వెబ్‌ సిరీస్‌లో ఆ‍ర్యన్‌ రాజేష్‌ | Aryan Rajesh In Ekkadiki Ee Parugu Webseries | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 25 2018 10:37 AM | Last Updated on Tue, Dec 25 2018 12:20 PM

Aryan Rajesh In Ekkadiki Ee Parugu Webseries - Sakshi

దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా టాలీవుడ్‌లోహీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆర్యన్ రాజేష్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో కొంత కాలం నటనకు దూరమైన రాజేష్ ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న వినయ విధేయ రామ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు త్వరలో ఓ వెబ్‌ సిరీస్‌తోనూ అలరించేందుకు రెడీ అవుతున్నాడు రాజేష్‌.

జీ5 సంస్థ రూపొందించిన ‘ఎక్కడికి ఈ పరుగు’ వెబ్‌ సిరీస్‌లో ఆర్యన్‌ రాజేష్‌, శశాంక్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 8 నుంచి ప్రసారం కానున్న ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ మూవీ కోసం అన్నపూర్ణ ఫిలిం అండ్‌ మీడియా స్కూల్‌ విద్యార్థులు కూడా పనిచేయటంతో కింగ్‌ నాగార్జున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌లో కల్పిక కీలక పాత్రలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement