ.ఎస్ మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ‘ఈ రోజుల్లో’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ మంగం కొంత గ్యాప్ తర్వాత నటించిన చిత్రమిది. మరోమారు తన ప్రతిభను నిరూపించుకునేలా ‘ప్రణవం’ ఉంటుంది. కుమార్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల ఆలోచనా విధానానికి తగ్గట్టుగా తెరకెక్కించారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి. ఈ నెల 29న సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మార్గల్ డేవిడ్, సంగీతం: పద్మనావ్ భరద్వాజ్, కో–ప్రొడ్యూసర్స్: వైశాలి, అనుదీప్. -
నా తండ్రిని హీరోను చేసింది ప్రేక్షకులే..
సాక్షి, తూర్పుగోదావరి: కోనసీమ వాసుల ఆదరణను తాము ఎన్నటికీ మరువలేమని సినీనటుడు దివంగత శ్రీహరి భార్య శాంతి శ్రీహరి, కుమారులు మేఘాన్ష్, శశాంక్‌లు అన్నారు. శ్రీహరి కుమారుడు మేఘాన్ష్ నటిస్తున్న సినిమా చిత్రీకరణ కోనసీమలో జరుగుతున్న నేపథ్యంలో శనివారం శాంతి శ్రీహరి, మరో కుమారుడు శశాంక్‌లు అంబాజీపేట వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్ ఎదురుగా ఉన్న శ్రీహరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తమ తండ్రిని హీరోను చేసింది ప్రేక్షకులేనని వారికి ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. తమ తండ్రిపై చూపిన ఆదరాభిమానాలను తమపై కూడా చూపాలని వారు కోరారు. వారి వెంట కొర్లపాటి కోటబాబు, గంధం పల్లంరాజు, గోకరకొండ సూరిబాబు, సూదాబత్తుల రాము, శిరిగినీడి వెంకటేశ్వరరావు, సలాది రాంబాబు, ఇందుగుల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఇదంతా బావ చలవే: శాంతిశ్రీహరి -
ఇదంతా బావ చలవే: శాంతిశ్రీహరి
ఏడేళ్ల తర్వాత శ్రీహరి ఇంట దీపావళి పండగకి దీపాలు వెలిగించారు. తమ జీవితంలోని చీకట్లను పారదోలి ఇప్పుడిప్పుడే వెలుగులు నింపుకుంటున్నారు దివంగత నటుడు శ్రీహరి సతీమణి, నటి, నిర్మాత శాంతీశ్రీహరి. 2013లో శ్రీహరి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీహరి చిన్న కుమారుడు మేఘాంశ్ హీరోగా చేస్తున్నాడు. మరో తనయుడు శశాంక్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. భర్త దూరం అయిన చేదు నిజం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న శాంతి తన తనయుడు మేఘాంశ్ తో కలసి పండగ వేళ బోలెడన్ని విషయాలు చెప్పారు. ► ప్రస్తుతం నా దృష్టంతా నటనపైనే. లవ్, క్రష్‌లాంటివేమీ లేవు. నా వయసిప్పుడు 20 ఏళ్లే. నా దృష్టంతా నటనపైనే ఉంది. నాన్న చేసినట్లుగా సామాజిక అంశాలతో వచ్చే చిత్రాలను అప్పుడే చేయదలచుకోలేదు. మంచి ఎంటర్టైనర్స్ చేసి ప్రేక్షకులకు దగ్గర కావాలనుకుంటున్నాను. కొంచెం పరిణితి వచ్చిన తర్వాత.. ఒకవేళ నాన్న సినిమాల్లో ఏదైనా సినిమా రీమేక్ చేయాలనుకుంటే ‘భద్రాచలం’ సినిమా చేస్తాను. ► నేను షూటింగ్లో ఉన్నప్పుడు మా అమ్మను సెట్స్ లోకి రానివ్వను. నా ఫస్ట్ మూవీ ‘రాజ్‌దూత్’ షూటింగ్‌కి ఓసారి అమ్మ సెట్‌కి వచ్చింది. నేను నటిస్తుంటే ఎదురుగా నిలబడి వెక్కిరించింది. ఆమె ఎదురుగా ఉంటే నేను నటించలేను. ► ఎప్పుడు ఎవరికి కష్టమొచ్చినా ‘నేనున్నాను’ అని ధైర్యం ఇచ్చేవారాయన. ఈ రోజు నేను, నా పిల్లలు ఏ కష్టం లేకుండా బతుకుతున్నామంటే అది ఆయన చలవే. ఆయన చేసిన పుణ్యమే.. ఆయన ఉన్నప్పుడు ఎంతోమందికి డబ్బులు ఇచ్చారు. ఆయన పోయాక వారి దగ్గరికెళ్లి మాకు రావాల్సిన డబ్బు ఇవ్వమంటే మీ ఆయనే మాకు ఇవ్వాలి అన్నారు. ► ఇంకా శాంతీశ్రీహరి ఏ సందర్భంగా కన్నీటి పర్యంతం అయ్యారు? ఆమె మనసులోని బాధ ఏంటి? ఈ తల్లీ తనయుడు మనసువిప్పి పంచుకున్న మరెన్నో విషయాల కోసం ఈ వీడియో చూసేయండి మరి... -
సుశాంత్ జీవితంతో శశాంక్
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్త బాలీవుడ్‌ను కుదిపేసింది. ఊహించని షాక్‌లా అనిపించింది. ఎన్నో వివాదాలకు, చర్చలకు దారి తీసింది. సుశాంత్ జీవితం మీద ఆల్రెడీ ఓ సినిమా (సూసైడ్ ఆర్ మర్డర్?) ప్రకటించింది బాలీవుడ్. తాజాగా మరో సినిమా కూడా తెరకెక్కనుంది. సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ‘శశాంక్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఓ యంగ్ సినిమా స్టార్ అనుకోకుండా హత్యకు గురికావడం, సినిమా ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో ఆర్య బబ్బర్, రాజ్వీర్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. పాట్నా, లక్నో, ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. -
ప్రేమలో థ్రిల్
‘ఈ రోజుల్లో’ ఫేమ్ శ్రీ మంగం, శశాంక్ హీరోలుగా అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రణవం’. కుమార్ జి. దర్శకత్వంలో చరిత అండ్ గౌతమ్ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై తనూజ. ఎస్ నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా తనూజ ఎస్. మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కుమార్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల ఆలోచనా విధానానికి తగ్గట్టుగా తెరకెక్కించారు. సంగీతం, నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి. పద్మారావ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. చాలా కాలం తర్వాత ఆర్.పి. పట్నాయక్, ఉష కలిసి మా చిత్రంలో ఓ పాటను పాడారు. సునీత, అనురాగ్ కులకర్ణి పాడిన పాటలకూ మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మార్గల్ డేవిడ్, సహ నిర్మాతలు: వైశాలి, అనుదీప్. -
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్ గోయల్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా శశాంక్ గోయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న రజత్‌కుమార్‌ను తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా నిమించింది. కొత్త సీఈఓ కోసం ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. వారిలో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా శశాంక్ గోయల్ పేరును ఖరారు చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం శశాంక్ గోయల్ కార్మిక శాఖ ముఖ్య కారద్యర్శిగా ఉన్నారు. -
రికార్డులను ట్యాంపరింగ్ చేశారు..
సాక్షి, హైదరాబాద్: మందుల కొనుగోలులో భారీ అవకతవకలు జరగడం ద్వారా వెలుగులోకి వచ్చిన ఈఎస్ఐ కుంభకోణంలో మరో కొత్త కోణం తెరపైకి వచ్చింది. రూ.300 కోట్ల విలువైన ఈ స్కామ్‌లో ముఖ్య పాత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్, ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిలపై సంచలన ఆరోపణలు చేస్తూ బి.గురవయ్య అనే యూనియన్ నేత పేరిట మంగళవారం పత్రికా కార్యాలయాలకు బహిరంగ లేఖలు వచ్చాయి. ఈ లేఖలో పేర్కొన్న మేరకు శశాంక్ గోయల్, దేవికా రాణి, నాగలక్ష్మిలు కలిసి శనివారం సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు సనత్‌నగర్‌లోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్‌లో సీడీఎస్ సెక్షన్‌కు వెళ్లి రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. వారు ఆధారాలు తారుమారు చేసేందుకు అక్కడకు వెళ్లడం నిజమో కాదో అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే తేలుతుందని ఆ లేఖలో వెల్లడించారు. మొదటి నుంచీ నాన్‌ఆర్‌సీ కంపెనీలను బినామీలుగా ఏర్పాటు చేసి దాదాపు 40కి పైగా కంపెనీల్లో అడ్డగోలుగా చెల్లింపులు చేసుకున్నారని తెలిపారు. విజిలెన్స్ నివేదికలో ఉన్న కంపెనీల పేర్లను పరిశీలించి నాన్ ఆర్సీ కంపెనీల లిస్టులో ఉన్న ఎన్ని కంపెనీలకు రెండేళ్లుగా డబ్బులు పంపారో పరిశీలిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. నాన్ ఆర్సీ కంపెనీలను బినామీలుగా సృష్టించినట్లు విజిలెన్స్ నివేదిక చెబుతుంటే ఆర్సీ కంపెనీల వైపు ఏసీబీ అధికారుల దృష్టి మరల్చే విధంగా తప్పుడు లేఖలు రాసి ఏసీబీని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రూ.కోట్లలో ముడుపులు.. ప్రధాన సూత్రధారులకు బినామీగా వ్యవహరించిన సుధాకర్‌రెడ్డి పేరిట చాలా ఫర్మ్‌లున్నాయని, గత రెండేళ్లలో సుధాకర్‌రెడ్డి మొబైల్ ఫోన్ నుంచి శశాంక్ గోయల్, దేవికా రాణిలకు వచ్చిన ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తే వీరి అక్రమాలు బయటపడుతాయని ఆ లేఖలో గురవయ్య వెల్లడించారు. సచివాలయం వేదికగానే సుధాకర్‌రెడ్డి, కమల్ అనే వ్యక్తుల నుంచి శశాంక్ గోయల్ రూ.కోట్లలో ముడుపులు తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కుంభకోణంలో కార్మిక శాఖ కార్మికుల యూనియన్ కార్యదర్శి పేరుతో పత్రికా కార్యాలయాలకు వచ్చిన లేఖలో పేర్కొన్న అంశాలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. -
అప్పుడు ఎంత అంటే అంత!
శశాంక్.. మేఘాంశ్.. ‘రియల్ స్టార్’గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన శ్రీహరి కుమారులు. ‘రాజ్‌దూత్’ చిత్రం ద్వారా మేఘాంశ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. శశాంక్‌కి డైరెక్టర్ అవ్వాలనే ఆశయం ఉంది. ఈ ఇద్దరూ తమ తండ్రి శ్రీహరి గురించి పంచుకున్న విశేషాలు. ► హీరోగా పరిచయమవుతున్న ఈ సమయంలో నాన్న పక్కన ఉంటే అనే ఫీలింగ్ రాక మానదు.. మేఘాంశ్: కచ్చితంగా. నాన్న ఉండి ఉంటే పక్కనే ఉండి నడిపించేవారు. ఒక భరోసా ఉండేది. అది మిస్సవుతున్నాం. సినిమా కమిట్ అయ్యే ముందు ఆర్టిస్ట్‌గా నాన్నకు వచ్చిన దాంట్లో ఓ 5 శాతం వచ్చినా చాలు అనుకున్నాను. నాన్న పేరు చెడగొట్టకూడదు అనే బాధ్యతతో చేశాను. ► నాన్న ఉన్నప్పుడే హీరో అవ్వాలనే టాపిక్ మీ మధ్య వచ్చిందా? మేఘాంశ్: మేం ఇద్దరం సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలనుకున్నారు. కానీ హీరోనా? డైరెక్టర్‌గానా? అనే డిస్కషన్ అయితే ఎప్పుడూ రాలేదు. అప్పుడు చిన్నపిల్లలం కదా. ► మీ నాన్నగారు ఫిట్‌గా ఉండేవారు. మీరు కూడా అదే అలవర్చుకున్నట్టున్నారు? మేఘాంశ్: ఆయన్ను చూసే జిమ్ చేయడం స్టార్ట్ చేశాం. నాన్నకి ఫిట్‌గా ఉండటం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మాకది ఇన్స్పైరింగ్గా ఉండేది. మా జిమ్‌లో నాన్న ఫొటోలు ఉంటాయి. జిమ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆ ఫొటోలు చూస్తుంటాం. ► శ్రీహరిగారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు.. మేఘాంశ్: అందరికీ హెల్ప్ చేయడం. శశాంక్: హంబుల్‌గా ఉండటం. మేఘాంశ్: హంబుల్‌గా ఉంటూనే రాయల్‌గా ఉండటం. ► ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకునేవారా? ఏదైనా గిఫ్ట్ ఇచ్చేవారా? ఇద్దరూ: ఆయన ఉన్నప్పుడు ప్రతిరోజూ మాకు సెలబ్రేషనే. శశాంక్: ఓ రోజు ఆమ్లెట్ చేసి ఇచ్చా. మస్త్ ఉంది అన్నారు. మేఘాంశ్: నేను నాన్నతో చాలా క్లోజ్‌గా ఉండేవాడిని. శశాంక్: వీడు డాడీ పెట్. ► నాన్న వెళ్లిపోయిన తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన మార్పులేంటి? శశాంక్: లైఫ్‌స్టైల్ మారిపోయింది. అప్పుడు బాధ్యతలు లేవు. ఇలా అంటే (చిటికేస్తూ) అన్నీ వచ్చేసేవి. ఇప్పుడు కొంచెం చూసి ఖర్చు పెడుతున్నాం. ఫైనాన్షియల్‌గా చాలా రెస్పాన్సిబుల్ అయిపోయాం. ► స్కూల్‌కి వెళ్లను అన్నప్పుడు నాన్న కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మేఘాంశ్: మమ్మీ కొట్టేది. కానీ డాడీ ఎప్పుడూ కొట్టలేదు. స్కూల్ బంక్ కొడితే డాడీ దగ్గరకు వెళ్లిపోయేవాళ్లం. ► డాడీ ఏ విషయంలోనూ కోప్పడలేదా? మేఘాంశ్: ఎప్పుడూ లేదు. శశాంక్: ఒకే ఒక్కసారి నన్ను కోప్పడ్డారు. ఆయన్ను చూడటానికి ఫ్యాన్స్ వచ్చారు. నేను పటాసులు కాలుస్తున్నాను. గేట్ దగ్గర రాకెట్ పేలిస్తే ఓ అభిమాని మీదకు వెళ్లింది. అప్పుడు కోప్పడ్డారు. ఇంకోసారి కార్ విండోలో నుంచి మేఘాంశ్ చేయి బయటపెడితే అద్దం పైకి ఎత్తేశా. అప్పుడు తిట్టారు. ► బిజీ ఆర్టిస్ట్ అయినా మీతో టైమ్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవారా? ఇద్దరూ: రోజూ కలసి భోజనం చేసేవాళ్లం. అప్పుడు మమ్మీ మా అల్లరి గురించి చెబుతుండేది. వాళ్ల గురించి ఇప్పుడెందుకు? హ్యాపీగా తిననివ్వు అని మమ్మీనే తిట్టేవాళ్లు. మాకు ఒక్క తిట్టు కూడా పడేది కాదు. ► మీ ప్రోగ్రెస్ కార్డ్ ఎవరు సైన్ చేసేవాళ్లు? మేఘాంశ్: మమ్మీనే. అప్పుడప్పుడు పాస్ అయ్యేవాణ్ణి, అప్పుడప్పుడు ఫెయిల్ అయ్యేవాణ్ణి. శశాంక్: కానీ వాడి తిట్లన్నీ నాకు పడేవి. ఎందుకంటే ముందు నా ప్రోగ్రెస్ కార్డ్ చూసి నన్ను తిట్టేది. మళ్లీ వాడిని ఏం తిడతాంలే అనుకునేదేమో. నన్ను తిడుతూనే ఉండేది. ► మీ ఇద్దర్లో టామ్ ఎవరు? జెర్రీ ఎవరు? మేఘాంశ్: వాడే. (శశాంక్ని చూపిస్తూ) వాడు కొట్టేటోడు.. నేను పడేటోడ్ని. (నవ్వుతూ ) ► మీ తమ్ముడు హీరో అవుతున్నాడు కదా. ఏమనిపిస్తుంది? మేఘాంశ్: మంచిగా చెప్పురా ప్లీజ్. శశాంక్: అలా చెప్పాలనే ఆలోచిస్తున్నా. ఫస్ట్ నాకు నవ్వొచ్చింది. బచ్చాగాడు హీరో అయిపోయాడు అనుకున్నాను. అయితే నేను చెప్పేదొక్కటే. హిట్ అయినా ఫట్ అయినా హంబుల్‌గా ఉండాలి. ► మీ నాన్నగారు ఉన్నప్పుడు ఓసారి పదివేలకు చాక్లెట్లు కొన్నారట? శశాంక్: నాన్నగారి కార్డ్ తీసుకెళ్లాడు. అక్కడున్న చాక్లెట్లు అన్నీ కొన్నాడు. రేయ్.. మేఘాంశ్ పదివేలు అయిందీ అంటే ఓ చాక్లెట్ పక్కన పెట్టి ఇప్పుడు 9 వేలే కదా తీసుకో అన్నాడు (నవ్వుతూ). మేఘాంశ్: మాకు రిస్ట్రిక్షన్స్ ఉండేవి కావు. పాకెట్‌మనీ ఇచ్చేవాళ్లు కాదు. ఎవరికైనా డబ్బులిచ్చి మాతో పాటు పంపేవాళ్లు. మేం కొనుక్కునేవాళ్లం. అప్పుడు ఎంత అంటే అంత. ఇప్పుడు ఎంత అవసరం ఉంటే అంత. ► యాక్టర్ అవుతున్నారు. హోమ్ వర్క్ కోసం నాన్న సినిమాలేమైనా చూశారా? మేఘాంశ్: అలా ఏం చూడలేదు. అయితే నాన్నని చూడటం కోసమే ఆయన సినిమాలు చూస్తుంటాను. ► మీ నాన్నగారికి తీరని కోరిక ఏదైనా మిగిలిపోయిందా? శశాంక్: పాలిటిక్స్. ఇంకో సంవత్సరం ఉండి ఉంటే కచ్చితంగా పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యేవారు. ఆయనకు బాగా ఇంట్రెస్ట్. సహాయం చేయాలని అనుకుంటారు. ► మరి మీలో ఎవరికైనా ఆ ఇంట్రెస్ట్ ఉందా? మేఘాంశ్: ఇంట్రెస్ట్, నాలెడ్జ్ రెండూ లేవు. ► నాన్న యాక్ట్ చేసిన సినిమాల్లో బాగా నచ్చినవి? ఇద్దరూ: కింగ్, ఢీ, భద్రాచలం, విజయరామరాజు... ఇలా చాలా ఉన్నాయి. ► తమ్ముడు హీరో అయ్యాడు.. మరి అన్న డైరెక్టర్ ఎప్పుడు అవుతాడు? శశాంక్: షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాను. ఇంకా ఏమీ అనుకోలేదు. శశాంక్, మేఘాంశ్ -
ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనే ఆరోపణల కేసులో ఐఏఎస్ అధికారి (ఇప్పుడు గద్వాల–జోగులాంబ జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు) గతంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా చేసిన కె.శశాంక్‌కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.25 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. జరిమానా సొమ్మును శశాంక్ వ్యక్తిగతంగా చెల్లించాలని, ఒకవేళ జరిమానా చెల్లించకపోతే 2 వారాలు అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పీల్ నిమిత్తం తీర్పు అమలును 6 వారాలపాటు నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. కరీంనగర్‌లోని సిఖ్వాడి వీధిలోని తన ఇంటి స్థలం విషయంలో హైకోర్టు ఆదేశాల్ని ధిక్కరించారని పేర్కొంటూ పూనం కౌర్ అలియాస్ పున్న భాయ్ దాఖలు చేసిన కేసులో ఈ తీర్పు వెలువడింది. సిఖ్వాడి వీధిలోని రెండు షాపులతో కూడిన ఇంటిని 2014లో కూల్చివేయడంపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించే షాపుల సముదాయంలో ఆమెకు షాపు కేటాయించాలని, లేనిపక్షంలో భూసేకరణ చట్ట ప్రకారం ఆమెకు పరిహారం చెల్లించాలని అప్పట్లో హైకోర్టు కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న శశాంక్‌కు ఆదేశాలు జారీ చేసింది. వీటిని అమలు చేయకపోవడంతో ఆమె కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. -
చాలా రోజుల తర్వాత పాట పాడా
‘‘చాలా రోజుల విరామం తర్వాత ‘ప్రణవం’ చిత్రంలో ఒక మంచి మెలోడీ సాంగ్ పాడాను. ఈ పాట శ్రోతలకు నచ్చుతుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు’’ అని సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ అన్నారు. ‘ఈ రోజుల్లో’ శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ ముఖ్య తారలుగా కుమార్ జి. దర్శత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రణవం’. చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై తను. ఎస్ నిర్మించారు. పద్మారావ్ భరద్వాజ్ స్వరపరచిన ఈ సినిమాలోని రెండవపాటను ఆర్.పి. పట్నాయక్ విడుదల చేశారు. ఈ పాటను ఆర్.పి.పట్నాయక్, ఉష కలిసి పాడటం విశేషం. హీరో శ్రీ మంగం మాట్లాడుతూ– ‘‘సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. మార్చిలో సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆర్పీగారు పాడిన పాట అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల మా చిత్రంలోని తొలిపాటను విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది’’ అని పద్మారావ్ భరద్వాజ్ అన్నారు. పాటల రచయిత కరుణ కుమార్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మార్గల్ డేవిడ్, సహ నిర్మాతలు: వైశాలి, అనుదీప్. -
భరతనాట్యం కీలకం
శ్రీ,శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ ముఖ్య తారలుగా కుమార్. జి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ప్రణవం’. చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై తను నిర్మించారు. వైశాలి, అనుదీప్ సహ నిర్మాతలు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా కుమార్. జి మాట్లాడుతూ– ‘‘భరతనాట్యం నేపథ్యంలో లవ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చండీఘర్‌కు చెందిన మోడల్ అవంతిక హీరోయిన్గా నటించారు. గాయత్రి కీలక పాత్రలో కనిపిస్తారు. పద్మనావ్ భరద్వాజ్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలు స్తుంది. ఆర్.పి పట్నాయక్, ఉషగారు కలిసి మా సినిమాలోని ఓ డ్యూయెట్‌ని ఆలపించారు. ఫ్రెష్ కాన్సెప్ట్‌తో యంగ్ టీమ్ చేస్తోన్న మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం’’ అని అన్నారు. -
వెబ్ సిరీస్‌లో ఆర్యన్ రాజేష్
దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా టాలీవుడ్‌లోహీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆర్యన్ రాజేష్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో కొంత కాలం నటనకు దూరమైన రాజేష్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న వినయ విధేయ రామ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు త్వరలో ఓ వెబ్ సిరీస్‌తోనూ అలరించేందుకు రెడీ అవుతున్నాడు రాజేష్. జీ5 సంస్థ రూపొందించిన ‘ఎక్కడికి ఈ పరుగు’ వెబ్ సిరీస్‌లో ఆర్యన్ రాజేష్, శశాంక్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 8 నుంచి ప్రసారం కానున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ కోసం అన్నపూర్ణ ఫిలిం అండ్ మీడియా స్కూల్ విద్యార్థులు కూడా పనిచేయటంతో కింగ్ నాగార్జున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో కల్పిక కీలక పాత్రలో నటిస్తున్నారు. -
పెట్రోలియం పరిశ్రమల్లో నిర్లక్ష్యం వద్దు
సాక్షి, హైదరాబాద్: పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల పరిశ్రమల్లో పనిచేసే సిబ్బంది తమ భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశాంక్ గోయల్ అన్నారు. ‘పెట్రోలియం, సహజ వాయువు ఉత్పత్తుల సురక్షితమైన నిర్వహణ, ప్రమాదాల తగ్గింపు’అంశంపై 2 రోజుల వర్క్‌షాప్ హైదరాబాద్‌లోని మేరిగోల్డ్ హోటల్లో మంగళవారం ప్రారం భమైంది. రాష్ట్ర పరిశ్రమల విభాగం ఆధ్వర్యంలో జాతీయ భద్రతా మండలి రాష్ట్ర విభాగం, పెట్రోలియం, సహజ వాయువు పీఎస్‌యూ కంపెనీలు ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, గెయిల్ సంస్థలు సంయుక్తంగా ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. పెట్రోలియం, సహజ వాయువు పరిశ్రమల్లో భద్రతకు తీసుకోవాల్సిన అంశాలపై ప్రారంభమైన ఇలాంటి వర్క్‌షాప్‌లను క్రమంతప్పకుండా నిర్వహించాలని అన్నారు. ఈ తరహా పరిశ్రమల్లో అందుబాటులోకి వచ్చిన నూతన సౌకర్యాలు, ఆవిష్కరణల గురించి వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల రాష్ట్ర పరిశ్రమల శాఖకు ప్రశంసలతోపాటు రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడ్డాయని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల విభాగం డైరెక్టర్ పీఎం చంద్రమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జాతీయ భద్రతా మండలి రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి వర్క్‌షాప్ ఇదేనని చెప్పా రు. ఈ తరహా పరిశ్రమల భద్రత విషయంలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉండాలని, దీనికోసం రాష్ట్ర పరిశ్రమల విభాగం, తెలంగాణ జాతీయ భద్రతా మండలి తరఫున పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. పరిశ్రమల శాఖ జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ రాజగోపాల రావు మాట్లాడుతూ.. పెట్రోలియం ఉత్పత్తుల పరిశ్రమల్లో భద్రత అత్యంత ముఖ్యమైందని అన్నారు. ఈ వర్క్‌షాప్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రతినిధులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల విభాగం అధికారులు, పీఎస్‌యూ ఆయిల్, గ్యాస్ కంపెనీల ప్రతినిధులతోపాటు ఎల్పీజీ, ప్రొపేన్‌ను ఇంధనంగా వినియోగిస్తున్న ప్రైవేటు రంగానికి చెందిన ప్రతినిధులు సుమారు 100 మంది వరకు పాల్గొన్నారు. -
హావెల్స్ ఇండియా నుంచి కొత్త వాటర్ ప్యూరిఫయర్లు
న్యూఢిల్లీ: వినియోగ వస్తువుల తయారీ కంపెనీ హావెల్స్ ఇండియా కొత్త రేంజ్ వాటర్ ప్యూరిఫైర్లను మార్కెట్లోకి తెచ్చింది. నీటిలో పీహెచ్ బ్యాలన్స్‌ను కొనసాగిస్తూ, అవసరమైన ఖనిజాలను జత చేస్తూ, శుద్ధమైన నీటిని అందించడం ఈ వాటర్ ప్యూరిఫైర్ల ప్రత్యేకత అని హావెల్స్ ఇండియా తెలిపింది. దేశంలో చాలా తక్కువ మంది వాటర్ ప్యూరిఫైర్లను వినియోగిస్తున్నారని, ఇది అత్యంత అవసరమైన వస్తువని హావెల్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శశాంక్ శ్రీవాత్సవ్ చెప్పారు. ప్రస్తుతం హరిద్వార్ ప్లాంట్‌లో ఏడాదికి 5 లక్షల వాటర్ ప్యూరిఫైర్లను తయారు చేస్తున్నామని తెలిపారు. వార్షిక తయారీ సామర్థ్యాన్ని రెట్టింపునకు–పది లక్షల యూనిట్లకు పెంచనున్నామని వివరించారు. ప్రస్తుతం ఆరు రకాలైన వాటర్ ప్యూరిఫైర్లను రూ.10,499 నుంచి రూ.23,999 రేంజ్ ధరల్లో ఈ కంపెనీ అందిస్తోంది. -
స్టార్ కాంబినేషన్లో వెబ్ సీరీస్
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వెబ్ సీరీస్ల హవా నడుస్తుంది. మెగా వారసురాలు నిహారిక స్టార్ట్ చేసిన వెబ్ సీరీస్ ట్రెండ్‌ను ఇప్పుడు చాలా మంది స్టార్స్ ఫాలో అవుతున్నారు. వెండితెర మీద సక్సెస్ కావాలనుకునే వారితో పాటు సక్సెస్ కాలేకపోయిన వారు కూడా వెబ్ సీరీస్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఔత్సాహిక కళాకారులు వెబ్ సీరీస్‌లతో ఆకట్టుకోగా ఇప్పుడు స్టార్ కాంబినేషన్లో వెబ్ సీరీస్ తెరకెక్కుతోంది. అలామొదలైంది, కళ్యాణ వైభోగమే లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను డైరెక్ట్ చేసిన నందినీ రెడ్డి కథతో నటుడు శశాంక్ దర్శకత్వంలో ఓ వెబ్ సీరీస్ రూపొందుతోంది. ఈ వెబ్ సీరీస్‌ను దాదాపు 25 ఎపిసోడ్స్‌గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్‌లో హీరో రాహుల్ రవీంద్రన్, ఆదిత్ ఈశ్వరన్‌లతో పాటు హీరోయిన్ తేజస్వీ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన అమ్మాయి జీవితంలో ఎదురైన సంఘటనల నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. -
నా భార్య నాకన్నా ఎత్తుంటే తప్పేముంది?
ఈడు జోడు మారింది చూడు కాంబినేషన్లో కొత్త మార్పులు ‘అమ్మాయి ఆకాశంలో ఉంటే వీడేమో భూమ్మీద. పెళ్లంటే ఈడూ జోడూ కుదరకపోతే ఎలా?’ ఇలాంటి ప్రశ్నలకు కాలం చెల్లింది. ఈతరహాపాత తరపు అభిప్రాయాలను పట్టించుకోని నవతరం.. ఈడు విషయంలో అబ్బాయి కన్నా అమ్మాయి చిన్నగా ఉండాలంటూ పెట్టిన ఆంక్షలను ఇప్పటికే స్పష్టంగా తిప్పికొట్టేసింది. అదే వేగంతో ఇప్పుడు జోడు విషయంలోనూ మార్పులకు సై అంటోంది. తనకన్నా ఎత్తున్న అమ్మాయిలను తలెత్తుకుని చూడడానికి మాత్రమే కాదు ఆమెతో కలిసి ఏడడుగులు నడవడానికి కూడా అబ్బాయిలు ముందుంటున్నారు. పెళ్లి అనే వ్యవస్థలో పురుషుడికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టిన సంప్రదాయం.. వయసులోనూ, ఆకారంలోనూ.. కూడా పురుషాధిక్యతకే పెద్ద పీట వేసింది. అమ్మాయికన్నా అబ్బాయి వయసు, ఎత్తు ఎక్కువుండాలని నిర్ధేశించింది. ప్రస్తుత తరం ఈ కాంబినేషన్ రూల్‌ని తోసిరాజంటోంది. హైటెక్కినా.. ఓకే ‘నా భార్య నాకన్నా ఎత్తుంటే తప్పేముంది? అందులో నాకు చిన్నతనం అనిపించాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు పంజ గుట్టలో నివసించే మల్లీశ్వరరావు. తనకన్నా ఎత్తున్న శ్రీదేవిని ఆయన భార్యగా చేసుకున్నారు. ఈ విషయంలో ఆయన బంధువుల్లో కొందరు గుసగుసలాడకపోలేదు. అయితే దీన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ‘మాది చింతపల్లి అనే పల్లెటూరు. అక్కడ భార్యకన్నా భర్త ఎత్తు తక్కువ ఉండడం అనేది నవ్వుకునే విషయమే. అయితే ఇదంతా తొలినాళ్లలోనే. ఇప్పుడు వాళ్లు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. మనసులు కలిసిన జంటలకు ఇవన్నీ చాలా చిన్న విషయాలు’అని చెప్పారాయన. అత్యాధునిక పోకడలను మోసుకొచ్చే ఫ్యాషన్ ర్యాంప్ మీద తరచూ మెరిసే సిటీ జంట ఆయేషా లఖోటియా, అజహర్ లఖోటియాలు సైతం ఈ విషయాన్ని ఎంతమాత్రం పట్టించుకోరు. ‘నా భార్య నాకన్నా హైట్ అనే విషయం నాకు గర్వంగానే అనిపిస్తుంది. నిజానికి షి ఈజ్ వెరీ గుడ్ లుకింగ్’ అంటారు అజహర్. ‘నేను హైట్ తక్కువున్నాను. నా కంటే తక్కువ హైట్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఇద్దరికీ పుట్టే పిల్లలు మరీ పొట్టిగా పుట్టే అవకాశముంది. అందుకే నాకన్నా రెండు అంగుళాలు ఎక్కువున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా’నన్నాడు శశాంక్. సినిమాలూ స్ఫూర్తి.. ‘నా హైట్ చూసి హీరోలు నా పక్కన నటించడానికి ఇబ్బంది పడుతున్నారు. అదే నాకు మైనస్ అయింది’ అంటూ వాపోయింది కొంత కాలం క్రితం మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్. అయితే, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. దీపికా పదుకునే వంటి పొడుగుకాళ్ల బ్యూటీతో షారూఖ్, రణవీర్‌సింగ్ తదితర హీరోలు, సోనాక్షి సిన్హాతో షాహిద్ కపూర్ హాయిగా జట్టు కట్టేస్తున్నారు. ఆమీర్‌ఖాన్ (5.6 ఫీట్స్) కత్రినాకైఫ్ (5.9 ఫీట్స్)తో జంటగా నటనను పండిస్తున్నారు. రియల్ లైఫ్‌లోనూ ఒకరికొకరు అంటుకు తిరిగే సల్మాన్ (5.7), కత్రినాకైఫ్‌లు ఈ తరహా కాంబినేషన్‌కు నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పుడు టాలీవుడ్ కూడా అదే బాట పట్టింది. కృతి సనన్ (5.9 ఫీట్స్) వంటి టాల్గాళ్తో నాగచైతన్య (5.7 ఫీట్స్) లాంటి కుర్ర హీరోలు హైట్‌ను పక్కన పెట్టి మరీ జోడి కట్టారు. ప్రముఖుల పెళ్లిళ్లూ... తనకన్నా వయసు, హైట్ కూడా ఎక్కువున్న అమ్మాయిని పెళ్లాడిన సచిన్ టెండూల్కర్ జంట కూడా ఈ విషయంలో యూత్‌కి ఇన్స్పిరేషనే. ‘నా భార్య నాకన్నా ఎత్తు ఎక్కువుండడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది’ అని చెప్పే రాజ్‌పాల్ యాదవ్ లాంటి బాలీవుడ్ నటులు ఈ తరహా ట్రెండ్‌కు ప్రమోటర్లుగా మారారు. ఇక సినీనటి దేవయాని, డెరైక్టర్ రాజకుమరన్ల జంట కూడా మరో ఎగ్జాంపుల్. రానున్న కాలంలో ఈడు జోడు అనేది రివర్స్ అయి అబ్బాయికన్నా అమ్మాయే ఎక్కువ వయసుండాలని, ఎత్తుండాలని కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పొడవుతో గుడ్ లుక్.. చిన్న తనం నుంచే పొడుగున్న అమ్మాయిలంటే ఇష్టం. వాళ్లలో కనబడే కాన్ఫిడెన్స్, గుడ్‌లుక్స్ బాగా ఇష్టం. అందుకేనేమో నాకన్నా ఎత్తుగా ఉందని అందరూ అంటున్నా వెనుకాడకుండా ఆయేషాని పెళ్లి చేసుకున్నాను. మీ వల్ల హైహీల్స్ వేసుకోవాలనే నా కోరిక తీరడం లేదు.. అంటూ ఆయేషా అనే సరదా మాటలు తప్ప మా మధ్య మరే సమస్య లేదు. - అజహర్ లఖోటియా ఆదివారం ఆర్గానిక్ సందడి ఆర్గానిక్ ఫ్రూట్స్, కూరగాయలు, ఇంట్లో చేసిన బ్రెడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ.. ఇలా ఎన్నో ఆదివారం అంగట్లో లభిస్తాయి. అలాగే టై గార్డెనింగ్, క్రియేటివ్ డిజైన్ స్పేస్ గురించి తెలుసుకోవచ్చు. బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఇది కొనసాగుతుంది. వీర్‌దాస్ షో... ప్రసిద్ధ భారతీయ స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ నగరంలో తన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ‘అన్బిలీవబులిష్-ట్రూ వర్డ్స్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ఎ లయర్’ పేరుతో నిర్వహించే ఈ ప్రదర్శన ఆదివారం రాత్రి 8 గంటలకు శిల్పకళావేదిక లో ఉంటుంది. బాటిల్ ఆఫ్ బ్యాండ్స్.. నగరానికి చెందిన పలు రాక్ బ్యాండ్స్ పోటాపోటీగా తమదైన శైలి సంగీతంతో హోరెత్తిస్తూ సాగే బాటిల్ ఆఫ్ బ్యాండ్స్... కార్యక్రమం పంజాగుట్టలోని సెంట్రల్మాల్లో జరుగనుంది. ఈ బ్యాండ్స్ వార్ ఆదివారం సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది. ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్ బంజారా ఎంబ్రాయిడరీతో చేసే చేతి సంచులు, పర్సులు, రకరకాల గృహాలంకారాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కలర్‌ఫుల్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకునే వారి కోసం వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఎప్పుడు: మే 30, 31 ఎక్కడ: సికింద్రబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్ ఉర్దూ గజల్స్‌కి ప్రాముఖ్యత ఎందుకు..! ఈ అంశం గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం జూన్ 2న సాయంత్రం 7 గంటలకు లామకాన్‌లో జరగనుంది. హైదరాబాద్, లక్నోకి చెందిన ప్రముఖ ఉర్దూ ప్రొఫెసర్లు పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. -
సినిమా రివ్యూ: నీజతగా...నేనుండాలి
ప్లస్ పాయింట్స్: కథ, కథనం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: హీరోయిన్ డైలాగ్స్, డబ్బింగ్ కథ, స్క్రీన్ ప్లే: షగుఫ్తా రఫీఖ్ సంగీతం: మిథున్, జీత్ గంగూలీ, అంకిత్ తివారీ నిర్మాత: బండ్ల గణేష్ దర్శకత్వం: జయ రవీంద్ర బాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై..భారీ ఘన విజయాన్ని ఆషికీ-2 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్, మద్యానికి బానిసై.. విఫలమైన ఓ గాయకుడి కథను నేపథ్యంగా తీసుకుని మ్యూజికల్, లవ్‌స్టోరిగా రూపొందిన ఆషికీ-2 చిత్రాన్ని ప్రాంతాలు భాషలకతీతంగా ప్రేక్షకులు బ్రహ్మరంధం పట్టారు. అదే చిత్రాన్ని తాజాగా ‘నీజతగా...నేనుండాలి’ టైటిల్‌తో రూపొందించి ఆగస్టు 22 తేదిన విడుదల చేశారు. హిందీలో ఆకట్టుకన్న విధంగానే ‘నీజతగా నేనుండాలి’ ప్రేక్షకులను ఆలరించిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథలోకి వెళ్లాల్సిందే. కొద్దికాలంలోనే పాపులారిటీని సొంతం చేసుకున్న ఆర్జే, గాయకుడు రాఘవ జయరాం. డ్రగ్స్, మద్యానికి బానిసైన రాఘవ క్రమంగా తన పాపులారిటీని క్రమంగా కోల్పోతాడు. ఈ నేపథ్యంలో గాయత్రి నందన అనే బార్ సింగర్‌ను చూసి ఆమెలోని టాలెంట్‌ను ఇష్టపడుతాడు. గాయత్రిని గొప్ప సింగర్ చేయాలని నిర్ణయించుకుంటాడు. గాయత్రిపై ఇష్టం ప్రేమగా మారుతుంది. గాయత్రిని గొప్ప సింగర్‌ని చేశాడా? సింగర్‌గా రాఘవ మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నాడా?గాయత్రి, రాఘవల ప్రేమ సుఖాంత మవుతుందా అనే ప్రశ్నలకు సమాధానమే నీజతగా నేనుండాలి. రాఘవగా సచిన్, గాయత్రిగా నజ్రియాలు నటించారు. తమ శక్తి సామర్ధ్యాల మేరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. పాధ్యాన్యత ఉన్న పాత్రల్లో నటించిన రావు రమేశ్, శశాంక్‌లు వారి పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. సగటు సంగీత అభిమానులను హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించికున్న ఆషికీ-2 మ్యూజిక్ ఒరిజినల్ ట్రాక్స్ మళ్లీ వినాలనే రేంజ్లో ఉన్నాయి. నేపథ్యగీతాలకు చంద్రబోస్ అందించిన సాహిత్యం బాగుంది. విశ్లేషణ: దేశవ్యాప్తంగా ఆషికీ-2 చిత్రానికి యువతతోపాటు అన్నివర్గాల నుంచి లభించిన ఆదరణ ఈ మధ్యకాలంలో ఏచిత్రానికి లభించలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారంటే అంచనాలు, కంపారిజన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంత వద్దనుకున్నా.. ఆషికీ-2 చిత్ర ప్రభావం వెంటాడుతునే ఉంటుంది. ఆషికీ-2 చిత్రం ప్రభావం ఆ రేంజ్లో ఉంటుంది. ‘నీజతగా నేనుండాలి’ చిత్ర విషయానికి వస్తే.. ఆ రేంజ్లో ఫీల్ కలిగించలేకపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రంలో ఇంటెన్సిటిని, ఫీల్‌ను కొనసాగించడానికి జట్టు తమ శాయశక్తులా ప్రయత్నించారు. నటీనటుల యాక్టింగ్‌ను.. డైలాగ్స్, డబ్బింగ్ ఎక్కువగా డామినేట్ చేశాయి. హీరో, హీరోయిన్ల ఎంపిక విషయంలో మరికొంత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆషికీ-2 చిత్రాన్ని చూడని తెలుగు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. కొన్ని సీన్లలో ఎమోషన్స్‌ను తెరపైన చూపించడంలో సంగీతం, దర్శకుడు జయ రవీంద్ర ప్రతిభ ప్రధానపాత్ర పోషించింది. ఆషికీ-2 చూడని ప్రేక్షకులకు ‘నీజతగా నేనుండాలి’ ఓ ఫీల్‌ను కలిగిస్తుంది కాని.. అద్బుతమైన ఫీలింగ్‌ను మాత్రం కాదు.. -
నాన్న మెచ్చిన దారిలో..
‘ నాన్ననే నవ్ముకం దూరమై నెలలు గడుస్తున్నాయి. ఇన్నాళ్లూ అపనవ్ముకంతో కాలం గడిపిన మేవుు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం. నాన్న ఆశ యూలు నిలబెట్టే ప్రయుత్నంలో ఉన్నాం’ అని చెబుతున్నారు రియుల్ స్టార్ శ్రీహరి తనయుులు శశాంక్, మేఘాంశ్. నాన్న మెచ్చిన దారిలో వెళ్తున్నావుంటున్న వీరిని ‘సిటీప్లస్’ పలకరించింది. మేఘాంశ్: నాన్న అన్ని సౌకర్యాలతో ఇంట్లోనే పెద్ద జిమ్ ఏర్పాటు చేశారు. నేను, అన్న ప్రతి రోజూ గం టల తరబడి ఎక్సర్సైజ్లు చేసేవాళ్లం. ఫిట్నెస్ కాపాడుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలో నాన్న చెప్పేవారు. అన్న నాన్నతో కలసి పోటాపోటీగా ఎక్సర్సైజ్ చేసేవాడు. నాన్న పోయాక అన్న ఇప్పుడు జిమ్‌ను మళ్లీ ప్రారంభించాడు. నాన్న జ్ఞాపకాలతో జిమ్‌లో గడుపుతున్నాం. శశాంక్: మేమంటే నాన్నకు చాలా ఇష్టం. మాకు కూడా నాన్నంటే ఎంతో ఇష్టం. మమ్మల్ని స్నేహితుల్లానే చూసేవారు. నన్ను డెరైక్టర్ చేయాలని, తమ్ముడిని హీరో చేయాలని నాన్నకు కోరికగా ఉండేది. అమ్మ మాత్రం నన్ను డాక్టర్‌గా, తమ్ముడిని లాయర్‌గా చూడాలనుకునేది. నాన్న పోయాక అమ్మ ఆలోచనలూ మారాయి. నాన్న కోరిక మేరకే మమ్మల్ని డెరైక్టర్‌గా, హీరోగా చేయాలనుకుంటోంది. - శిరీష చల్లపల్లి