నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి, సుశాంత్ హీరోగా తెరకెక్కించనున్న ‘చి ల సౌ’ సినిమా బుధవారం మొదలైంది. తేజ్‌వీర్ నాయుడు సమర్పణలో సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై భరత్‌కుమార్ మలసాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి మలసాల దానమ్మ కెమెరా స్విచాన్ చేయగా, ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణ క్లాప్ ఇచ్చారు.
ఈ సందర్భంగా హీరో సుశాంత్ మాట్లాడుతూ– ‘‘నాకీ చిత్రం న్యూ చాప్టర్ వంటిది. స్వీట్ అండ్ ప్లేజెంట్ లవ్‌స్టోరీ మూవీ. నా మిగతా సినిమాలకంటే డిఫరెంట్‌గా ఉంటుంది’’ అన్నారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ– ‘‘యాక్టర్‌గా నటనను ఎంజాయ్ చేశాను. అయితే డైరెక్టర్ కావాలన్న నా చిన్ననాటి కల ఇప్పటికి నేరవేరింది. డైరెక్టర్‌గా సక్సెస్ అయితే మరిన్ని చిత్రాలను తెరకెక్కించవచ్చు. అయితే నటుడిగా కొనసాగుతాను. ఈ సినిమాలో కొత్త సుశాంత్‌ను చూస్తారు.
రెగ్యులర్ షూట్‌ను నవంబర్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘కొత్తరకం లవ్‌స్టోరీతో ఈ సినిమా తీస్తున్నాం. హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు భరత్. ‘‘హిందూ సంప్రదాయం జోడించి మంచి టైటిల్ పెట్టారు. సినిమా సూపర్‌హిట్ అవ్వాలి. హీరోగా సుశాంత్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు గోవింద్ సత్యానారాయణ. ‘‘తెలుగులో నాకిది మొదటి సినిమా’’ అన్నారు రుహానీ శర్మ. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరీశ్, కెమెరామేన్ ఎమ్. సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment