స్టార్ కాంబినేషన్లో వెబ్ సీరీస్ | web series in Star Combination | Sakshi
Sakshi News home page

స్టార్ కాంబినేషన్లో వెబ్ సీరీస్

Published Sat, Apr 15 2017 3:49 PM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

స్టార్ కాంబినేషన్లో వెబ్ సీరీస్

స్టార్ కాంబినేషన్లో వెబ్ సీరీస్

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వెబ్ సీరీస్ల హవా నడుస్తుంది. మెగా వారసురాలు నిహారిక స్టార్ట్ చేసిన వెబ్ సీరీస్ ట్రెండ్ను ఇప్పుడు చాలా మంది స్టార్స్ ఫాలో అవుతున్నారు. వెండితెర మీద సక్సెస్ కావాలనుకునే వారితో పాటు సక్సెస్ కాలేకపోయిన వారు కూడా వెబ్ సీరీస్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఔత్సాహిక కళాకారులు వెబ్ సీరీస్లతో ఆకట్టుకోగా ఇప్పుడు స్టార్ కాంబినేషన్లో వెబ్ సీరీస్ తెరకెక్కుతోంది.

అలామొదలైంది, కళ్యాణ వైభోగమే లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను డైరెక్ట్ చేసిన నందినీ రెడ్డి కథతో నటుడు శశాంక్ దర్శకత్వంలో ఓ వెబ్ సీరీస్ రూపొందుతోంది. ఈ వెబ్ సీరీస్ను దాదాపు 25 ఎపిసోడ్స్గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్లో హీరో రాహుల్ రవీంద్రన్, ఆదిత్ ఈశ్వరన్లతో పాటు హీరోయిన్ తేజస్వీ లీడ్ రోల్స్లో కనిపించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన అమ్మాయి జీవితంలో ఎదురైన సంఘటనల నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్ను తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement