భరతనాట్యం కీలకం | Pranavam To Release in Bharathanatyam Backdrop | Sakshi
Sakshi News home page

భరతనాట్యం కీలకం

Published Fri, Jan 11 2019 12:13 AM | Last Updated on Fri, Jan 11 2019 12:13 AM

Pranavam To Release in Bharathanatyam Backdrop - Sakshi

శ్రీ, అవంతిక హరి నల్వా

శ్రీ,శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్‌ ముఖ్య తారలుగా కుమార్‌. జి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ప్రణవం’. చరిత అండ్‌ గౌతమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తను నిర్మించారు. వైశాలి, అనుదీప్‌ సహ నిర్మాతలు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా కుమార్‌. జి మాట్లాడుతూ– ‘‘భరతనాట్యం నేపథ్యంలో లవ్‌ అండ్‌ సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.

చండీఘర్‌కు చెందిన మోడల్‌ అవంతిక హీరోయిన్‌గా నటించారు. గాయత్రి కీలక పాత్రలో కనిపిస్తారు. పద్మనావ్‌ భరద్వాజ్‌ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలు స్తుంది. ఆర్‌.పి పట్నాయక్, ఉషగారు కలిసి మా సినిమాలోని ఓ డ్యూయెట్‌ని ఆలపించారు. ఫ్రెష్‌ కాన్సెప్ట్‌తో యంగ్‌ టీమ్‌ చేస్తోన్న మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement