‘బచ్చన్’తో హ్యాట్రిక్ | Sudeep - Jagapathi Babu's 'Bachchan' audio released | Sakshi
Sakshi News home page

‘బచ్చన్’తో హ్యాట్రిక్

Published Thu, Apr 17 2014 10:27 PM | Last Updated on Fri, Jul 12 2019 4:42 PM

‘బచ్చన్’తో హ్యాట్రిక్ - Sakshi

‘బచ్చన్’తో హ్యాట్రిక్

 ‘‘సినిమా అంటే రామసత్యనారాయణగారికి ఎంతో మక్కువ. చాలా ఇష్టంగా, అంకితభావంతో సినిమాలు తీస్తారు. ఈ మధ్య ట్రాఫిక్, వీరుడొక్కడే లాంటి విజయవంతమైన చిత్రాలు అందించారు. ఈ ‘బచ్చన్’ విజయంతో ఆయన హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు శ్రీకాంత్. సుదీప్, భావన, పరుల్ యాదవ్, తులిప్ జోషి హీరో హీరోయిన్లుగా జగపతిబాబు కీలక పాత్రలో రూపొందిన కన్నడ ‘బచ్చన్’ని అదే పేరుతో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో శ్రీకాంత్ అతిథిగా పాల్గొని ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ వేడుకలో పాల్గొన్న కోడి రామకృష్ణ, కేవీవీ సత్యనారాయణ, బి. గోపాల్, సాగర్, వీఎన్ ఆదిత్య, లగడపాటి శ్రీధర్ తదితరులు చిత్రబృందానికి శుభాకాంక్షలు అందజేశారు. ఇందులో మొత్తం పాటలు తానే రాశానని రచయిత్రి భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ నెల 25న సినిమాని విడుదల చేయనున్నామని, కన్నడంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని నిర్మాత చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement