సైరా.. జాతర! | syera narasimha reddy movie song shoot in hyderabad | Sakshi
Sakshi News home page

సైరా.. జాతర!

Published Sun, Jan 20 2019 1:40 AM | Last Updated on Sun, Jan 20 2019 1:40 AM

syera narasimha reddy movie song shoot in hyderabad - Sakshi

చిరంజీవి

హైదారాబాద్‌ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్‌ వేసి వారం రోజులుగా రిహార్సల్స్‌ చేస్తున్నారు ‘సైరా: నరసింహారెడ్డి’ టీమ్‌. ప్రస్తుతానికైతే యాక్షన్‌ సన్నివేశాల కోసం కాదు. ఓ సాంగ్‌ కోసం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

రేపటి నుంచి చిత్రీకరించబోయే ఈ సాంగ్‌లో చిరంజీవి, తమన్నా, జగపతిబాబు, సుదీప్‌ పాల్గొంటారని సమాచారం. జాతర నేపథ్యంలో సాగే ఈ సాంగ్‌ను దాదాపు వారం రోజుల పాటు చిత్రీకరిస్తారని తెలిసింది. అంతేకాదు.. వెయ్యిమంది డ్యాన్సర్లు ఈ పాటలో పాల్గొంటారట. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, విజయ్‌ సేతుపతి, బ్రహ్మాజీ కీలక పాత్రలు చేస్తున్నారు. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్‌ కానుందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement