అక్రమంగా తరలిస్తున్న 5 కేజీల బంగారం స్వాధీనం
విజయవాడ: బంగారాన్ని చిన్న చిన్న రవ్వంత పరిమాణంలోకి మార్చి వాటర్ ప్యూరిఫయర్లలో పెట్టి తరలిస్తుండగా... కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఏపీ కస్టమ్స్ కమిషనర్ మంగళవారం విజయవాడలో ఈ ఘటన వివరాలను విలేకరులకు వెల్లడించారు. మలేసియా నుంచి కోల్‌కతా ఓడరేవుకు వచ్చిన 5 కిలోల బంగారాన్ని... తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి రైల్లో చెన్నైకి తరలిస్తున్నాడు.
సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు సోమవారం ఉదయం రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నీటి శుద్ధి యంత్రాల్లో చిన్న రేణువుల రూపంలో ఉంచి తరలిస్తున్నట్టు గుర్తించారు. మొత్తం 5 కిలోల మేర బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్ ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు.