సరికొత్త ప్రేమ కథ | Madhuram movie release on summer | Sakshi
Sakshi News home page

సరికొత్త ప్రేమ కథ

Published Mon, Feb 19 2024 2:53 AM | Last Updated on Mon, Feb 19 2024 2:53 AM

Madhuram movie release on summer - Sakshi

ఉదయ్‌ రాజ్, వైష్ణవీ సింగ్‌

ఉదయ్‌ రాజ్, వైష్ణవీ సింగ్‌ జంటగా రాజేష్‌ చికిలే దర్శకత్వం వహించిన చిత్రం ‘మధురం’. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్మెంట్‌పై యం. బంగార్రాజు నిర్మించిన ఈ సినిమా వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. రాజేష్‌ చికిలే మాట్లాడుతూ– ‘‘1990 నేపథ్యంలో సాగే టీనేజ్‌ లవ్‌స్టోరీ ‘మధురం’. సరికొత్త ప్రేమ కథతో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

అప్పటి స్కూల్‌ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్లకు కట్టినట్లు మా చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు. ‘‘విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే టీనేజ్‌ లవ్‌స్టోరీ ఇది. నా పాత్ర ఆడియన్స్కు కనెక్ట్‌ అవుతుంది’’ అన్నారు ఉదయ్‌ రాజ్‌. ‘‘మా మూవీ పోస్ట్‌ ప్రోడక్షన్  వర్క్స్‌ తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు యం. బంగార్రాజు. ఈ సినిమాకు సంగీతం: వెంకీ వీణ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement