వరుడు అర్జున్‌.. వధువు? | Sushanth's Chi La Sow first look released | Sakshi
Sakshi News home page

వరుడు అర్జున్‌.. వధువు?

Published Sun, Mar 18 2018 1:05 AM | Last Updated on Sun, Mar 18 2018 1:05 AM

Sushanth's Chi La Sow first look released - Sakshi

సుశాంత్‌

సుశాంత్‌ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్‌ పతాకంపై జస్వంత్‌ నడిపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘చి‘‘ ల‘‘ సౌ’. ఈ చిత్రం ద్వారా నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రుహాని శర్మ కథానాయిక.  ఇవాళ సుశాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘వరుడి పేరు అర్జున్‌.. మరి వధువు పేరేంటి?’ అంటూ ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

నిర్మాత మాట్లాడుతూ– ‘‘సుశాంత్‌ హీరోగా చేస్తున్న ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. దర్శకుడు రాహుల్‌ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుతున్నాం. మే 11న ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు కెమెరా: యం.సుకుమార్, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement