Rahul Ravindhran
-
గీతా ఆర్ట్స్ బ్యానర్లో రాహుల్ సినిమా!
'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించి చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్..తొలి సినిమాకే నేషనల్ అవార్డు వరించింది. దీంతో రెండో సినిమాకే నాగార్జునను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. మన్మథుడు వంటి క్లాసిక్ హిట్‌కు సీక్వెల్‌గా తీసిన మన్మథుడు-2 బాక్స్‌ఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న రాహుల్..ఈ మధ్యకాలంలో ఓ మంచి కథను సిద్ధం చేసుకున్నాడట. లవ్ స్టోరీ కథాంశంతో తెరకెక్కనన్ను ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బన్నీ వాసుకు కథ నచ్చడంతో ఈ మూవీని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అయితే హీరో హీరోయిన్లు ఎవరు అన్నదానికపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా అన్నపూర్ణ బ్యానర్‌లోనూ మరో మూవీ చేసే అవకాశాన్ని కూడా రాహుల్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా రాహుల్ హీరోగా నటిస్తున్న ది గ్రేట్ ఇండియన్ కిచెన్ తమిళ రీమేక్‌లో రాహుల్‌కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటించనుంది. చదవండి : మలయాళ డెబ్యూ కోసం కసరత్తులు చేస్తోన్న ఈషా Rahul Sipligunj: సర్ప్రైజ్ లవ్ అనౌన్స్మెంట్ -
కాంబినేషన్ కుదిరినట్టేనా?
నాని ‘గ్యాంగ్‌లీడర్’ పూర్తయింది. ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ చిత్రం షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాని నెక్ట్స్ సినిమా ఏంటి? అంటే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని తెలిసింది. రాహుల్ రవీంద్రన్ హీరో నుంచి దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తొలి సినిమా ‘చి.ల.సౌ’ చిత్రానికి స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డు కూడా సంపాదించారు. ఇటీవలే నాగార్జునతో ‘మన్మథుడు 2’ తెరకెక్కించారు రాహుల్. ప్రస్తుతం రాహుల్ – నాని కాంబినేషన్లో ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా
‘‘ఒకసారి సక్సెస్ అయిన తర్వాత దాన్నే పట్టుకొని ఎక్కువ సమయం గడపాలనుకోను. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ప్రయోగాత్మక సినిమాలను ప్రయత్నించాలి. ఈ ఆలోచనే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నాన్నగారికి(అక్కినేని నాగేశ్వరరావు) అంత లాంగ్ కెరీర్, విభిన్నమైన పాత్రలు వచ్చాయంటే కారణం ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుండటమే. ఆయన చేసిన సినిమాలు గమనిస్తే న్యూ ఏజ్ సినిమాలే ఎక్కువగా ఉంటాయి. కొత్తగా ప్రయత్నించడాన్ని నాన్నగారి నుంచి నేర్చుకున్నాను’’ అని నాగార్జున అన్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. నాగార్జున, పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ –‘‘నాలోని కొత్తదనం కోసం ‘మన్మథుడు 2’ సినిమా తీశాను. ఇండస్ట్రీలో డివైడ్ టాక్ ఉందంటున్నారు. ప్రేక్షకుల్లో మాత్రం సినిమా గురించి పాజిటివ్ టాక్ నడుస్తోంది. మౌత్ టాక్ బాగుంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నిజంగా మా సినిమా ఆడియన్స్‌కు నచ్చకపోతే కలెక్షన్స్ రావు. నా కెరీర్లో మంచి విజయాలు సాధించిన ‘గీతాంజలి, అన్నమయ్య, నిర్ణయం, మన్మథుడు’ సినిమాలు రిలీజ్ తర్వాత కాస్త నెమ్మదిగా పుంజుకున్నాయి. ఈ చిత్రం కూడా అలానే ఉండొచ్చు. అలాగని ఆ సినిమాలతో ‘మన్మథుడు 2’ కి పోలిక లేదు. ‘మన్మథుడు 2’ మంచి న్యూ ఏజ్ మూవీ అంటూ ఫోన్లు చేస్తున్నారు. రొమాన్స్ సన్నివేశాలు మరీ ఇబ్బందికరంగా లేవు. నాకు రొమాన్స్ అంటే ఇష్టం. ప్రేక్షకులు మెచ్చే రొమాంటిక్ సినిమాలు చేయడం ఆసక్తి. ‘మన్మథుడు’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల టైటిల్స్‌ను ఉపయోగించడం వల్ల ప్లస్లతో పాటు మైనస్లూ ఉంటాయి. ‘బిగ్‌బాస్ 3’ కొత్త అనుభూతి. తెలుగు సినిమాలకు (మహానటి, రంగస్థలం, అ!, చి!ల!సౌ’) ఏడు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు మా సినిమా చూసి నవ్వుతూ, చప్పట్లు కొడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సైలెంట్‌గా క్లైమాక్స్‌ను చూసి థియేటర్స్ నుంచి నవ్వుతూ బయటకు వస్తున్నారు’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘సినిమాకు తొలిరోజు మిక్డ్స్ టాక్ వచ్చినా థియేటర్స్‌లో ఆడియన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు పి. కిరణ్. సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్, రచయిత–నటుడు కిట్టు, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ మాట్లాడారు. -
డబుల్ మీనింగ్ కాదు.. సింగిల్ మీనింగ్‌లోనే రాశాను
‘‘నేను నటుడిగా చేసినప్పుడు దర్శకుడు ఏది చెబితే అది చేసేవాడిని. దర్శకుడిగా మారాక నాలో మానసిక ఆందోళన పెరిగింది. తర్వాతి రోజు షూటింగ్ ఉందంటే నాకు నిద్రపట్టదు. దర్శకుడిగా నేను నిద్రపోవడం నేర్చుకోవాలి’’ అన్నారు నటుడు–దర్శకుడు రాహుల్ రవీంద్రన్. నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మన్మథుడు 2’. నాగార్జున, పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాహుల్ చెప్పిన విశేషాలు. ► నాలుగు తరాలుగా పోర్చుగల్‌లో నివాసం ఉంటున్న ఓ తెలుగు కుటుంబానికి చెందిన కథ ఇది. ఇందులో నాగార్జునగారి క్యారెక్టర్‌కు డబుల్ లైఫ్ ఉంటుంది. అమ్మాయిలపై గౌరవం ఉంటుంది. కానీ కొన్ని సంఘటనల వల్ల వారితో ఎమోషనల్ ఎటాచ్‌మెంట్‌ను ఇష్టపడరు. నా సెకండ్ సినిమాకే నాగార్జున వంటి స్టార్ హీరోతో చేయడం లక్కీ అనిపించింది. ► మా సినిమాలో కొన్ని డబుల్æమీనింగ్ డైలాగ్స్ ఉన్నాయంటున్నారు. కానీ నేను వాటిని సింగిల్ మీనింగ్‌లోనే రాశాను. అవి నాటీగా ఉంటాయి కానీ ఇబ్బందిగా ఉండవు. హై రొమాంటిక్ సీన్‌తో టిక్కెట్లు అమ్మాలని ఒక్క షాట్ కూడా తీయలేదు. ‘పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్‌కు దిగుతావా?’ అని రావు రమేష్‌గారు ట్రైలర్లో చెప్పిన డైలాగ్ కూడా చాలా నార్మల్‌గా రాసిందే. హీరో వయసు గురించి పంచ్ వేద్దామని రాసిన డైలాగ్ అది. ఓ సీన్‌ని డెవలప్ చేస్తున్నప్పుడు సమంత అతిథి పాత్రలో అయితే బాగుంటుందనిపించింది. నాగార్జునగారు కూడా అదే అన్నారు. ► యాక్టర్‌గా నార్మల్ సినిమాల్లో నటించను. నా దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా సినిమా చేయబోతున్నాడనే వార్తల్లో నిజం లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్లో ఓ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. చిన్మయి (రాహుల్ భార్య) నాకు మంచి ఎమోషనల్ సపోర్టింగ్ సిస్టమ్. తన సపోర్ట్ లేకుండా నేను లేను. సంగీతమే ఆమె ప్రపంచం. సోషల్ మీడియాలో చిన్మయి ప్రస్తావించిన అంశాలు కొందరికి అర్థం కానప్పుడు స్పందిస్తాను. ప్రతి విషయానికీ స్పందించను. -
నా తప్పులు నేను తెలుసుకున్నా: నాగ్
‘‘ఇతర భాషల్లో నా మార్కెట్‌ను పెంచుకోవాలనే ఆలోచన నాకూ ఉంది. కానీ నాకు ద్విభాషా చిత్రాలు కలిసి రాలేదు. నా కెరీర్లో నాలుగు ద్విభాషా చిత్రాలు చేశాను. సరైన ప్రేక్షకాదరణ లభించలేదు. ఈ విషయంలో నా పాఠాలు నేను నేర్చుకున్నాను. గీతాంజలి, శివ చిత్రాలను డబ్ చేశాం. బైలింగ్వల్‌గా తీయలేదు. ‘బాహుబలి’ కూడా తెలుగులోనే తీశారు. ఆ తర్వాత మిగతా భాషల్లోకి డబ్ చేసినా, మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అందరూ అన్ని రకాల సినిమాలు చూస్తున్నారు’’ అని నాగార్జున అన్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన్మథుడు 2’. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటించారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జున చెప్పిన విశేషాలు. ► ‘మన్మథుడు 2’ని చాలా కష్టపడి చేశాం. మేం పడిన కష్టాన్ని ప్రేక్షకులు గుర్తించాలని కోరుకుంటున్నాను. అమ్మ, ముగ్గురు చెల్లెళ్లు, ఓ అమ్మాయి వల్ల బ్యాచిలర్ అయిన ఓ మధ్య వయస్కుడి జీవితం ఎలా ప్రభావితం అవుతుందన్నదే సినిమా కథ. ఈ సినిమా రొమాన్స్, ప్రేమ గురించి కాదు. పూర్తి స్థాయి వినోదాత్మక కుటుంబ కథా చిత్రం. విజయనగరం నుంచి వెళ్లి పోర్చుగల్‌లో సెటిలైన ఓ కుటుంబానికి చెందిన ఫోర్త్ జనరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ కథ ఇది. వీళ్లు ఉండే ప్రాంతం పేరు కసాండ్ర అయితే ఆంధ్రా భోజనాలు, వంటకాలతో అది కాస్తా కసాంధ్రగా మారుతుంది (నవ్వుతూ). ► హీరోకి అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మ మాటను కాదనలేడు. అలాగని మనస్సాక్షిని వదులుకోలేడు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన హీరోది కాదు. వాళ్ల అమ్మది. అలా తప్పని పరిస్థితుల్లో డబుల్ లైఫ్‌ని లీడ్ చేయాల్సిన పరిస్థితి. ఆ సమయంలో ఓ కుర్ర అమ్మాయి హీరో జీవితంలోకి వస్తుంది? అప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి? అనే అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ట్రైలర్లో కొన్ని జోక్సే చూపించాం. సినిమా నిండా జోక్స్ ఉన్నాయి. ► రాహుల్ దర్శకత్వంలో వచ్చిన ‘చిలసౌ’ బాగా నచ్చింది. ఫ్రెంచ్ సినిమా బేస్ లైన్ తీసుకుని మన తెలుగు నేటివీటికి తగ్గట్లు మార్చాలని రాహుల్‌తో చెప్పాను. రాహుల్‌కి ఆర్టిస్టులతో పెర్ఫార్మ్ చేయించుకోవడం బాగా తెలుసు. ఏడాది ప్రీ–ప్రొడక్షన్ వర్క్ చేశాం. అంతా పర్ఫెక్ట్గా జరిగింది. ► సినిమా స్టార్టింగ్‌లో నాకూ, రకుల్‌కు ఏవో విభేదాలు వచ్చాయనే వార్తల్లో నిజం లేదు. రకుల్ మంచి నటి. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా తర్వాత లక్ష్మీగారు నాకు మళ్లీ తల్లిగా ఈ సినిమాలోనే నటించారు. క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా సంగీతం నచ్చి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా చేతన్ భరద్వాజ్‌ను ఎంపిక చేశాం. సమంత, కీర్తీ సురేష్లవి ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్రలు. ► నిర్మాత పి. కిరణ్ నాకు చిన్ననాటి స్నేహితుడు. ఎప్పట్నుంచో మా కాంబినేషన్లో సినిమా అనుకుంటున్నాం. ఇప్పటికీ కుదిరింది. వయాకామ్వారు కూడా తెలుగులో సినిమాలు చేయాలనుకుంటున్నారు. వారు మా బ్యానర్‌తో అసోసియేట్ అవ్వడం హ్యాపీ. ‘మన్మథుడు 2’ ఆడితే ‘మన్మథుడు 3’ ఉండొచ్చు. ► సెన్సార్ వారు యూఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఏ క్యారెక్టర్ చెప్పిన పదాలను సెన్సార్‌వాళ్లు మ్యూట్ చేశారనేది సినిమాలో చూడండి. సినిమాలోని పాత్రలను బట్టి ఆ డైలాగులు వస్తాయి. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ అంత స్వచ్ఛమైన తెలుగు ఈ సినిమాలోనే వాడాం. ‘మన్మథుడు’తో పోల్చితే ఈ సినిమాలో రొమాన్స్ తక్కువ. అయినా నేటితరం పిల్లలకు ముద్దులు తెలియదు అనుకుంటే మన అమాయకత్వమే. ► కొత్త దర్శకులతో చేస్తే నాలోని కొత్తదనాన్ని వారు వెలికి తీస్తారు. యంగ్ టీమ్‌తో వర్క్ చేయడం నాకు ఫుల్ ఫన్‌గా ఉంటుంది. నా కెరీర్లో గమనిస్తే ఎక్కువగా నేను అప్పటి తరం యంగ్ డైరెక్టర్స్‌తో చేసిన సినిమాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. నా మిగతా సినిమాల్లో కూడా సెకండ్ న్యూ డైరెక్టర్ లేదా బ్రాండ్ న్యూ డైరెక్టర్స్ ఉంటారు. బహుశా... నేను స్టార్‌ని కావడానికి ఇదొక కారణం కావొచ్చు. ► సీరియస్ సినిమాలు నాకు అంతగా నచ్చవు. సినిమాలోని క్యారెక్టర్స్ నవ్వించేలా లేదా స్ఫూర్తి పొందేలా ఉండాలనుకుంటాను. ఒకవేళ మనం ఏడిస్తే సంతోషంగా ఏడ్వాలి. డిప్రెషన్‌తో కాదు. కొన్ని సీరియస్ పాత్రలు చేశాను. వాటిలో కొన్నింటి నుంచి నా తప్పులు నేను తెలుసుకున్నాను. కొత్త పాఠాలు నేర్చుకున్నాను. సినిమా సక్సెస్ ఒక్కరిదే కాదు. టీమ్ అందరిదీ. అయితే దురదృష్టవశాత్తు సక్సెస్ క్రెడిట్‌ను హీరో, దర్శకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త కొత్త కథలు వస్తున్నాయి. సీనియర్ హీరోలకు కథల కొరత ఉంది. మంచి కథను పట్టుకోవడం కోసం కష్టపడతాం. ► ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ షోలో లైఫ్ స్టోరీస్ విన్నాను. కానీ బిగ్‌బాస్ షోలో వారానికి వారం మారిపోతున్నారు. డిఫరెంట్‌గా ఉంటున్నారు. షో పాపులారిటీ కూడా పెరిగిపోతోంది. ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒకే హౌస్‌లో అయితే నేను ఎక్కువగా ఉండను. ఈ షోకు మంచి వ్యూయర్షిప్ రావడం హ్యాపీ. ఈ ఏడాది నా బర్త్‌డే (ఆగస్టు 29)కి స్పెషల్ ప్లాన్స్ ఏమీ లేవు. నా ఫ్యామిలీతో ఎక్కడికైనా పారిపోదాం అనుకుంటున్నాను (సరదాగా). వాళ్లతో కొంచెం టైమ్ గడపాలని ఉంది. ధనుష్‌తో నేను చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయింది. బాలీవుడ్లో నేను చేస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమా మంచి ఎగై్జటింగ్ ప్రాజెక్ట్. నా వంతు షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. బాగా గ్రాఫిక్స్ ఉన్నాయి. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ స్టార్ట్ చేయాల్సి ఉంది. -
వర్కింగ్ హాలిడే
‘సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయోచ్’ అంటున్నారు సమంత. అంటే.. షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నారా? కాదు, కాదు. ఇది వర్కింగ్ హాలిడే. నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. నాగార్జున, పి. కిరణ్ నిర్మాతలు. ఇందులో సమంత ఓ స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. తన పార్ట్ షూటింగ్ కోసం పోర్చుగల్‌లో ఉన్నారు సమంత. ‘‘ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ (రాహుల్ రవీంద్రన్, ‘వెన్నెల’ కిశోర్, సమంత) కలసి షూటింగ్ చేస్తే చాలా ఫన్‌గా ఉంటుంది’’ అని ఈ ఫొటోను షేర్ చేశారు సమంత. ‘మనం, రాజుగారి గది 2’ తర్వాత సమంత, నాగార్జున కలసి యాక్ట్ చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రంలో తన పాత్ర చిత్రీకరణ పూర్తయ్యాక ‘96’ రీమేక్ షూట్లో జాయిన్ అవుతారామె. స్యామ్ నటించిన ‘ఓ బేబి’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. -
రెండో మన్మథుడు షురూ
నాగార్జున హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మన్మథుడు’. కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పదహారేళ్ల తర్వాత నాగ్ ‘మన్మథుడు 2’ చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్‌కి జోడీగా రకుల్‌ప్రీ™Œ సింగ్ నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాగచైతన్య కెమెరా స్విచ్చాన్ చేయగా, అమల అక్కినేని క్లాప్ ఇచ్చారు. ‘‘మన్మథుడు’ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని నాగార్జున ఈ సినిమా చేస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యూరప్‌లో ప్రారంభం కానుంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నాగార్జున సోదరి నాగసుశీల, మేనల్లుడు, హీరో సుశాంత్ పాల్గొన్నారు. లక్ష్మి, ‘వెన్నెల’ కిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు ఈ చిత్రంలో నటించనున్నారు. -
మన్మథుడు మొదలు
సుమారు 17 ఏళ్ల తర్వాత మళ్లీ మన్మథుడి పాత్రలోకి ఎంట్రీ ఇవ్వడానికి నాగార్జున రెడీ అయ్యారు. 2002లో వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’లో నటించనున్నారాయన. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని టాక్. ‘చి.ల.సౌ’ చిత్రంతో దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్, పాయల్‌రాజ్‌పుత్ కథానాయికలు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 4 వరకూ సాగనుందట. ఆ తర్వాత ఏప్రిల్ 12కి చిత్రబృందం పోర్చుగల్ ప్రయాణం కానున్నారు. ఇందులో నాగార్జున భార్యగా రకుల్ ప్రీత్ కనిపించనున్నారని టాక్. సీక్వెల్ కాబట్టి మొదటి పార్ట్ కథకు కొనసాగింపుగా ఉంటుందా? లేక అందులోని పాత్రలు మాత్రమే తీసుకుంటారా? వేచి చూడాలి. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రిలీజ్ కావచ్చు. -
మన్మథుడి ముహూర్తం కుదిరే
స్త్రీలను అసహ్యించుకునే స్ట్రిక్ట్ బాస్‌లా ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున పంచిన కామెడీ ఎవర్ గ్రీన్. ఇప్పటికీ అందులోని పంచ్ డైలాగ్స్ ఫ్రెష్‌గానే పేలుతుంటాయి. లేటెస్ట్గా మన్మథుడు మళ్లీ రావడానికి ముహూర్తం కుదిరింది. 2002లో నాగార్జున హీరోగా విజయ భాస్కర్ రూపొందించిన చిత్రం ‘మన్మథుడు’. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్ ఈ సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘మన్మథుడు 2’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా ముహూర్తం మార్చి మొదటి వారంలో జరగనుందని టాక్. ఎక్కువ శాతం షూటింగ్ పోర్చుగల్‌లో జరుపుకోనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేశారట. ఈ సీక్వెల్లో ‘మన్మథుడు’ క్యారెక్టరైజేషన్‌ను మాత్రమే తీసుకుంటారా? లేక వేరే కథను ప్లాన్ చేశారా? వేచి చూడాలి. -
రిలీజ్ కాకముందే రీమేక్ చేద్దామన్నారు!
సమంత ముఖ్య పాత్రలో పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’కి ఇది రీమేక్. భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు చేశారు. శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన ఈ చిత్రం గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా పవన్ కుమార్ పలు విశేషాలు పంచుకున్నారు. ► బెంగళూర్‌లో జరిగిన ఓ చిన్న సంఘటన ఆధారంగా ఈ కథను తయారు చేశా. మనందరం రోడ్ మీద యు టర్న్‌ని పట్టించుకోం. రాంగ్ రూట్లో వెళ్లిపోతుంటాం. అది పెద్ద తప్పుల్లా భావించం. అలా చేయడం వల్ల పరిణామాలు భయంకరంగా ఉంటే? అనే ఐడియానే ఈ కథ. ► ఈ సినిమాను నేను రీమేక్ అనను. ఎందుకంటే చివరి 30 నిమిషాలు చాలా మటుకు మార్చాం. కన్నడంలో తీసినప్పుడు చాలా చిన్న ప్రాజెక్ట్. బడ్జెట్, ఇంకా చాలా విషయాల్లో అప్పుడు అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి వీలుపడలేదు. ఈసారి బాగా తీశాను. ► కన్నడ ‘యు టర్న్’ ట్రైలర్ రిలీజైన సాయంత్రమే సమంత నాకు మెసేజ్ చేసింది. తర్వాత స్క్రిప్ట్ పంపించమంది. నాకు భయమేసింది. సినిమా రిలీజ్ అవ్వకుండా స్క్రిప్ట్ ఎలా పంపుతాం? అని. పంపాను. సమంత, చైతన్య వచ్చి నా ఆఫీస్‌లోనే రిలీజ్ కాకముందే సినిమా చూశారు. బాగా నచ్చింది. రీమేక్ చేస్తాం అన్నారు. ► ఏదైనా భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేస్తుంటాం. కానీ రిలీజ్ కాకముందే సమంత రీమేక్ చేయాలనుకోవడం గ్రేట్. తనకున్న కమిట్మెంట్స్ వల్ల సినిమా స్టార్ట్ చేయడం ఆలస్యం అయింది. సమంత, నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. సో.. సెట్లో డైరెక్టర్–యాక్టర్ ఈక్వేషన్ కంటే కూడా ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్లం. ► నా ఫస్ట్ సినిమా ‘లూసియా’ను హిందీలో రీమేక్ చేద్దాం అనుకున్నాను. కానీ కుదర్లేదు. నెక్ట్ ఏ ప్రాజెక్ట్ అని ఇంకా నిర్ణయించుకోలేదు. -
ప్రస్తుతానికి మంచోడిలా ఉందామనుకుంటున్నాను
‘‘ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ మూవీస్ బాగా వస్తున్నాయి. మెల్లిగా గేమ్ చేంజ్ అవుతోంది. ఆడియన్స్ అభిరుచులు మారుతున్నాయి. అందుకే ఏ పాత్ర చేసినా ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాను. మంచి సినిమాలో భాగం అవ్వాలని అనుకుంటా. నా కెరీర్లో బెస్ట్ మూవీస్‌లో ‘యు టర్న్’ తప్పకుండా ఉంటుంది’’ అని ఆది పినిశెట్టి అన్నారు. సమంత మెయిన్ లీడ్‌గా ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించారు. ఈ సినిమా గురువారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఆది పలు విశేషాలు పంచుకున్నారు. ► సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చిన్న పాయింట్ అయినా ఆసక్తి కలిగించేలా దర్శకుడు పవన్ చెప్పారు. సామాజిక స్పృహ ఉన్న కథను బోధించినట్టు కాకుండా కమర్షియల్‌గా చెప్పారు. ► కర్మ సిద్ధాంతం. మనం ఏదైనా తప్పు చేస్తే అది మళ్లీ మనకే వస్తుంది అన్నదే ఈ సినిమా కథ. ► ‘వైశాలి’ తర్వాత మళ్లీ పోలీస్ పాత్ర చేశాను. పోలీస్ అనగానే స్లో మోషన్ షాట్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉండాలనుకోను. ఈ సినిమాలో ఏ ఇంట్రడక్షన్ ఉండదు. సాధారణ పాత్రలానే ఎంటర్ అవుతాను. ఇదే నా కెరీర్లో బెస్ట్ ఇంట్రడక్షన్. పవన్ నెక్ట్స్ జనరేషన్ డైరెక్టర్. తనకి చాలా ఫ్యూచర్ ఉంది. ‘రంగస్థలం’ తర్వాత సమంతతో మరో సక్సెస్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ► సినిమాను అనలైజ్ చేసే వాళ్లు కేవలం 15 శాతం మంది ఉంటారు. మిగతా వాళ్లకు బావుందా బాలేదా అన్నదే ముఖ్యం. ‘నీవెవరో’ సినిమా కూడా కామన్ ఆడియన్స్‌కు నచ్చొచ్చు అన్నాను. కానీ క్రిటిక్స్ మీద కామెంట్ చేయలేదు. క్రిటిసిజిమ్ నుంచే నేర్చుకొంటాను. ఎప్పటికప్పుడు యాక్టర్‌గా ఇంప్రూవ్ అవ్వడానికి మీరిచ్చే (క్రిటిక్స్) ఫీడ్‌బ్యాకే ముఖ్యం. పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ కూడా చూస్తుంటాను. ► సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్‌గా ఉండను. కొంతమంది సంబంధం లేకుండా నెగటివిటీ షేర్ చేస్తుంటారు. అలాంటి వాళ్లను పాపం అనుకొని పక్కన పెట్టేయడమే. ► ప్రస్తుతానికి మంచోడిలా ఉందాం అనుకుంటున్నాను. మంచి స్క్రిప్ట్ వస్తే అప్పుడు చెడ్డగా (విలన్) మారతాను. నెక్ట్స్ నాలుగు ప్రాజెక్ట్‌లు అనుకుంటున్నాను. -
పెళ్లయితే అత్త.. వదినలేనా?
‘‘నా పాత్ర స్క్రీన్ మీద ఎంత సేపు ఉంటుంది అని కాదు. కథకు ఎంత ఇంపార్టెంట్, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్నది ముఖ్యం. నాకు నాలుగేళ్ల బాబు ఉన్నాడు. వాడికోసం కేటాయించే సమయాన్ని ఓ సినిమాకి ఇవ్వాలంటే అది ఎంతో విలువైనదిగా ఉండాలనుకుంటున్నాను. అద్భుతమైన క్యారెక్టర్, టీమ్ దొరికితే చేస్తా. మా అబ్బాయి స్కూల్, వాడితో స్పెండ్ చేసే టైమ్ మిస్ అవ్వదలచుకోలేదు’’ అని భూమిక అన్నారు. సమంత మెయిన్ లీడ్‌గా ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా భూమిక చావ్లా పలు విశేషాలు పంచుకున్నారు. ► దర్శకుడు పవన్ ‘యు టర్న్’ కథ చెప్పినప్పుడు డిఫరెంట్‌గా, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నా పాత్ర చిన్నదే అయినా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఒప్పుకున్నాను. ఒరిజినల్ చూశాను. కానీ నా స్టైల్లో, దర్శకుడు చెప్పినట్టు చేశాను. ఒరిజినల్‌తో పోలిస్తే కొన్ని కొన్ని మార్పులు చేశాం. నాకు థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నా సూపర్ హిట్స్‌లో థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి. ► సమంత బ్రిలియంట్ యాక్టర్. సెట్లో తనుంటే మంచి ఎన ర్జీ ఉంటుంది. తన ఎక్స్ప్రెషన్స్ అమేజింగ్. సమంతవి ఎక్కువ సినిమాలు కూడా చూడలేదు. రీసెంట్గా తన ‘ఈగ, రంగస్థలం’ చూశాను. ► హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు బాగా వస్తున్నాయి. అవి ఇంకా పెరగాలి. కొంచెం టైమ్ పడుతుంది. ఉమెన్ సెంట్రిక్ అంటే ప్రొడ్యూసర్స్ కొంచెం ఆలోచిస్తున్నారు. బట్ అది కూడా త్వరలోనే మారిపోతుంది. ఈ తరహా సినిమాలు కూడా ఎక్కువ రావాలి. ► పెళ్లి అయిపోయిన హీరోయిన్స్‌ని అత్తలు, వదిన పాత్రలకు ఫిక్స్ అయిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. బాలీవుడ్లో విద్యాబాలన్ ‘తుమ్హారీ సులూ’ ఎంత బావుంటుంది? జ్యోతిక, రాణీ ముఖర్జీ ఇలా మంచి సినిమాలు చేస్తున్నారు. 40 ప్లస్ ఏజ్ ఉన్న హీరోయిన్స్ మెయిన్ లీడ్‌గా కూడా రాణిస్తారు. దర్శకులు కూడా ఇంకా మంచి ఉమెన్ సెంట్రిక్ స్టోరీలు రాయాలి. ఆడియన్స్ ఆదరించాలి ► కమర్షియల్ సినిమాల్లో మంచి రోల్స్ చేశాను. ఒకే ఒక్క సినిమాతో కంప్లీట్ డిఫరెంట్ యాక్టర్‌గా మారిపోరు. సినిమా సినిమాకి మెల్లిగా మారుతూ వస్తుంటాం. ► జయాపజయాలు నా కెరీర్‌పై ఎప్పుడూ ప్రభావం చూపలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాలీవుడ్ రిలీజ్ ఉన్నప్పుడు ఇక్కడ షూట్లో ఉండేదాన్ని. తెలుగు రిలీజ్ ఉంటే నార్త్‌లో ఎక్కడో షూటింగ్ చేస్తుండేదాన్ని. వరుసగా ‘ఎంసీఏ, యు టర్న్, సవ్యసాచి’ సినిమాల్లో అవకాశాలొచ్చాయి. నెక్ట్స్ తమిళంలో రెండు, తెలుగులో రెండు సినిమాలు ఒప్పుకున్నాను. -
మలుపులో మిస్టరీ
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ హిట్ మూవీ ‘యు టర్న్’ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమాని ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ మిస్టరీగా తెరకెక్కిన చిత్రమిది. ట్రైలర్, ప్రమోషనల్ వీడియోకి దాదాపు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ్లో తెరకెక్కించాం. రెండు భాషల్లోనూ ఒకే రోజు విడుదల చేస్తున్నాం. సమంత నటన, ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్ పాత్రలు ఆకట్టుకుంటాయి. పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. -
హత్య చేసింది ఎవరు?
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యూ టర్న్’. కన్నడలో ఘన విజయం సాధించిన ‘యూ టర్న్’ చిత్రానికి ఇది రీమేక్. మాతృకకు దర్శకత్వం వహిస్తున్న పవన్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. ఆది పినిశెట్టి, భూమిక చావ్లా, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వీవై కంబైన్స్ పతాకాలపై శ్రీనివాస్ చిత్తూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్‌ని శుక్రవారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఓ హత్య మిస్టరీని చేధించే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆది నటిస్తున్నారు. సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదల చేసిన సమంత ఫస్ట్ లుక్‌కి ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఆ తర్వాత పాటలు చిత్రీకరించనున్నాం. సెప్టెంబర్ 13న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి, కెమెరా: నికేత్ బొమ్మి. -
అందుకే హోమ్ బ్యానర్లో చేయలేదు
‘‘వరుసగా ఫార్ములా సినిమాలు చేయడం విసుగు తెప్పించింది. నాకు సరిపోయే క్యూట్ లవ్‌స్టోరీ చేయాలని ఫిక్స్ అయిన టైమ్‌లో రాహుల్ ఈ కథతో నా దగ్గరకు వచ్చారు. స్టోరీ బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించాను’’ అన్నారు సుశాంత్. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్, రుహానీ శర్మ జంటగా రూపొందిన చిత్రం ‘చి ల సౌ’. సిరుని సినీ కార్పొరేషన్ బ్యానర్‌పై జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాలి, హరి పులిజల నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుశాంత్ పంచుకున్న విశేషాలు. ► రిస్క్ తీసుకోవాలనే ఆలోచనతో హోమ్ బ్యానర్లో వర్క్ చేయకూడదు అనుకున్నాను. రాహుల్ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తానని నాతో ఈ సినిమా చేయలేదు. సినిమా మొత్తం అయిపోయాక చూసిన నాగచైతన్య, సమంత అన్నపూర్ణ బ్యానర్ నుంచి రిలీజ్ చేయడానికి రెడీ అయి, మా ప్రొడ్యూసర్స్‌ని అడిగారు. వాళ్లు వెంటనే ఒప్పుకున్నారు. ► సినిమా చూశాక నాగ్ (నాగార్జున) మామ మా అమ్మగారితో చాలాసేపు మాట్లాడారు. ‘మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు, ఇలానే చేసుకుంటూ వెళ్తే కెరీర్ బావుంటుంది’ అన్నారట. ఆయన అలా అనడం పెద్ద సర్టిఫికెట్లా భావిస్తాను. మామ నుంచి అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అదే అని ఫీల్ అవుతాను. ► నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. బయట ఎలా ఉంటానో సినిమాలో కూడా అలానే కనిపిస్తాను. దాని కోసం వర్క్ షాప్ కూడా చేశాం. సహజంగా ఉండటం కోసం మేకప్ కూడా వాడలేదు. ► రాహుల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయకపోయినా హీరోగా చాలా గమనించే ఉంటారు. స్టోరీ కూడా చాలా బాగా నరేట్ చేశారు. ముందుగా ఈ సినిమాకు ‘చిరంజీవి అర్జున్’ అనుకున్నాం కానీ ‘అర్జున్ రెడ్డి’ సూపర్ హిట్ అయింది. దాంతో ‘చి ల సౌ’ అని మార్చాం. ► ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. నెక్ట్స్ ఓ ఫన్ థ్రిల్లర్ జానర్లో సినిమా ఓకే చేశాను. -
ఆ కాంప్లిమెంట్ నాకు ఆస్కార్‌తో సమానం
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిందే డైరెక్టర్ అవుదాం అని. కానీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరదాం అంటే ఒక్క డైరెక్టర్ అపాయింట్మెంట్ కూడా కుదర్లేదు. సడన్‌గా ఆడిషన్స్‌కి పిలిచారు. అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా ఆడిషన్ చేస్తారేమో అనుకున్నాను. కట్ చేస్తే ఈ సినిమాలో హీరో నువ్వే అన్నారు. కొన్ని డబ్బులు వస్తాయి, సినిమా కూడా నేర్చుకోవచ్చు అని కంటిన్యూ అయిపోయాను’’ అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. సుశాంత్, రుహాని శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘చి ల సౌ’. సిరుని సినీ కార్పరేషన్ పతాకంపై జశ్వంత్ నడిపల్లి నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఆగస్ట్ 3న అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు విశేషాలను రాహుల్ పంచుకున్నారు. ► నాలుగేళ్ల క్రితం ఇంక డైరెక్టర్‌గా సినిమా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను. అప్పుడు కుదర్లేదు. ఈ లోపు కొన్ని సినిమాలు సైన్ చేసి హీరోగా బిజీ అయిపోయా. చైతన్య–సమంత వెడ్డింగ్ అప్పుడు సుశాంత్‌ని కలిశాను. ఆ తర్వాత ఓ రోజు ఫొన్ చేసి కథ వినాలి బ్రో అంటే ‘మల్టీస్టారర్ సినిమా చేస్తున్నామా?’ అన్నాడు సుశాంత్. కాదు నేనే డైరెక్టర్ అని చెప్పాను. నా దగ్గర ఉన్న రెండు కథలు చెప్పా, సుశాంత్ లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు. ► డైరెక్షన్ చేస్తున్నాను అని ఇండస్ట్రీలో ఎవ్వరికీ చెప్పలేదు. కేవలం నా క్లోజ్ ఫ్రెండ్స్‌కి తప్పా. ఒకవేళ డైరెక్షన్లో అనుకున్నట్టు జరగకపోతే యాక్టింగ్ కెరీర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆలోచించుకో అని ‘వెన్నెల’ కిశోర్ చెప్పాడు. అలాగే ఈ సినిమా టైటిల్‌ను కూడా ‘వెన్నెల’ కిశోర్ చెప్పాడు. ► 24 గంటల్లో జరిగే కథ ఈ సినిమా. 27 ఏళ్ల అబ్బాయి, 24 ఏళ్ల అమ్మాయి ఇద్దరూ పెళ్లి ముందు జర్నీ స్టోరీ లైన్. ఈ జనరేషన్లో అందరూ ఇండివిండ్యువాలిటీ కోరుకుంటున్నారు. మనకు కాబోయే పార్టనర్ వీళ్లే అని ఎలా తెలుసుకోగలం? అనే పాయింట్ చుట్టూ కథ ఉంటుంది. సుశాంత్ బయట ఎలా ఉంటాడో సినిమాలోనూ అలానే చూపించాం. అసలు మేకప్ వాడలేదు. ► డైరెక్టర్ అవుతున్నానంటే నాకంటే సమంత బాగా టెన్షన్ పడిపోయింది. తనకే ఫస్ట్ సినిమా చూపించాను. తనకీ, చైతన్యకి సినిమా నచ్చింది. ‘నాన్నని కూడా చూడమని చెబుతాను’ అని చైతన్య అంటే అర్థం కాలేదు. ఆ తర్వాత నాగ్‌సార్ కూడా చూసి చాలా ఎంజాయ్ చేసి, రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. సినిమా చూసి వెళ్లిపోయేప్పుడు ‘నీకు మంచి ఫ్యూచర్ ఉంది నాన్న’’ అన్నారు. ఆ కాంప్లిమెంట్ నాకు ఆస్కార్ సాధించినట్టు అనిపించింది. ► హీరోయిన్ పాత్రకు నా భార్య చిన్మయి డబ్బింగ్ చెప్పింది. తనకు సినిమా బాగా నచ్చింది. మా పెళ్లి కాకముందే ఈ కథ రాసుకున్నాను. మా పర్సనల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలు ఏమీ లేవు. ► మ్యూజిక్ ప్రశాంత్ విహారి, కెమెర సుకుమారన్ సార్ నెక్ట్స్ లెవెల్‌కి తీసుకువెళ్లారు. ప్రొడ్యూసర్ బాగా సపోర్ట్ చేశారు. ► ఆగస్ట్ 3న నా సినిమా శేష్ ‘గూఢచారి’ రిలీజ్ అవుతున్నాయి. ‘నా సినిమాని నువ్వు, నీ సినిమాను నేను ప్రమోట్ చేసుకుందాం’ అని శేష్‌తో అన్నా. నెక్ట్స్ సినిమా కూడా అన్నపూర్ణ బ్యానర్లోనే. హీరోగా ‘దృష్టి’, ‘యు టర్న్’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. -
మిస్టరీ వీడిందా?
‘రంగస్థలం, అభిమన్యుడు, మహానటి’ చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకొని, నటిగా తన స్థాయిని పెంచుకున్న సమంత ‘యూ టర్న్’ చిత్రంతో మరోసారి తన నట విశ్వరూపం చూపనున్నారు. పవన్ కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఆదివారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో సమంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్‌గా, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా కీలకపాత్రలు పోషిస్తున్నారు. సమంత ఇన్టెన్స్ లుక్స్, పెర్ఫార్మెన్స్ ‘యూ టర్న్‘ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. త్వరలోనే పాటల చిత్రీకరణ మొదలుపెట్టనున్నాం. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. సెప్టెంబర్ 13న మా సినిమాని తెలుగు, తమిళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘యూ టర్న్’ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి, కెమెరా: నికేత్ బొమ్మి, నిర్మాణ సంస్థలు: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్. కాగా, సమంత తమిళంలో నటించిన ‘సీమరాజా’ చిత్రం కూడా సెప్టెంబర్ 13నే విడుదల కానుండటం విశేషం. -
సాంగ్స్ టర్న్
‘రంగస్థలం, మహానటి’ చిత్రాల తర్వాత తెలుగులో సమంత నటిస్తున్న చిత్రం ‘యు టర్న్’. ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడలో ఘన విజయం సాధించిన ‘యు టర్న్’ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొని, పాటల చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో సమంత న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’’ అన్నారు. నరేన్, రవి ప్రకాష్, బిర్లా బోస్, ఛత్రపతి శేఖర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: నికేత్. -
కమింగ్ సూన్
సుశాంత్ హీరోగా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చి ల సౌ’. ఈ సినిమాతో రుహానీ శర్మ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘‘రీసెంట్గా రిలీజైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. సుశాంత్, రుహానీ బాగా నటించారు. ప్రశాంత్ విహారి సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటుంది. సినిమా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. వెన్నెల కిశోర్, జయప్రకాశ్, సంజయ్ స్వరూప్, రోహిణి, అనూ హాసన్, రాహుల్ రామకృష్ణ, విద్యుల్లేఖా రామన్ తదితరులు నటించిన ఈ సినిమాకు ఎం. సుకుమార్ ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రానికి హరీష్ కోయాలగుండ్ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సంగతి ఇలా ఉంచితే నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్న రెండో సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపైనే తెరకెక్కనుంది. ఈ విషయాన్ని రాహుల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. -
డైనమిక్ జర్నలిస్ట్
జోరున వర్షం పడుతోంది. ఓ లేడీ జర్నలిస్ట్ స్కూటర్ డ్రైవ్ చేస్తూ హడావిడిగా వెళ్తున్నారు. ఇంటికి వెళ్తున్నారేమో అనుకుంటున్నారా? కానే కాదు. ఆమె డైనమిక్ జర్నలిస్ట్. అందుకే ఓ ఇన్వెస్టిగేషన్ వర్క్‌పై నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. నెక్ట్స్ ఏం జరిగింది? అంటే.. ఇప్పుడే చెప్పేస్తే ఎలా? థియేటర్స్‌లో చూస్తేనే కదా ఫుల్ మజా. పవన్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ హిట్ ‘యు–టర్న్’ సినిమాను అదే టైటిల్‌తో, సేమ్ డైరెక్టర్‌తో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. జర్నలిస్ట్ పాత్రలో సమంత, పోలీస్ ఆఫీసర్‌గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. సమంత బాయ్ ఫ్రెండ్‌గా రాహుల్ కనిపించనున్నారని సమాచారం. ఇటీవల ప్రారంభమైన సెకండ్ షెడ్యూల్లో పోలీస్ స్టేషన్ సెట్లో సమంత, ఆది పినిశెట్టి పాత్రలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో వారం పాటు ఈ షెడ్యూల్ జరగనుందని సమాచారం.శ్రీనివాస సిల్వర్‌స్క్రీన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాదే యు–టర్న్ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు చిత్రబృందం. -
సెకండ్ టర్న్
అతను పవర్ఫుల్ పోలీసాఫీసర్. ఆమె పవర్ఫుల్ జర్నలిస్ట్. ప్రెస్, పోలీస్ పవర్ కలిస్తే క్రిమినల్స్‌కి ఫీవరే. ఈ ఇద్దరూ కలిసి ఒక ఫ్లై ఓవర్‌పై జరుగుతున్న హత్యలను ఎలా ఛేదించారు? అనే అంశంతో పలు మలుపులతో రూపొందుతున్న చిత్రం ‘యు–టర్న్’. కన్నడ హిట్ మూవీ ‘యు–టర్న్’ తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. కన్నడ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్‌నే తెలుగు, తమిళ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య తారలుగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో స్టారై్టంది. అంటే.. యు–టర్న్‌లో సెకండ్ టర్న్ స్టారై్టందన్న మాట. ‘‘ఒక ఫ్లై ఓవర్ మీద జరుగుతున్న మర్డర్ మిస్టరీస్ను ఛేదించే జర్నలిస్ట్ కథే ‘యు–టర్న్’. హైదరాబాద్‌లో వేసిన భారీసెట్లో సెకండ్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేశాం. జర్నలిస్ట్‌గా సమంత, పోలీసాఫీసర్‌గా ఆది పినిశెట్టి కనిపించనున్నారు. ప్రస్తుతం ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. సినిమాలో నరేన్, భూమిక పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. తెలుగు నేటీవిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశాం. పవన్ కుమార్ బాగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు నిర్మాత శ్రీనివాస్. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి. -
గెస్ట్ ఘోస్ట్
సమంత లీడ్ రోల్లో కన్నడ సూపర్ హిట్ ‘యూ–టర్న్’ చిత్రాన్ని ఆ చిత్రదర్శకుడు పవన్ కుమార్ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు. ఇందులో ఘోస్ట్ క్యారెక్టర్ కోసం చిత్రబృందం భూమికను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. సెకెండ్ ఇన్నింగ్స్‌లో వదిన, అక్క క్యారెక్టర్స్ చేస్తున్న భూమిక ఇప్పుడు దెయ్యంగా కనిపించనున్నారు. గెస్ట్ రోల్లో కొన్ని నిమిషాల ఘోస్ట్‌గా అప్పియరెన్స్ ఇవ్వనున్నారట భూమిక. తన క్యారెక్టర్ ఒక మేజర్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడంతో దెయ్యంగా మారతారు. ఈ యాక్సిడెంట్ చుట్టూనే సినిమా కథ అంతా తిరుగుతుంది. ఈ కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేసే పాత్రలో సమంత కనిపిస్తారు. సమంత్ పక్కన రాహుల్ రవీంద్రన్, పోలీస్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
వరుడు అర్జున్.. వధువు?
సుశాంత్ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘చి‘‘ ల‘‘ సౌ’. ఈ చిత్రం ద్వారా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రుహాని శర్మ కథానాయిక. ఇవాళ సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా ‘వరుడి పేరు అర్జున్.. మరి వధువు పేరేంటి?’ అంటూ ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘సుశాంత్ హీరోగా చేస్తున్న ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. దర్శకుడు రాహుల్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నాం. మే 11న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు కెమెరా: యం.సుకుమార్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారీ. -
లవ్లీ జర్నీ
‘‘రేవన్ యాదు నా కోసం మంచి పాత్రను తీర్చిదిద్దారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. ‘హౌరా బ్రిడ్జ్’ సినిమా బాగా వచ్చింది. అందుకే ప్రమోషన్స్ విషయంలో రాజీ పడటం లేదు. చాందిని, మనాలి చక్కగా నటించారు. శేఖర్ ఎక్స్ట్రార్డినరీ ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమా లవ్లీ జర్నీ’’ అని హీరో రాహుల్ రవీంద్రన్ అన్నారు. ఆయన హీరోగా చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ఈఎమ్వీఈ స్టూడియోస్ పతాకంపై రూపొందిన చిత్రం ‘హౌరా బ్రిడ్జ్’. శేఖర్‌చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘దర్శకుడిగా నా రెండో చిత్రం ‘హౌరా బ్రిడ్జ్’. సినిమా చాలా బాగా తీశాం’’ అన్నారు రేవన్ యాదు. హీరో నిఖిల్, ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, చాందినీ చౌదరి, శేఖర్ చంద్ర, హీరోలు నారా రోహిత్, నవీన్‌చంద్ర, సంగీత దర్శకుడు సాయికార్తీక్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అనుబంధాల వారధి
రాహుల్ రవీంద్రన్, చాందిని చౌదరి, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హౌరా బ్రిడ్జ్’. ఇ.ఎమ్.వి.ఇ స్టూడియోస్ ప్రై లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ‘‘ఈ సినిమాకు ‘హౌరా బ్రిడ్జ్’ అనే టైటిల్ పెట్టడం వెనుక ఓ రీజన్ ఉంది. హ్యూమన్ రిలేషన్స్ ఒక బ్రిడ్జ్ అయితే ఈ సినిమాలో మరో బ్రిడ్జ్ ఏంటి అనేది సస్పెన్స్. చాందిని చౌదరి, మనాలీ బాగా యాక్ట్ చేశారు. దర్శకుడు చాలా క్లారిటీతో ఈ సినిమా తెరకెక్కించారు’’ అని పేర్కొన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘రాహుల్ అద్భుతంగా నటించారు. మంచి ట్విస్టులతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రమిది’’ అని దర్శకుడు అన్నారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, అజయ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 2న విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, కెమెరా: విజయ్ మిశ్రా.