
అంబాజీపేటలో శ్రీహరి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న శ్రీహరి కుటుంబ సభ్యులు
సాక్షి, తూర్పుగోదావరి: కోనసీమ వాసుల ఆదరణను తాము ఎన్నటికీ మరువలేమని సినీనటుడు దివంగత శ్రీహరి భార్య శాంతి శ్రీహరి, కుమారులు మేఘాన్ష్, శశాంక్‌లు అన్నారు. శ్రీహరి కుమారుడు మేఘాన్ష్ నటిస్తున్న సినిమా చిత్రీకరణ కోనసీమలో జరుగుతున్న నేపథ్యంలో శనివారం శాంతి శ్రీహరి, మరో కుమారుడు శశాంక్‌లు అంబాజీపేట వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్ ఎదురుగా ఉన్న శ్రీహరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తమ తండ్రిని హీరోను చేసింది ప్రేక్షకులేనని వారికి ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. తమ తండ్రిపై చూపిన ఆదరాభిమానాలను తమపై కూడా చూపాలని వారు కోరారు. వారి వెంట కొర్లపాటి కోటబాబు, గంధం పల్లంరాజు, గోకరకొండ సూరిబాబు, సూదాబత్తుల రాము, శిరిగినీడి వెంకటేశ్వరరావు, సలాది రాంబాబు, ఇందుగుల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఇదంతా బావ చలవే: శాంతిశ్రీహరి
Comments
Please login to add a commentAdd a comment