సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఎనిమిది మంది వెయిటింగ్‌లో ఉన్న అధికా రులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. సీని యర్ ఐఏఎస్ అధికారులు శశాంక్ గోయల్, శైలజా రామయ్యర్‌ల సేవలను ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ, యువజన సర్వీసుల శాఖలో వినియోగించుకోవాలని నిర్ణయించింది.
ఈ మేరకు వెయిటింగ్‌లో ఉన్న 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్‌కు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్ జనరల్‌గా పోస్టింగ్ ఇవ్వగా, 1997 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్‌ను యు వజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శాట్స్ ఎండీగా, ఆర్కి యాలజీ డైరెక్టర్‌గా ఆమెకు అదనపు బాధ్య తలు అప్పగించింది.
అలాగే వెయిటింగ్‌లో ఉన్న అధికారులు హరిచందన, వర్షిణి, హై మావతి, నిఖిల, సత్యశారదాదేవి, అరుణ శ్రీలకు పోస్టింగ్‌లు ఇచ్చింది. జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రియాంకా ఆలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా నియమించింది. అదే విధంగా ములుగు అద నపు కలెక్టర్‌గా ఉన్న ఇల త్రిపాఠికి అదే జిల్లా కలెక్టర్‌గా, సిద్దిపేట అదనపు కలెక్టర్ ము జమిల్‌ఖాన్‌కు పెద్దపల్లి కలెక్టర్‌గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉన్న అనుదీప్ దురిశెట్టికి హైదరాబాద్ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది.
పెద్దపల్లి కలెక్టర్‌గా ఉన్న సంగీత సత్యనారాయణను టీఎస్ ఫుడ్స్ ఎండీగా, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యను కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శిగా నియమించింది. జగిత్యాల అద నపు కలెక్టర్‌గా ఉన్న మంద మకరందుకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమి షనర్‌గా బాధ్యతలు అప్పగించింది. ప్రభు త్వం మొత్తం 14 మంది అదనపు కలెక్టర్లను ఈసారి బదిలీ చేయడం గమనార్హం
Comments
Please login to add a commentAdd a comment