sree
-
అందంగా, ఆనందంగా: గోవాలో నటి శ్రీజిత మ్యాజికల్ వెడ్డింగ్ (ఫోటోలు)
-
బిగ్‌బాస్ బ్యూటీ అశ్విని శ్రీ.. ఇంత హాట్‌గా ఉందేంటి? (ఫొటోలు)
-
కామెడీ.. థ్రిల్
పరుచూరి సుదర్శన్, శ్రీ జంటగా రవికిషోర్ బాబు చందిన దర్శకత్వంలో ఓ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు ‘రూమర్స్ డిస్ట్రాయ్ లైఫ్స్’ అనేది ఉపశీర్షిక. యన్. పాండు రంగారావు, కోయ చిన్నరెడ్డయ్య నిర్మిస్తున్న చిత్రం ఇది. శనివారం సుదర్శన్ బర్త్ డే. ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. యోగి, దొరబాబు, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ బాబి, సునీతా మోహన్, రాజేశ్వరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య. -
పదికాలాల పాటు నిలిచిపోయేలా...
శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ముఖ్యతారలుగా వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జై సేన’. వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సాయి అరుణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను నటుడు సునీల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘పదికాలాల పాటు నిలిచిపోయేలా మంచి సినిమాలు తీయాలనే శివ మహాతేజ ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించాం. ఇందులో తొలి ప్రయత్నంగా చేస్తున్న సినిమా ‘జై సేన’. నా ప్రతి సినిమాలో సామాజిక అంశాలున్నట్లే ఇందు లోనూ ఉన్నాయి. సహ నిర్మాత శిరీష్ రెడ్డిగారు అన్ని విషయాల్లో నాకు బ్యాక్‌బోన్‌లా నిలిచారు. జూలైలో సినిమా విడుదల చేయాలనుకుంటు న్నాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు కథే సూపర్‌స్టార్. నేను పరిచయం అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు మారకుండా అలాగే ఉన్న వ్యక్తుల్లో సముద్ర ఒకరు’’ అన్నారు సునీల్. ‘‘సముద్రతోనే నా జర్నీ స్టార్ట్ అయింది’’ అన్నారు సంగీత దర్శకుడు రవిశంకర్. శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్, శిరీష్ రెడ్డి, గోపీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాసు, సహ నిర్మాతలు: పి.శిరీష్ రెడ్డి, దేవినేని శ్రీనివాస్. -
భరతనాట్యం కీలకం
శ్రీ,శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ ముఖ్య తారలుగా కుమార్. జి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ప్రణవం’. చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై తను నిర్మించారు. వైశాలి, అనుదీప్ సహ నిర్మాతలు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా కుమార్. జి మాట్లాడుతూ– ‘‘భరతనాట్యం నేపథ్యంలో లవ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చండీఘర్‌కు చెందిన మోడల్ అవంతిక హీరోయిన్గా నటించారు. గాయత్రి కీలక పాత్రలో కనిపిస్తారు. పద్మనావ్ భరద్వాజ్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలు స్తుంది. ఆర్.పి పట్నాయక్, ఉషగారు కలిసి మా సినిమాలోని ఓ డ్యూయెట్‌ని ఆలపించారు. ఫ్రెష్ కాన్సెప్ట్‌తో యంగ్ టీమ్ చేస్తోన్న మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం’’ అని అన్నారు. -
శ్రీదేవి ఎవరు?
నాలుగేళ్ల వయసులో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి జీవితంలో ఎక్కువ భాగం నటిగానే కొనసాగారు శ్రీదేవి. భౌతికంగా లేకపోయినా.. నటించిన చిత్రాలు, విభిన్నమైన పాత్రల రూపంలో ప్రేక్షకుల హృదయాల్లో ఆమె నిలిచే ఉంటారు. ఇలాంటి గొప్ప నటి జీవిత చరిత్ర ఆదర్శనీయమైంది. రాబోయే కథానాయికలకు మార్గనిర్దేశం లాంటిది. అందుకే శ్రీదేవి లైఫ్‌స్టోరీతో ఆమె భర్త బోనీకపూర్ ఓ డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నారని బీటౌన్‌లో స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది. అందుకోసం ఈయన ‘శ్రీ, శ్రీదేవి, శ్రీ మ్యామ్’ అనే టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే శ్రీదేవి పాత్రలో నటించి, ప్రేక్షకులను మెప్పించగల నటి ఎవరు? అన్న ఆసక్తి హట్‌టాపిక్‌గా మారింది. ఈ సంగతి ఇలా ఉంచితే.. శ్రీదేవి కూమార్తెలు జాన్వీకపూర్, ఖుషీ కపూర్ ఇప్పుడిప్పుడే శ్రీదేవి లేరనే బాధ నుంచి తేరుకున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్గా జరిగిన ఓ వేడుకలో పక్కనున్న ఫొటోలోలా ఫన్నీగా కనిపించారు జాన్వీ అండ్ ఖుషీ. -
నీలం ట్రైలర్‌పై నిషేధం
తమిళసినిమా: ఉనకుల్ నాన్, లైన్మెన్, బ్యూటిఫుల్ ఐ వంటి చిత్రాలను రూపొందించిన వెంకటేష్ కుమార్ తాజాగా దర్శకత్వం వహించిన కొత్త చిత్ర నీలం. బ్లూవెల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ ద్వారా ఆయన ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇందులో శ్రీ, పవిత్రా, జగన్, జయకుమార్ వంటి పలువురు నటించారు. సతీష్ చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చగా. రామలింగం స్క్రీన్‌ప్లే చేశారు. నీలం చిత్రాన్ని శ్రీలంకలో జరిగిన అంతర్గత పోరు, ఈలం తమిళుల కష్టాలను కళ్లకు కట్టే రీతిలో రూపొందించారు. ఇప్పటికీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ సిద్ధమైంది. దీనిని సెన్సార్ అధికారుల తనిఖీ కోసం పంపారు. ట్రైలర్ తిలకించిన సెన్సార్ బోర్డు సభ్యులు ఇబ్బందికర రీతిలో డైలాగ్‌లు అధికంగా ఉన్నాయన్నారు. దీంతో ట్రైలర్‌కు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయం గురించి చిత్ర దర్శక నిర్మాత వెంకటేష్ కుమార్ మాట్లాడుతూ నీలం చిత్ర ట్రైలర్‌ను సెన్సార్ బృందం నిరాకరించారని తెలిపారు. ఈ చిత్రం ఈలం తమిళుల నేపథ్యంలో చిత్రీకరించినందున సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. ఇది తన ఐదేళ్ల శ్రమ. ఈ చిత్రం పూర్తిగా తమిళుల కోసం రూపొందించింది. తనకు న్యాయం కావాలని వెంకటేష్ కోరుతున్నారు. -
తల్లి పాత్రలే గుర్తింపు తెచ్చాయి
కరప : తల్లి పాత్రలే తనకు మంచి గుర్తింపు తెచ్చాయని నటి అన్నపూర్ణ అన్నారు. మండల కేంద్రమైన కరపలో మాజీ ఎంపీటీసీ ఉడతా అచ్చియ్యమ్మ (డాక్టరమ్మ) 14వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం వచ్చినవామె విలేకర్లతో కొద్దిసేపు మాట్లాడారు. ఇంతవరకూ 850 చిత్రాల్లో నటించానని హీరోయిన్గాకంటే కేరక్టర్ యాక్టర్ పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చానని, తర్వాత తల్లిపాత్రలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయని అన్నారు. ఎక్కడకు వెళ్లినా ‘అమ్మా అన్నపూర్ణా’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారి అభిమానం మరువలేనిదన్నారు. అందరి అభిమానం పొందడం పూర్వజన్మ సుకృతమన్నారు. చిరంజీవి 150వ చిత్రం, బాలకృష్ణ 100వ చిత్రాల్లో నటించడం గర్వంగా ఉందన్నారు. ప్రేక్షకుల ఆదరణ ఉన్నంతకాలం సినీ, బుల్లితెరలపై నటిస్తూనే ఉంటానన్నారు. సినిమా టికెట్ల రేట్ల విషయం ప్రభుత్వాన్ని అడిగేకంటే సినీ దర్శక నిర్మాతలనే అడగాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అన్నపూర్ణ, సురేష్ బ్యానర్స్పైన, 14 రీల్స్‌తోపాటు తాను నటిస్తున్న మరో చిత్రం నిర్మాణంలో ఉన్నాయని అన్నపూర్ణ చెప్పారు. హాస్యపాత్రలవల్లే గుర్తింపు అబ్బ.. జబ్బ.. దెబ్బ..అని, బాబూ చిట్టీ.. అని డైలాగులు చెబుతూ చేసిన హాస్యపాత్రలే తనకు ప్రేక్షకుల్లో ఆదరణ తీసుకొచ్చాయని హాస్యనటి శ్రీలక్ష్మి చెప్పారు. కరపలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇంతవరకూ 500 పైగా చిత్రాల్లో నటించానని, ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకులు చూపించే అభిమానం మరువలేనిదని అన్నారు. వెండితెరతోపాటు బుల్లితెరపై కూడా మంచి అవకాశాలే వస్తున్నాయన్నారు. ఏలూరు సీఐ ఉడతా బంగార్రాజు తమ తల్లి వర్ధంతి కార్యక్రమానికి తమను తీసుకొచ్చి సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీలక్ష్మి తెలిపారు. -
దశరథ్‌తో మళ్లీ..!
మనోజ్-దశరథ్ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీ’ చిత్రం క్లీన్ ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకుంది. తమన్నా ఈ చిత్రంతోనే తెలుగు తెరకు పరిచయమయ్యారు. మళ్లీ పదేళ్ల తర్వాత మనోజ్-దశరథ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవలే ‘సూర్య వర్సెస్ సూర్య’తో విజయాన్నందుకున్న నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ సినిమా నిర్మించనున్నారు. దశరథ్ శైలిలో సాగుతూనే, మనోజ్‌లోని మరో కోణాన్ని ఆవిష్కరించే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ, జూన్‌లో చిత్రీకరణ మొదలుపెడతామనీ, ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తామనీ నిర్మాత తెలిపారు.