న్యూఢిల్లీ: వినియోగ వస్తువుల తయారీ కంపెనీ హావెల్స్ ఇండియా కొత్త రేంజ్ వాటర్ ప్యూరిఫైర్లను మార్కెట్లోకి తెచ్చింది. నీటిలో పీహెచ్ బ్యాలన్స్‌ను కొనసాగిస్తూ, అవసరమైన ఖనిజాలను జత చేస్తూ, శుద్ధమైన నీటిని అందించడం ఈ వాటర్ ప్యూరిఫైర్ల ప్రత్యేకత అని హావెల్స్ ఇండియా తెలిపింది. దేశంలో చాలా తక్కువ మంది వాటర్ ప్యూరిఫైర్లను వినియోగిస్తున్నారని, ఇది అత్యంత అవసరమైన వస్తువని హావెల్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శశాంక్ శ్రీవాత్సవ్ చెప్పారు.
ప్రస్తుతం హరిద్వార్ ప్లాంట్‌లో ఏడాదికి 5 లక్షల వాటర్ ప్యూరిఫైర్లను తయారు చేస్తున్నామని తెలిపారు. వార్షిక తయారీ సామర్థ్యాన్ని రెట్టింపునకు–పది లక్షల యూనిట్లకు పెంచనున్నామని వివరించారు. ప్రస్తుతం ఆరు రకాలైన వాటర్ ప్యూరిఫైర్లను రూ.10,499 నుంచి రూ.23,999 రేంజ్ ధరల్లో ఈ కంపెనీ అందిస్తోంది.
హావెల్స్ ఇండియా నుంచి కొత్త వాటర్ ప్యూరిఫయర్లు
Published Sat, Nov 24 2018 1:49 AM | Last Updated on Sat, Nov 24 2018 1:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment