‘‘ఒకసారి సక్సెస్ అయిన తర్వాత దాన్నే పట్టుకొని ఎక్కువ సమయం గడపాలనుకోను. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ప్రయోగాత్మక సినిమాలను ప్రయత్నించాలి. ఈ ఆలోచనే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నాన్నగారికి(అక్కినేని నాగేశ్వరరావు) అంత లాంగ్ కెరీర్, విభిన్నమైన పాత్రలు వచ్చాయంటే కారణం ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుండటమే. ఆయన చేసిన సినిమాలు గమనిస్తే న్యూ ఏజ్ సినిమాలే ఎక్కువగా ఉంటాయి. కొత్తగా ప్రయత్నించడాన్ని నాన్నగారి నుంచి నేర్చుకున్నాను’’ అని నాగార్జున అన్నారు.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. నాగార్జున, పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ –‘‘నాలోని కొత్తదనం కోసం ‘మన్మథుడు 2’ సినిమా తీశాను. ఇండస్ట్రీలో డివైడ్ టాక్ ఉందంటున్నారు. ప్రేక్షకుల్లో మాత్రం సినిమా గురించి పాజిటివ్ టాక్ నడుస్తోంది. మౌత్ టాక్ బాగుంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నిజంగా మా సినిమా ఆడియన్స్‌కు నచ్చకపోతే కలెక్షన్స్ రావు.
నా కెరీర్‌లో మంచి విజయాలు సాధించిన ‘గీతాంజలి, అన్నమయ్య, నిర్ణయం, మన్మథుడు’ సినిమాలు రిలీజ్ తర్వాత కాస్త నెమ్మదిగా పుంజుకున్నాయి. ఈ చిత్రం కూడా అలానే ఉండొచ్చు. అలాగని ఆ సినిమాలతో ‘మన్మథుడు 2’ కి పోలిక లేదు. ‘మన్మథుడు 2’ మంచి న్యూ ఏజ్ మూవీ అంటూ ఫోన్లు చేస్తున్నారు. రొమాన్స్ సన్నివేశాలు మరీ ఇబ్బందికరంగా లేవు. నాకు రొమాన్స్ అంటే ఇష్టం. ప్రేక్షకులు మెచ్చే రొమాంటిక్ సినిమాలు చేయడం ఆసక్తి. ‘మన్మథుడు’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల టైటిల్స్‌ను ఉపయోగించడం వల్ల ప్లస్‌లతో పాటు మైనస్‌లూ ఉంటాయి.
‘బిగ్‌బాస్ 3’ కొత్త అనుభూతి. తెలుగు సినిమాలకు (మహానటి, రంగస్థలం, అ!, చి!ల!సౌ’) ఏడు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు మా సినిమా చూసి నవ్వుతూ, చప్పట్లు కొడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సైలెంట్‌గా క్లైమాక్స్‌ను చూసి థియేటర్స్ నుంచి నవ్వుతూ బయటకు వస్తున్నారు’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘సినిమాకు తొలిరోజు మిక్డ్స్ టాక్ వచ్చినా థియేటర్స్‌లో ఆడియన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు పి. కిరణ్. సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్, రచయిత–నటుడు కిట్టు, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ మాట్లాడారు.
కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా
Published Mon, Aug 12 2019 1:25 AM | Last Updated on Mon, Aug 12 2019 1:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment