బచ్చన్ ఎందుకలా చేశాడు? | Sudeep scores 300 in AP | Sakshi
Sakshi News home page

బచ్చన్ ఎందుకలా చేశాడు?

Published Thu, May 1 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM

బచ్చన్ ఎందుకలా చేశాడు?

బచ్చన్ ఎందుకలా చేశాడు?

 బచ్చన్ మంచి యువకుడు. తనేంటో తన వ్యాపారమేంటో అన్నట్లు ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇద్దరు వ్యక్తులను హత్య చేస్తాడు. అతనెందుకలా చేయాల్సి వచ్చింది? ఈ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన ఇన్వెస్టిగేటివ్ పోలీసాఫీసర్ అసలు నిజం తెలుసుకుంటాడా? తదితర అంశాలతో రూపొందిన కన్నడ చిత్రం ‘బచ్చన్’. టైటిల్ రోల్‌ను సుదీప్, పోలీసాఫీసర్ పాత్రను జగపతిబాబు పోషించగా భావన, పరుల్ యాదవ్, తులిప్ జోషి నాయికలుగా నటించారు. ఈ చిత్రాన్ని అదే పేరుతో ఉదయ్ కె.మెహతా సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులోకి అనువదించారు. ఈ నెల 16న మూడు వందల థియేటర్లలో సినిమాని విడుదల చేయనున్నామని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement