భూమిక
‘‘నా పాత్ర స్క్రీన్ మీద ఎంత సేపు ఉంటుంది అని కాదు. కథకు ఎంత ఇంపార్టెంట్, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్నది ముఖ్యం. నాకు నాలుగేళ్ల బాబు ఉన్నాడు. వాడికోసం కేటాయించే సమయాన్ని ఓ సినిమాకి ఇవ్వాలంటే అది ఎంతో విలువైనదిగా ఉండాలనుకుంటున్నాను. అద్భుతమైన క్యారెక్టర్, టీమ్ దొరికితే చేస్తా. మా అబ్బాయి స్కూల్, వాడితో స్పెండ్ చేసే టైమ్ మిస్ అవ్వదలచుకోలేదు’’ అని భూమిక అన్నారు. సమంత మెయిన్ లీడ్‌గా ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్’. కన్నడ ‘యు టర్న్’ చిత్రానికి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా భూమిక చావ్లా పలు విశేషాలు పంచుకున్నారు.
► దర్శకుడు పవన్ ‘యు టర్న్’ కథ చెప్పినప్పుడు డిఫరెంట్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నా పాత్ర చిన్నదే అయినా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఒప్పుకున్నాను. ఒరిజినల్ చూశాను. కానీ నా స్టైల్‌లో, దర్శకుడు చెప్పినట్టు చేశాను. ఒరిజినల్‌తో పోలిస్తే కొన్ని కొన్ని మార్పులు చేశాం. నాకు థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. నా సూపర్ హిట్స్‌లో థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి.
► సమంత బ్రిలియంట్ యాక్టర్. సెట్లో తనుంటే మంచి ఎన ర్జీ ఉంటుంది. తన ఎక్స్‌ప్రెషన్స్ అమేజింగ్. సమంతవి ఎక్కువ సినిమాలు కూడా చూడలేదు. రీసెంట్‌గా తన ‘ఈగ, రంగస్థలం’ చూశాను.
► హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు బాగా వస్తున్నాయి. అవి ఇంకా పెరగాలి. కొంచెం టైమ్ పడుతుంది. ఉమెన్ సెంట్రిక్ అంటే ప్రొడ్యూసర్స్ కొంచెం ఆలోచిస్తున్నారు. బట్ అది కూడా త్వరలోనే మారిపోతుంది. ఈ తరహా సినిమాలు కూడా ఎక్కువ రావాలి.
► పెళ్లి అయిపోయిన హీరోయిన్స్‌ని అత్తలు, వదిన పాత్రలకు ఫిక్స్ అయిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. బాలీవుడ్‌లో విద్యాబాలన్ ‘తుమ్హారీ సులూ’ ఎంత బావుంటుంది? జ్యోతిక, రాణీ ముఖర్జీ ఇలా మంచి సినిమాలు చేస్తున్నారు. 40 ప్లస్ ఏజ్ ఉన్న హీరోయిన్స్ మెయిన్ లీడ్‌గా కూడా రాణిస్తారు. దర్శకులు కూడా ఇంకా మంచి ఉమెన్ సెంట్రిక్ స్టోరీలు రాయాలి. ఆడియన్స్ ఆదరించాలి
► కమర్షియల్ సినిమాల్లో మంచి రోల్స్ చేశాను. ఒకే ఒక్క సినిమాతో కంప్లీట్ డిఫరెంట్ యాక్టర్‌గా మారిపోరు. సినిమా సినిమాకి మెల్లిగా మారుతూ వస్తుంటాం.
► జయాపజయాలు నా కెరీర్‌పై ఎప్పుడూ ప్రభావం చూపలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాలీవుడ్ రిలీజ్ ఉన్నప్పుడు ఇక్కడ షూట్‌లో ఉండేదాన్ని. తెలుగు రిలీజ్ ఉంటే నార్త్‌లో ఎక్కడో షూటింగ్ చేస్తుండేదాన్ని. వరుసగా ‘ఎంసీఏ, యు టర్న్, సవ్యసాచి’ సినిమాల్లో అవకాశాలొచ్చాయి. నెక్ట్స్ తమిళంలో రెండు, తెలుగులో రెండు సినిమాలు ఒప్పుకున్నాను.
Comments
Please login to add a commentAdd a comment