‘బచ్చన్’తో ప్రేమాయణం | Love with bachchan | Sakshi
Sakshi News home page

‘బచ్చన్’తో ప్రేమాయణం

Published Mon, May 12 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM

‘బచ్చన్’తో ప్రేమాయణం

‘బచ్చన్’తో ప్రేమాయణం

సుదీప్, జగపతిబాబు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన కన్నడ చిత్రం ‘బచ్చన్’. శశాంక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదించారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. వి.హరికష్ణ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక రాజకీయనాయకుడు బసవరాజు సారయ్య ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. పీఎన్ రామచంద్రరావు, శివనాగేశ్వరరావు, వీరశంకర్, అరుణ్‌ప్రసాద్, సునీల్‌కుమార్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
 
 ట్రాఫిక్, వీరుడొక్కడే చిత్రాలు నిర్మాతగా తనకు మంచి గుర్తింపునిచ్చాయని, ఈ సినిమా వాటిని మించే స్థాయిలో, మాస్‌ని రంజింపజేసేలా ఉంటుందని, సుదీప్‌తో భావన ప్రేమాయణం ఆసక్తి గొలిపేలా ఉంటుందని, ఈ నెల 17న చిత్రాన్ని విడుదల చేస్తామని తుమ్మలపల్లి చెప్పారు. భావన కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నాజర్, ఆశిష్ విద్యార్థి, బొమ్మాళి రవిశంకర్, ప్రదీప్ రావత్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: శేఖర్‌చంద్రు, పాటలు: చల్లా భాగ్యలక్ష్మి, సహ నిర్మాత: టి.భరత్‌కుమార్, సమర్పణ: ఉదయ్ కె.మెహతా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement