
సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం టి.సి.అగ్రహారంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫయర్ ప్లాంట్‌ను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం విరాళంగా వాటర్ ప్యూరిఫయర్‌ను అందించారు. రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా, అనంతరం స్విచ్ఛాన్ చేసి నీటి పంపిణీని మొదలుపెట్టారు. ఆ తర్వాత నీళ్లు తాగి రూచి చూశారు. ఇచ్చిన మాట ప్రకారం తమ కష్టాలు తొలగించేందుకు ఈ సౌకర్యాన్ని కల్పించిన జననేత వైఎస్ జగన్‌కు స్థానికులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు రాజన్న తనయుడు వైఎస్ ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment