నీలం ట్రైలర్‌పై నిషేధం | Sri Lankan war-based Tamil film 'Neelam' denied censor board . | Sakshi
Sakshi News home page

నీలం ట్రైలర్‌పై నిషేధం

Published Tue, Oct 31 2017 5:32 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

Sri Lankan war-based Tamil film 'Neelam' denied censor board . - Sakshi

తమిళసినిమా: ఉనకుల్‌ నాన్, లైన్‌మెన్, బ్యూటిఫుల్‌ ఐ వంటి చిత్రాలను రూపొందించిన వెంకటేష్‌ కుమార్‌ తాజాగా దర్శకత్వం వహించిన కొత్త చిత్ర నీలం. బ్లూవెల్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ ద్వారా ఆయన ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇందులో శ్రీ, పవిత్రా, జగన్, జయకుమార్‌ వంటి పలువురు నటించారు. సతీష్‌ చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చగా. రామలింగం స్క్రీన్‌ప్లే చేశారు. నీలం చిత్రాన్ని శ్రీలంకలో జరిగిన అంతర్గత పోరు, ఈలం తమిళుల కష్టాలను కళ్లకు కట్టే రీతిలో రూపొందించారు. ఇప్పటికీ షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ సిద్ధమైంది.

దీనిని సెన్సార్‌ అధికారుల తనిఖీ కోసం పంపారు. ట్రైలర్‌ తిలకించిన సెన్సార్‌ బోర్డు సభ్యులు ఇబ్బందికర రీతిలో  డైలాగ్‌లు అధికంగా ఉన్నాయన్నారు. దీంతో ట్రైలర్‌కు సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయం గురించి చిత్ర దర్శక నిర్మాత వెంకటేష్‌ కుమార్‌ మాట్లాడుతూ నీలం చిత్ర ట్రైలర్‌ను సెన్సార్‌ బృందం నిరాకరించారని తెలిపారు. ఈ చిత్రం ఈలం తమిళుల నేపథ్యంలో చిత్రీకరించినందున సర్టిఫికేట్‌ ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. ఇది తన ఐదేళ్ల శ్రమ. ఈ చిత్రం పూర్తిగా తమిళుల కోసం రూపొందించింది. తనకు న్యాయం కావాలని వెంకటేష్‌ కోరుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement