కమింగ్‌ సూన్‌ | A big boost to Sushanth's Chi La Sow | Sakshi

కమింగ్‌ సూన్‌

Jul 7 2018 12:41 AM | Updated on Jul 7 2018 12:41 AM

A big boost to Sushanth's Chi La Sow - Sakshi

సుశాంత్, రుహానీ

సుశాంత్‌ హీరోగా నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చి ల సౌ’. ఈ సినిమాతో రుహానీ శర్మ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సిరుని సినీ కార్పొరేషన్‌ పతాకంపై జస్వంత్‌ నడిపల్లి, భరత్‌ కుమార్‌ మలశాల, హరి పులిజల నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘‘రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.

సుశాంత్, రుహానీ బాగా నటించారు. ప్రశాంత్‌ విహారి సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటుంది. సినిమా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. వెన్నెల కిశోర్, జయప్రకాశ్, సంజయ్‌ స్వరూప్, రోహిణి, అనూ హాసన్, రాహుల్‌ రామకృష్ణ, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు నటించిన ఈ సినిమాకు ఎం. సుకుమార్‌ ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రానికి హరీష్‌ కోయాలగుండ్ల ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. ఈ సంగతి ఇలా ఉంచితే నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించనున్న రెండో సినిమా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపైనే తెరకెక్కనుంది. ఈ విషయాన్ని రాహుల్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement