Water purifier
-
గాల్లో నీరు పుడుతుందే.. తాగితే మస్తుగుంటుందే
సాక్షి, విశాఖపట్నం : ఏంటీ మిషన్. వాటర్ ప్యూరిఫయరా..? యస్.. ఇది స్వచ్ఛమైన నీటిని అందించే మిషన్.. అరె.. దీనిలో నీరు నింపేందుకు పైప్ కనెక్ట్ చెయ్యలేదెందుకు.? అవన్నీ మీకెందుకు..? మీకు కావాల్సింది నీరే కదా.. అవును తాగాలని ఉంది. కానీ...!!!! నీ సందేహంతో పాటు.. దాహం కూడా తీరుతుందిలే. ఆ గ్లాస్ పట్టుకొని.. ట్యాప్ కింద పెట్టి చూడు.. అరే.. నీరు వస్తుంది.. ఇదెలా సాధ్యం..? అదే మ్యాజిక్కు.. మాయా లేదు.. మంత్రం లేదు.. నీటిపైపూ లేదు.. శ్రమా లేదు.. నేను గానీ.. గ్లాస్ పట్టానంటే.. ఈ ప్యూరిఫయర్ నుంచి నీరు రావాల్సిందే... బాబూ... ఆ ట్రిక్ ఏంటో చెప్పు..!!! చెప్తా.. ఈ ప్యూరిఫయర్‌కు నీటి పైప్ అవసరం లేదు. కేవలం గాలిలో ఉన్న తేమను ఆక్సిజన్ని తీసుకొని.. నీటిగా మార్చేసుకుంటుంది. మనకు ఎంచక్కా అందించేస్తుంది. అవునా.. నిజమా..!! నిజం. ఇది కొత్త టెక్నాలజీ.. నీటి ఎద్దడి లేకుండా.. రాబోయే తరాలకు స్థిరమైన భవిష్యత్తును అందించడమే లక్ష్యం అనే కాన్సెప్‌్టతో అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్ దుర్గాదాస్ ఆవిష్కరణ. ఈమె ఒకప్పటి భారత క్రికెట్ క్రీడాకారిణి కూడా. అమెరికా వెళ్లిపోయిన తర్వాత.. యూఎస్ మహిళా టీమ్‌కు కెపె్టన్‌గా కూడా వ్యవహరించారు. ఆమె ఆలోచనల నుంచి పుట్టిందే ఏరోనీరో. మరి.. గాల్లో ఎన్నో రకాల విషవాయువులు కూడా ఉంటాయి కదా.. మరి అందులోంచి తయారైన నీటిలో ఆ విషం ఉండదా.? అదేం ఉండదు. ఇందులో నాలుగు అంచెల వ్యవస్థ ఏర్పాటు చేయడంతో గాలిలోని తేమను పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్‌గా మారుస్తుంది. తొలుత ఎయిర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. దీని ద్వారా గాల్లో మలినాలు తొలగిపోతాయి. అక్కడి నుంచి కార్బన్ ప్యూరిఫికేషన్ ద్వారా అసహ్యకరమైన రుచి, వాసన, రంగు తొలగిపోతాయి. అప్పుడు నీటిగా మారుతుంది. ఆ నీటిని యూవీ ప్యూరిఫికేషన్ చేసి బ్యాక్టీరియాని నాశనం చేస్తాయి. అప్పుడు మినరల్స్ మిళితమవుతాయి. దీని ద్వారా పీహెచ్ లెవల్స్ 7 నుంచి 8.5 పీహెచ్‌గా ఉంటాయి. అంటే.. పూర్తి ఆల్కలిన్ వాటర్‌గా గాలిలో తేమ మారి.. స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. భలేభలే.. మరి రోజుకు ఎన్ని లీటర్లు ఇస్తుందీ ఏరోనీరో..? ఇందులో భిన్నమైన రకాలున్నాయంట. 10 నుంచి 25 లీటర్ల వరకూ ఇంట్లో వినియోగించే ప్యూరిఫయర్లున్నాయి. ఇప్పటి వరకూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాడుతున్నారు. ఈ ప్యూరిఫయర్ల అమ్మకాల లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 1,71,50,920 లీటర్ల నీటిని తయారు చేశారంట. అంతేకాదు.. 6,86,03,680 లీటర్ల నీటిని ఆదా చేశారంట. సంస్థ వినూత్న ఆలోచన, నీటిని ఆదా చేస్తున్న విధానాన్ని మెచ్చి.. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా పొందారు. అద్భుతం కదా.. మరి మీకెక్కడ తారసపడిందీ స్పెషల్ ప్యూరిఫయర్..? ఓ.. అదా.. నగరంలో డీప్‌టెక్ కాంక్లేవ్ జరుగుతోంది కదా.. అక్కడ టెక్ ఎక్స్‌పోలో సంస్థ ప్రతినిధులు దీన్ని ప్రదర్శనకు ఉంచారు. చూస్తే.. అద్భుతమనిపించింది. మేం మాత్రమే తెలుసుకుంటే సరిపోదు కదా.. అందుకే.. ‘సాక్షి’ పాఠకులకీ అందిస్తున్నాం. ఇప్పుడు సరదాగా ఈ ప్యూరిఫయర్‌ను చూసి.. గాల్లో నీరు పుడుతుందే.. తాగితే మస్తుగుంటుందే.. అని పాడుకుందామా....!! -
గాలి శుభ్రం... తీరేను దాహం
ఫొటోలో వాటర్ డిస్పెన్సర్లా కనిపిస్తున్నది ఉత్త వాటర్ డిస్పెన్సర్ మాత్రమే కాదు, అంతకు మించిన అధునాతన యంత్రపరికరం. వాటర్ డిస్పెన్సర్ నుంచి నీరు రావాలంటే, అందులో నీరు నింపాల్సిందే! దీనికి ఆ అవసరమే లేదు. ఇది గాలిలోని తేమనే నీరుగా మార్చి సరఫరా చేస్తుంది. అంతే కాదు, గదిలోని గాలిని శుభ్రపరుస్తుంది కూడా! ఇది టూ ఇన్ వన్ పరికరం. ఎయిర్ ప్యూరిఫయర్ కమ్ వాటర్ డిస్పెన్సర్. గదిలోని గాలిలో నిండి ఉండే దుమ్ము ధూళి కణాలను, సూక్ష్మజీవకణాలను పీల్చేసుకుని, గదిలోని గాలిని నిమిషాల్లోనే శుభ్రం చేస్తుంది. గాలిలోని తేమను ఒడిసిపట్టుకుని, నీటిగా మారుస్తుంది. ఇలా ఇది రోజుకు ఇరవై లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. వేణ్ణీళ్లు కావాలంటే వేణ్ణీళ్లు, చన్నీళ్లు కావాలంటే చన్నీళ్లు క్షణాల్లో సరఫరా చేస్తుంది. ఇది పూర్తిగా విద్యుత్తుతో పనిచేస్తుంది. ‘టాప్ఫ్రెష్’ పేరిట ఒక హాంకాంగ్ కంపెనీ రూపొందించిన దీని ధర 399 డాలర్లు (సుమారు రూ.32 వేలు) మాత్రమే! -
విదేశాల్లో చదువు.. స్వదేశంలో సేవ
సాక్షి, పశ్చిమగోదావరి : విదేశాల్లో చదువుతూ స్వదేశంలో సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు ఎన్ఆర్ఐ విద్యార్థులు. విజయవాడకు చెందిన శౌరీస్ జాస్తి (ఇంటర్ మొదటి సంవత్సరం), హైదరాబాద్‌కు చెందిన రాహుల్ (10వ తరగతి) న్యూజెర్సీలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులు పనికిరాని వ్యర్థపదార్థాలతో వాటర్ ప్యూరిఫైర్ ప్రక్రియను తయారు చేశారు. వీరు తయారు చేసిన ఈ ప్రక్రియకు మెచ్చి న్యూజెర్సీలోని అకాడమి సంస్థలు ఇండియన్ కరెన్సీ రూపంలో రూ.42 లక్షలు ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. ఈ నగదుతో సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో వాటర్ శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా శౌరీస్ జాస్తి, రాహుల్‌లు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నీటిశుద్ధి పరికరాలను పంపిణీ చేస్తున్నారు. వీరు