
'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించి చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్..తొలి సినిమాకే నేషనల్ అవార్డు వరించింది. దీంతో రెండో సినిమాకే నాగార్జునను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. మన్మథుడు వంటి క్లాసిక్ హిట్‌కు సీక్వెల్‌గా తీసిన మన్మథుడు-2 బాక్స్‌ఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న రాహుల్..ఈ మధ్యకాలంలో ఓ మంచి కథను సిద్ధం చేసుకున్నాడట.
లవ్ స్టోరీ కథాంశంతో తెరకెక్కనన్ను ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్-2 బ్యానర్‌లో నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బన్నీ వాసుకు కథ నచ్చడంతో ఈ మూవీని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అయితే హీరో హీరోయిన్లు ఎవరు అన్నదానికపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా అన్నపూర్ణ బ్యానర్‌లోనూ మరో మూవీ చేసే అవకాశాన్ని కూడా రాహుల్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా రాహుల్ హీరోగా నటిస్తున్న ది గ్రేట్ ఇండియన్ కిచెన్ తమిళ రీమేక్‌లో రాహుల్‌కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటించనుంది.
చదవండి : మలయాళ డెబ్యూ కోసం కసరత్తులు చేస్తోన్న ఈషా
Rahul Sipligunj: సర్‌ప్రైజ్ లవ్ అనౌన్స్‌మెంట్
Comments
Please login to add a commentAdd a comment