వాటర్ ప్యూరిఫయర్లను విడుదల చేస్తున్న శశాంక్ శ్రీవాస్తవ్. చిత్రంలో హావెల్స్ ఇతర ప్రతినిధులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) దిగ్గజం హావెల్స్ ఇండియా వాటర్ ప్యూరిఫయర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. మంగళవారమిక్కడ డిజిటచ్, డిజిప్లస్, యూటీఎస్, మ్యాక్స్, ప్రో, యూవీ ప్లస్ పేరిట ఆరు నూతన శ్రేణి వాటర్ ప్యూరిఫయర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా హవెల్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శశాంక్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఏటా హావెల్స్ విస్తరణ పెట్టుబడుల్లో భాగంగా వాటర్ ప్యూరిఫయర్ల తయారీ, మిషనరీ ఇతరత్రా వాటికి రూ.100 నుంచి 150 కోట్ల మధ్య ఇన్వెస్ట్‌మెంట్ చేస్తోంది. 95 శాతం ప్యూరిఫయర్ల తయారీ హరిద్వార్ ప్లాంట్‌లోనే జరుగుతుంది. ప్లాంట్ సామర్థ్యం ఏటా 5 లక్షల యూనిట్లు’’ అని వివరించారు.
ప్రస్తుతం దేశంలో వాటర్ ప్యూరిఫయర్ల పరిశ్రమ రూ.5,800 కోట్లుగా ఉందని. ఇందులో సంఘటిత పరిశ్రమ వాటా రూ.3,500 కోట్లుగా ఉంటుందని తెలియజేశారు. ‘‘ఇప్పటివరకు ఉత్తరాదిలోని 7 రాష్ట్రాలు, 19 నగరాల్లో వెయ్యికి పైగా ప్యూరిఫయర్లను విక్రయించాం. తొలి ఏడాది రూ.100 కోట్ల వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం. ఐదేళ్లలో రూ.500 కోట్లకు పైనే సాధిస్తాం’’ అని తెలియజేశారు. ఆయా ఉత్పత్తుల ధరలు రూ.10,499–23,999 మధ్య ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment