క్రైమ్‌ థ్రిల్లర్‌గా 'ఎవోల్' (EVOL) | Evol A love Story In Reverse New Movie | Sakshi
Sakshi News home page

క్రైమ్‌ థ్రిల్లర్‌గా 'ఎవోల్' (EVOL)

Jun 12 2023 7:06 PM | Updated on Jun 12 2023 7:06 PM

Evol A love Story In Reverse New Movie - Sakshi

టాలీవుడ్‌లో ఒక్కోసారి చిన్న చిత్రాలే మెప్పిస్తుంటాయి. ఇదే కోవలో  సూర్య శ్రీనివాస్‌, శివ  బొద్దురాజు, జెన్నీఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎవోల్‌’. దాని ట్యాగ్‌ లైన్‌ (a love story in reverse) రామ్‌యోగి వెలగపూడి దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తేడా బ్యాచ్‌ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్‌ ల్యాబ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉంది. 

(ఇదీ చదవండి: బాలీవుడ్‌లో కన్నా సౌత్‌లోనే నెపోటిజం ఎక్కువ: అవికా గోర్‌)

దర్శక నిర్మాత రామ్‌యోగి మాట్లాడుతూ 'ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడే అభిప్రాయ భేదాల నేపథ్యంలో సాగే కథ ఇది. డిఫరెంట్‌ జానర్‌ అంశాలతో పాటు వాణిజ్య విలువలతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. కథ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. హైదరాబాద్‌, వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం.  త్వరలో సెన్సార్‌కు ఈ చిత్రం వెళ్లనుంది. ఈ లోపు ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ను విడుదల చేస్తాం. దర్శక నిర్మాతగా నేను చేస్తున్న తొలి ప్రయత్నమిది. ప్రేక్షకుల ఆదరణ కావాలని కోరుతున్నా' అని ఆయన అన్నారు.

(ఇదీ చదవండి: ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో జజర్దస్త్‌ కమెడియన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement