Bachchan
-
వ్యర్థాలనుంచి కంపోస్ట్ ప్రచారంలో అమితాబ్
న్యూఢిల్లీః బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ స్వచ్ఛభారత్ మిషన్ ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అభ్యర్థన మేరకు 'వేస్ట్ టు కంపోస్ట్' ( వ్యర్థాలనుంచి ఎరువులు) ప్రచారంలో ప్రధాన పాత్రను పోషించనున్నారు. చెత్తను సేకరించి ఎరువుల కంపెనీలకు అమ్మకాలు చేపట్టడం, వ్యర్థాలనుంచి ఎరువుల తయారీ వంటి విషయాలపపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బిగ్ బీ ముందుకొచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ ప్రచార కార్యక్రమంలో అమితాబచ్చన్ ప్రధాన పాత్ర వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా నగరాల్లో పేరుకునే వ్యర్థాలను ఎరువులుగా మార్చి పొలాలకు ఉపయోగించే ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచనున్నారు. ఈ సందర్భంలో నగరాల్లోని చెత్తను కంపోస్ట్ గా మార్చే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు మీరు అంగీకరించడం ఎంతో ఆనందంగా ఉందని, అందుకు మీకు కృతజ్ఞతలు అంటూ జూన్ 20న పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ బిగ్ బీ కి ప్రత్యేక లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. చెత్తను కంపోస్ట్ గా మార్చి, ఇళ్ళలోని గార్డెన్లలో వినియోగించేందుకు ప్రజలకు, నర్సరీల యజమానులకు, ఉద్యానవన సంస్థలు, ఏజెన్సీలకు రేడియో, టీవీ ప్రకటనలు పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించడంలో వ్యక్తిగతంగానూ, వాయిస్ ద్వారానూ భాగం పంచుకొంటూ.. స్వచ్ఛభారత్ ప్రచారంలో అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ మంత్రిత్వ శాఖ సదరు లేఖలో తెలిపింది. అత్యధిక చెత్త ఏర్పడే అవకాశం ఉన్న హోటల్స్, విద్యా సంస్థల ప్రాంగణాల్లో ప్రత్యేక పరికరాలను ఏర్పాటుచేసి సేంద్రీయ వ్యర్థాలను విడివిడిగా వేయాలన్న విజ్ఞప్తుల ద్వారా పౌరులను ప్రోత్సహించడంలోనూ, బహుళ వేదికల ద్వారా సమాచార ప్రచారాన్ని చేరవేయడంలోనూ అమితాబ్ క్రియాశీలక పాత్ర పోషించేందుకు మంత్రిత్వ శాఖ ప్రణాళికలు చేస్తోంది. ఐదేళ్ళ గడువులోగా దేశం మొత్తం పరిశుభ్రంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో 2014 అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ అభియాన్, క్లీన్ ఇండియా మిషన్ కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. -
సరబ్జిత్ సోదరిగా 'ఐశ్వర్యరాయ్'
-
భారత్-పాక్ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా అమితాబ్
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఇప్పటికే తన గాంభీర్యమైన కంఠంతో చిత్రాల్లోనే కాకుండా కౌన్ బనేగా కరోడ్ పతీ కార్యక్రమం ద్వారా అభిమానులను అరలించిన అమితాబ్.. ప్రపంచకప్‌లో కామెంటేటర్‌గా మన ముందుకు రానున్నారు. నాలుగేళ్లకోకసారి జరిగే వరల్డ్ కప్ అంటే అందరికీ అత్యంత ఆసక్తి. అందులోనూ భారత్-పాక్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోనూ ఉత్కంఠే. ఆదివారం జరిగే భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో అమితాబ్ తొలిసారిగా కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. మాజీ క్రికెటర్లు కపిల్‌దేవ్, షోయబ్ అక్తర్, హర్షబోగ్లే వంటి దిగ్గజాల సరసన అమితాబ్ కామెంటేటరీ చెప్పనున్నారు. తన షమితాబ్ చిత్రానికి ప్రమోషన్ గానే ఆయన కామెంట్రీ చెబుతారని అంటున్నారు. -
‘బచ్చన్’తో ప్రేమాయణం
సుదీప్, జగపతిబాబు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన కన్నడ చిత్రం ‘బచ్చన్’. శశాంక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదించారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. వి.హరికష్ణ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక రాజకీయనాయకుడు బసవరాజు సారయ్య ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. పీఎన్ రామచంద్రరావు, శివనాగేశ్వరరావు, వీరశంకర్, అరుణ్‌ప్రసాద్, సునీల్‌కుమార్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ట్రాఫిక్, వీరుడొక్కడే చిత్రాలు నిర్మాతగా తనకు మంచి గుర్తింపునిచ్చాయని, ఈ సినిమా వాటిని మించే స్థాయిలో, మాస్‌ని రంజింపజేసేలా ఉంటుందని, సుదీప్తో భావన ప్రేమాయణం ఆసక్తి గొలిపేలా ఉంటుందని, ఈ నెల 17న చిత్రాన్ని విడుదల చేస్తామని తుమ్మలపల్లి చెప్పారు. భావన కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నాజర్, ఆశిష్ విద్యార్థి, బొమ్మాళి రవిశంకర్, ప్రదీప్ రావత్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: శేఖర్చంద్రు, పాటలు: చల్లా భాగ్యలక్ష్మి, సహ నిర్మాత: టి.భరత్‌కుమార్, సమర్పణ: ఉదయ్ కె.మెహతా. -
బచ్చన్ ఎందుకలా చేశాడు?
బచ్చన్ మంచి యువకుడు. తనేంటో తన వ్యాపారమేంటో అన్నట్లు ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇద్దరు వ్యక్తులను హత్య చేస్తాడు. అతనెందుకలా చేయాల్సి వచ్చింది? ఈ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన ఇన్వెస్టిగేటివ్ పోలీసాఫీసర్ అసలు నిజం తెలుసుకుంటాడా? తదితర అంశాలతో రూపొందిన కన్నడ చిత్రం ‘బచ్చన్’. టైటిల్ రోల్‌ను సుదీప్, పోలీసాఫీసర్ పాత్రను జగపతిబాబు పోషించగా భావన, పరుల్ యాదవ్, తులిప్ జోషి నాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని అదే పేరుతో ఉదయ్ కె.మెహతా సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులోకి అనువదించారు. ఈ నెల 16న మూడు వందల థియేటర్లలో సినిమాని విడుదల చేయనున్నామని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు. -
‘బచ్చన్’తో హ్యాట్రిక్
‘‘సినిమా అంటే రామసత్యనారాయణగారికి ఎంతో మక్కువ. చాలా ఇష్టంగా, అంకితభావంతో సినిమాలు తీస్తారు. ఈ మధ్య ట్రాఫిక్, వీరుడొక్కడే లాంటి విజయవంతమైన చిత్రాలు అందించారు. ఈ ‘బచ్చన్’ విజయంతో ఆయన హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు శ్రీకాంత్. సుదీప్, భావన, పరుల్ యాదవ్, తులిప్ జోషి హీరో హీరోయిన్లుగా జగపతిబాబు కీలక పాత్రలో రూపొందిన కన్నడ ‘బచ్చన్’ని అదే పేరుతో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో శ్రీకాంత్ అతిథిగా పాల్గొని ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ వేడుకలో పాల్గొన్న కోడి రామకృష్ణ, కేవీవీ సత్యనారాయణ, బి. గోపాల్, సాగర్, వీఎన్ ఆదిత్య, లగడపాటి శ్రీధర్ తదితరులు చిత్రబృందానికి శుభాకాంక్షలు అందజేశారు. ఇందులో మొత్తం పాటలు తానే రాశానని రచయిత్రి భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ నెల 25న సినిమాని విడుదల చేయనున్నామని, కన్నడంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని నిర్మాత చెప్పారు. -
‘బచ్చన్' టార్గెట్ ఏంటి
‘ఈగ' ఫేం సుదీప్ హీరోగా, జగపతిబాబు కీలక పాత్రలో రూపొందిన కన్నడ చిత్రం ‘బచ్చన్' అదే పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. ఉదయ్ కె. మెహతా సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్నిఅనువదిస్తున్నారు. బుధవారం ఈ సినిమా ప్రచార చిత్రాలను దర్శకుడు దశరథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామసత్యనారాయణ మాట్లాడుతూ -‘‘బచ్చన్ ఎవరు? అతని లక్ష్యం ఏంటి? అనేది సినిమాలో చూడాల్సిందే. జగపతిబాబు చేసిన పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. యాక్షన్, సస్పెన్స్, సెంటిమెంట్ సమాహారంగా సాగే ఈ సినిమా కన్నడంలో ఘనవిజయం సాధించింది. తెలుగులో కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ వేడుకలో చదలవాడ శ్రీనివాసరావు, అల్లాణి శ్రీధర్, అజయ్‌కుమార్, సుంకు రమేష్, సజ్జు తదితరులు పాల్గొన్నారు. -
బచ్చన్ మూవీ స్టిల్స్
-
బచ్చన్ మూవీ ట్రైలర్ లాంచ్
-
ముంబైకర్లకు బచ్చన్ ఆరోగ్య పాఠాలు!
సాక్షి, ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ బాద్షా అమితాబ్‌బచ్చన్ వ్యవహరించే అవకాశముంది. నగరంలో పెరుగుతున్న విషజ్వరాలైన డెంగీ, మలేరియాలను అరికట్టడం కోసం ప్రజల్లో జనజాగృతి కల్పించేందుకు ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా చేసి లఘు చిత్రం (షార్ట్ ఫిల్మ్) చేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుందని సమాచారం. దీంతో తొందర్లోనే ముంబైవాసులకు మలేరియా, విషజ్వరాల బారినపడకుండా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అమితాబ్ బచ్చన్ లఘు చిత్రం ద్వారా సందేశమివ్వనున్నారు. నగరంలో గత కొంత కాలంగా డెంగీ, మలేరియాలు విజృంభించాయి. వీటిని అడ్డుకునేందుకు ఇప్పటికే అనేక విధాల ప్రయత్నిస్తున్న బీఎంసీ తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఫిల్మ్‌లో బాలీవుడ్ బాద్షా అమితాబ్‌ను తీసుకోవాలని భావిస్తోంది. ఆయన ద్వారా జనజాగృతి కల్పిస్తే మంచి ఫలితాలుంటాయని యోచిస్తోంది. దీనిపై తొందర్లోనే తుది నిర్ణయం తీసుకుంటామని బీఎంసీ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అరుణ్ బామణే తెలిపారు. అయితే లఘు చిత్రం రూపొందించిన అనంతరం నగరంలోని అన్ని సినిమా థియేటర్లలో ఈ షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించనున్నట్టు తెలిసింది. ముంబైతోపాటు దేశవ్యాప్తంగా 2012 నుంచి మలేరియా, డెంగీ లాంటి విషజ్వరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముంబైలో ఇలాంటి విషజ్వరాల బారిన పడేవారిలో 50 శాతం మంది మురికివాడలలో నివసించేవారు కాకపోవడం కార్పొరేషన్‌ను కలవరపెడుతోంది. పది నెలల్లో 31 మంది మృతి... నగరంలో డెంగీ, మలేరియా వ్యాధులు భయాందోళనలను సృష్టిస్తున్నాయి. గత పది నెలల్లో డెంగీ, మలేరియా సోకి 31 మంది మర ణించారు. ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం..గత పది నెలల్లో 1,313 మంది డెంగీబారిన పడితే 14 మంది మరణించారు. మరోవైపు గత పది నెలల్లో ఎనిమిది వేల మందికి మలేరియా వస్తే వీరిలో 17 మంది బలయ్యారు. వారందరూ బీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఖాలీస్థలాలు, పాత భవనాలపై ప్రత్యేక దృష్టి... ఖాళీ స్థలాలు, శిథిలావస్థకు చేరిన భవనాల వద్దనే అత్యధికంగా దోమల ఉత్పత్తి అవుతుంది. దీంతో ఈసారి నగరంలో ఖాళీగా ఉన్న పాత భవనాలపై బీఎంసీ ప్రత్యేక దృష్టిసారించింది. పాత, శిథిలావస్థకు చేరుకున్న భవనాల నుంచి మలేరియాకు ఊతమిచ్చే దోమలు పుట్టుకొస్తున్నాయని పలుమార్లు వెల్లడైంది. భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల నుంచి మలేరియా దోమల సంతతి ఉత్పత్తి అవుతుందని తేలింది. దీంతో బీఎంసీ ఇలాంటి దోమల ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లో దోమల సంతతి జరగకుండా పూర్తిగా అంతమొందించేందుకు పలువిధాల ప్రయత్నాలు చేస్తోంది.