అందిస్తున్న నీటిశుద్ధి పరికరం రూ.3 వేలు. ఇప్పటివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 50 ప్రభుత్వ పాఠశాలలకు నీటిశుద్ధి పరికరాలు పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం మండలంలో కూడా ప్రభుత్వ పాఠశాలలకు ఈ నీటిశుద్ధి పరికరాలు అందజేయాలని మైసన్నగూడెం ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం పీవీ నాగమౌళి వారిని కోరారు. వెంటనే స్పందించిన శౌరీస్ జాస్తి, రాహుల్‌లు జంగారెడ్డిగూడెం మండలంలోని 15 ప్రభుత్వ పాఠశాలలకు నీటిశుద్ధి పరికరాలను ఉచితంగా అందజేశారు. విద్యార్థి దశలోనే వీరిద్దరు చేస్తున్న సేవలకు విద్యాశాఖాధికారులతో పాటు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. శౌరీస్ జాస్తి, రాహుల్ మాట్లాడుతూ తాగే నీరు పరిశుభ్రంగా ఉన్నప్పుడే రోగాలు దరిచేరవని, ప్రభుత్వ పాఠ«శాలలను ఎంచుకుని నీటిశుద్ధి పరికరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. మున్ముందు పేద విద్యార్థులు చేరువయ్యే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని విద్యార్థులు చెప్పుకొచ్చారు. విద్యార్థుల సేవ భేష్ విద్యార్థి దశలోనే శౌరీస్ జాస్తి, రాహుల్‌లకు సేవాదృక్పథం కలగడం నిజంగా అభినందించాల్సిందే. నా కోరిక మేరకు ఈ విద్యార్థులు మండలంలో ప్రభుత్వ పాఠశాలలకు నీటి శుద్ధి పరికరాలు అందిచేందుకు ముందుకు రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. సేవలోనే ఆత్మ సంతృప్తి ఉందని ఈ విద్యార్థులు చేస్తున్న సేవలు అభినందనీయం పీవీ నాగమౌళి, హెచ్ఎం, మైసన్నగూడెం ప్రభుత్వ పాఠశాల -
హావెల్స్ ఇండియా నుంచి కొత్త వాటర్ ప్యూరిఫయర్లు
న్యూఢిల్లీ: వినియోగ వస్తువుల తయారీ కంపెనీ హావెల్స్ ఇండియా కొత్త రేంజ్ వాటర్ ప్యూరిఫైర్లను మార్కెట్లోకి తెచ్చింది. నీటిలో పీహెచ్ బ్యాలన్స్‌ను కొనసాగిస్తూ, అవసరమైన ఖనిజాలను జత చేస్తూ, శుద్ధమైన నీటిని అందించడం ఈ వాటర్ ప్యూరిఫైర్ల ప్రత్యేకత అని హావెల్స్ ఇండియా తెలిపింది. దేశంలో చాలా తక్కువ మంది వాటర్ ప్యూరిఫైర్లను వినియోగిస్తున్నారని, ఇది అత్యంత అవసరమైన వస్తువని హావెల్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శశాంక్ శ్రీవాత్సవ్ చెప్పారు. ప్రస్తుతం హరిద్వార్ ప్లాంట్‌లో ఏడాదికి 5 లక్షల వాటర్ ప్యూరిఫైర్లను తయారు చేస్తున్నామని తెలిపారు. వార్షిక తయారీ సామర్థ్యాన్ని రెట్టింపునకు–పది లక్షల యూనిట్లకు పెంచనున్నామని వివరించారు. ప్రస్తుతం ఆరు రకాలైన వాటర్ ప్యూరిఫైర్లను రూ.10,499 నుంచి రూ.23,999 రేంజ్ ధరల్లో ఈ కంపెనీ అందిస్తోంది. -
వాటర్ ప్యూరిఫయర్ ప్లాంట్‌ను ప్రారంభించిన రోజా
-
ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ జగన్..
సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం టి.సి.అగ్రహారంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫయర్ ప్లాంట్‌ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం విరాళంగా వాటర్ ప్యూరిఫయర్‌ను అందించారు. రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా, అనంతరం స్విచ్ఛాన్ చేసి నీటి పంపిణీని మొదలుపెట్టారు. ఆ తర్వాత నీళ్లు తాగి రూచి చూశారు. ఇచ్చిన మాట ప్రకారం తమ కష్టాలు తొలగించేందుకు ఈ సౌకర్యాన్ని కల్పించిన జననేత వైఎస్ జగన్‌కు స్థానికులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు రాజన్న తనయుడు వైఎస్ ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. -
హావెల్స్ అత్యాధునిక వాటర్ ప్యూరిఫయర్లు
విశాఖపట్నం: ఎలక్ట్రికల్ ఉపకరణాల రంగంలోని ప్రముఖ కంపెనీ హావెల్స్ తొలిసారిగా అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన నీటి శుద్ధి పరికరాలను (వాటర్ ప్యూరిఫయర్) మార్కెట్లోకి విడుదల చేసింది. నీటిలోని పీహెచ్ సమతుల్యతను కాపాడుతూనే రివర్స్ ఆస్మోసిస్ (ఆర్వో) విధానంలో కోల్పోయిన ఖనిజాలను తిరిగి చేర్చే సామర్థ్యం ఈ పరికరాలకు ఉన్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఉత్పత్తులను విశాఖ మార్కెట్లో ఆవిష్కరించిన సందర్భంగా హావెల్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శశాంక్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ... క్రిమిసంహారకాలు, పారిశ్రామిక కాలుష్యాలను సమర్థవంతంగా తొలగించే విధంగా వీటిని రూపొందించినట్టు చెప్పారు. నీటి నాణ్యతను వాటంతట అవే గుర్తించి సురక్షిత, ఆరోగ్యకరమైన నీటిని అందిస్తాయని చెప్పారు. వీటి ధరలు రూ.10,499 నుంచి రూ.23,999 మధ్య ఉంటాయని, రానున్న 3–4 ఏళ్లలో వాటర్ ప్యూరిఫయర్ మార్కెట్లో 10 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. -
తొలి ఏడాది రూ.100 కోట్ల లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దిగ్గజం హావెల్స్ ఇండియా వాటర్ ప్యూరిఫయర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. మంగళవారమిక్కడ డిజిటచ్, డిజిప్లస్, యూటీఎస్, మ్యాక్స్, ప్రో, యూవీ ప్లస్ పేరిట ఆరు నూతన శ్రేణి వాటర్ ప్యూరిఫయర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా హవెల్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శశాంక్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఏటా హావెల్స్ విస్తరణ పెట్టుబడుల్లో భాగంగా వాటర్ ప్యూరిఫయర్ల తయారీ, మిషనరీ ఇతరత్రా వాటికి రూ.100 నుంచి 150 కోట్ల మధ్య ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది. 95 శాతం ప్యూరిఫయర్ల తయారీ హరిద్వార్ ప్లాంట్‌లోనే జరుగుతుంది. ప్లాంట్ సామర్థ్యం ఏటా 5 లక్షల యూనిట్లు’’ అని వివరించారు. ప్రస్తుతం దేశంలో వాటర్ ప్యూరిఫయర్ల పరిశ్రమ రూ.5,800 కోట్లుగా ఉందని. ఇందులో సంఘటిత పరిశ్రమ వాటా రూ.3,500 కోట్లుగా ఉంటుందని తెలియజేశారు. ‘‘ఇప్పటివరకు ఉత్తరాదిలోని 7 రాష్ట్రాలు, 19 నగరాల్లో వెయ్యికి పైగా ప్యూరిఫయర్లను విక్రయించాం. తొలి ఏడాది రూ.100 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ఐదేళ్లలో రూ.500 కోట్లకు పైనే సాధిస్తాం’’ అని తెలియజేశారు. ఆయా ఉత్పత్తుల ధరలు రూ.10,499–23,999 మధ్య ఉన్నాయి. -
ఎందు కాలిడినా.. ప్యూర్ నీరు!
స్వచ్ఛమైన నీళ్లుంటే.. బోలెడన్ని రోగాలను అడ్డుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దురదృష్టం కొద్దీ స్వచ్ఛమైన నీళ్లు దొరకకనే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మరణిస్తున్నారు కూడా. ఎక్కడో విసిరేసినట్టుగా ఉన్న పల్లెటూళ్లలో నీటి శుద్ధికి అవసరమైన యంత్రాలు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ఇకపై ఈ సమస్య అస్సలు ఉండదంటోంది ‘ద ఆఫ్ గ్రిడ్ బాక్స్’. ఈ ఇటలీ కంపెనీ తయారు చేసిన మంచినీళ్ల యంత్రమే మీకు ఫొటోలో కనిపిస్తున్నది. దీంతో ఎక్కడికక్కడ స్వచ్ఛమైన నీళ్లను తయారు చేసుకోవడం మాత్రమే కాకుండా.. కరెంటూ ఉత్పత్తి చేసుకోవచ్చు మరి! ఆరు అడుగుల పొడవు, వెడల్పు, ఎత్తు ఉండే ఈ పెట్టె లోపలి భాగంలో నీళ్లను శుద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ ఉంటే, బయట ఆ యంత్రాలను నడిపేందుకు, కావాల్సిన విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు సోలార్‌ప్యానెల్స్ ఉన్నాయి. సోలార్ప్యానెల్స్కు దిగువన శుద్ధి చేయాల్సిన నీటిని వేడి చేసేందుకు సోలార్హీటింగ్ యంత్రాలూ ఉన్నాయి. దీంతో ప్రత్యేకంగా విద్యుత్తులైన్లు వేసుకోవాల్సిన పనిలేకుండా ఏ మారుమూల ప్రాంతంలోనైనా కలుషిత నీటిని శుద్ధి చేసి అందించేందుకు వీలేర్పడుతుంది. యంత్రాలు వాడుకోగా మిగిలిన విద్యుత్తును ఆయా ప్రాంతాల్లో బల్బులు వెలిగించేందుకైనా, ఫోన్లు చార్జ్ చేసుకునేందుకైనా వాడుకోవచ్చు. మారుమూల ప్రాంతాలలోని నీటిని సైతం ఈ బాక్సుతో శుద్ధి చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి కొంచెం పెద్ద పెద్ద బాక్సులు కూడా దొరుకుతాయి. బేసిక్ మోడల్లో 12 సోలార్ ప్యానెళ్లు, ఇన్వర్టర్, బ్యాటరీలు ఉన్నాయి. ఈ బ్యాటరీతో దాదాపు మూడు ఎల్ఈడీ లైట్లను దాదాపు నాలుగు గంటలపాటు వెలిగించవచ్చు. 1,200 లీటర్ల నీటిని శుద్ధి చేయగల ఈ యంత్రంలో నీటిని నిల్వ చేసేందుకూ ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్కో బాక్స్ ద్వారా కనీసం 1,500 మందికి తాగునీరు అందించవచ్చు. ఆఫ్రికాలోని పేదదేశాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ సీఈవో ఇమిలియానో కొచినీ చెబుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ 1. మంచినీటిని శుద్ధి చేసే ‘ఆఫ్ గ్రిడ్ బాక్స్’. 2. మారుమూల ప్రాంతాలలోని నీటిని సైతం ఈ బాక్సుతో శుద్ధి చేసుకోవచ్చు. -
హెచ్ఎస్ఐఎల్ నుంచి...వాటర్ ప్యూరిఫయర్లు
♦ మూన్‌బో బ్రాండ్‌లో విడుదల ♦ 2018 నాటికి సొంత ప్లాంటు ♦ కంపెనీ కంజ్యూమర్ బిజినెస్ ప్రెసిడెంట్ రాకేష్ కౌల్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సానిటరీవేర్ రంగంలో ఉన్న హెచ్ఎస్ఐఎల్ తాజాగా వాటర్ ప్యూరిఫయర్ల విభాగంలోకి ప్రవేశించింది. మూన్‌బో బ్రాండ్‌లో అయిదు వేరియంట్లను ఆవిష్కరించింది. ధరల శ్రేణి రూ.12,990-26,990 మధ్య ఉంది. అత్యాధునిక హెక్సాప్యూర్ టెక్నాలజీని వీటిలో వాడారు. దీంతో స్వచ్ఛమెన, భద్రమైన మంచినీరు అందుతుందని కంపెనీ కంజ్యూమర్ బిజినెస్ ప్రెసిడెంట్ రాకేష్ కౌల్ ఈ సందర్భంగా బుధవారమిక్కడ మీడియాకు తెలి పారు. అన్ని మోడళ్లకు డిజైన్ పేటెంట్లు దక్కించుకున్నట్టు చెప్పారు. నీటి శుద్ధి విధానానికి సైతం పేటెంటు రానుందన్నారు. కొద్ది రోజుల్లో యూవీ గ్రావిటీ వాటర్ ప్యూరిఫయర్లను విడుదల చేస్తామని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధికి టర్నోవరులో 5-6 శాతం వెచ్చిస్తామని సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పట్టణాల్లోనే ప్యూరిఫయర్లు.. ఆర్వో వాటర్ ప్యూరిఫయర్ల వినియోగం నగరాలకే పరిమితమవుతోంది. దీనికి కారణం ఉత్పత్తులు ఖరీదుగా ఉండడమే. అందుబాటు ధరలో ఉన్న కారణంగా గ్రావిటీ వాటర్ ప్యూరిఫయర్లు తృతీయ శ్రేణి పట్టణాల దాకా విస్తరించాయి. మొత్తంగా దేశంలో ప్యూరిఫికేషన్ పరికరాల వినియోగం 2 శాతమేనని కంపెనీ వెల్లడించింది. రూ.15-20 వేల శ్రేణి వేగంగా విస్తరిస్తోంది. మొత్తం అమ్మకాల్లో ఈ విభాగం వాటా 35 శాతముంది. రూ.10-15 వేల శ్రేణి 25 శాతం, రూ.20 వేలు ఆపైన 8 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. వ్యవస్థీకృత రంగంలో పరిశ్రమ 22-25 శాతం వృద్ధితో రూ.4,000 కోట్లుంది. ఇందులో 9 శాతం వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. పరిశ్రమలో పరిమాణం పరంగా గ్రావిటీ వాటర్ ప్యూరిఫయర్ల వాటా 50 శాతం ఉంది. 10 ఏళ్లలో వ్యవస్థీకృత రంగ వాటా 20 నుంచి 55 శాతానికి ఎగసింది. మూడేళ్లలో టాప్-3 స్థానం.. వాటర్ ప్యూరిఫయర్ల మార్కెట్లో మూడేళ్లలో 10 శాతం వాటాను మూన్‌బో లక్ష్యంగా చేసుకుంది. మూన్‌బో బ్రాండ్‌లో ఎయిర్ ప్యూరిఫయర్లను సైతం హెచ్ఎస్ఐఎల్ విక్రయిస్తోంది. హెచ్ఎస్ఐఎల్ ఇతర బ్రాండ్లలో వాటర్ హీటర్లు, గీజర్లు, కిచెన్ అప్లయెన్సెస్, ఎయిర్ కూలర్లను అమ్ముతోంది. అన్ని విభాగాల్లో వచ్చే మూడేళ్లలో టాప్-3 కంపెనీగా నిలవాలని లక్ష్యంగా చేసుకున్నట్టు రాకేష్ వెల్లడించారు. థర్డ్ పార్టీకి చెందిన ప్లాంట్లలో ఉత్పత్తులను తయరు చేయిస్తున్నట్టు చెప్పారు. వాటర్ ప్యూరిఫయర్ల తయారీకి సొంత ప్లాంటు 2018 నాటికి ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న 5 కేజీల బంగారం స్వాధీనం
విజయవాడ: బంగారాన్ని చిన్న చిన్న రవ్వంత పరిమాణంలోకి మార్చి వాటర్ ప్యూరిఫయర్లలో పెట్టి తరలిస్తుండగా... కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఏపీ కస్టమ్స్ కమిషనర్ మంగళవారం విజయవాడలో ఈ ఘటన వివరాలను విలేకరులకు వెల్లడించారు. మలేసియా నుంచి కోల్‌కతా ఓడరేవుకు వచ్చిన 5 కిలోల బంగారాన్ని... తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి రైల్లో చెన్నైకి తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు సోమవారం ఉదయం రాజమండ్రి రైల్వే స్టేషన్లో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నీటి శుద్ధి యంత్రాల్లో చిన్న రేణువుల రూపంలో ఉంచి తరలిస్తున్నట్టు గుర్తించారు. మొత్తం 5 కిలోల మేర బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్ ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు. -
‘సోలార్’ శుద్ధి
* నీటిశుద్ధి యంత్రాన్ని కనుగొన్న యువకులు * రూ.45వేలతో తయారీ * ఎక్కడైనా ఉపయోగించవచ్చు మణికొండ: విద్యుత్ అవసరం లేకుండా సోలార్‌తో నీటిని శుద్ధి చేసే పరికరాన్ని కనుగొన్నారు నగరానికి చెందిన ఇద్దరు యువకులు. ఈ పరికరాన్ని ఎక్కడికైనా తీసుకువెళ్లి శుద్ధి చేయవచ్చంటున్నారు. తక్కువ ఖర్చుతో రూపొందించిన మొబైల్ శుద్ధి పరికరంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని రూపకర్తలు పేర్కొంటున్నారు. మొబైల్ శుద్ధి పరికరానికి ఐదు సోలార్ ప్లేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో అమర్చారు. వాటిని తెరచి ఎండలో ఉంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆ తర్వాత యంత్రం ద్వారా నీటిని శుద్ధి చేయవచ్చు. ఈ పరికరాన్ని తక్కువ స్థలంలో అమర్చుకోవచ్చు. వ్యవసాయ క్షేత్రాలు, దూరప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు కారులో దీనిని తీసుకువెళ్లొచ్చు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు కార్యాలయాలు, గృహాల్లో ఇంటిపైన నీటి ట్యాంకుల వద్ద దీన్ని అమర్చితే శుద్ధి అయిన నీటిని ఇంట్లోని నల్లాద్వారాతీసుకోవచ్చు. దీనిని రూపొందించిన యువకులు బీఎం.బాలకృష్ణ, మహ్మద్ నసీర్అజీజ్ మంగళవారం మణికొండ శివారులోని ఓయూ కాలనీలో పరికరం పనితీరును విలేకరులకు వివరించారు. ‘ప్రజలు తాగేందుకు స్వచ్ఛమైన నీరు కష్టంగా మారిన ఈ తరుణంలో ఈ యంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రధానంగా తుపాన్లు, వరదలు వచ్చిన ప్రాంతాల్లో ఇవి అనుకూలంగా ఉంటా యి. ఎండలో ఆరు నుంచి 8 గంటల పాటు ఉంచితే 300 నుంచి 350 లీటర్ల నీటిని శుద్ధి చేస్తుంది. నీటిలో ఉండే రంగు, వాసన, బ్యాక్టీరియా, బురదతో పాటు మలినాలను పూర్తిగా తొలగిస్తుంది.’’ అని వారు వివరించారు. కొత్తగా సృష్టించాలనే... ‘పది సంవత్సరాల పాటు విదేశాల్లో పనిచేశాం. మన దేశానికి అవసరమైన ఏదైనా కొత్త పరికరాన్ని సృష్టించాలనే తపనతోనే దీన్ని తయారు చేశాం.’ అని బీఎం. బాలకృష్ణ, మహ్మద్‌నసీర్ అజీజ్ తెలిపారు. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చు. 25 సంవత్సరాల పాటు కొద్ది పాటి నిర్వహణతోనే పనిచేస్తుందన్నారు. రూ. 45 వేల ఖర్చుతోనే దీన్ని తయారు చేశామని, ఆశావహులు వస్తే ఎన్ని కావాలన్నా తయారు చేసి ఇస్తామమన్నారు. ఇతర వివరాలకు 8008363648, 8008553648 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు.